NEW DRAGON..6 నెలల్లో 2 సునామీలు…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డేకి బ్లాస్ట్ ఉంటుందనుకుంటే, ముందే దిమ్మతిరిగే అప్ డేట్ ఇచ్చింది డ్రాగన్ టీం. 2027 జూన్ 11న డ్రాగన్ రిలీజ్ అని సాలిడ్ పోస్టర్ తో టైం బాంబ్ పేల్చింది. ఎగ్జాక్ట్ గా 14 నెలల తర్వాత డ్రాగన్ రిలీజ్ ఉండబోతోంది.

Post Published By: dialnews
Updated : 22 April 2026, 6:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డేకి బ్లాస్ట్ ఉంటుందనుకుంటే, ముందే దిమ్మతిరిగే అప్ డేట్ ఇచ్చింది డ్రాగన్ టీం. 2027 జూన్ 11న డ్రాగన్ రిలీజ్ అని సాలిడ్ పోస్టర్ తో టైం బాంబ్ పేల్చింది. ఎగ్జాక్ట్ గా 14 నెలల తర్వాత డ్రాగన్ రిలీజ్ ఉండబోతోంది.అంతే కాదు, గ్లింప్స్ పేలబోతోందని కూడా బర్త్ డే బ్లాస్ట్ ని ముందే కన్ఫామ్ చేశాడు ప్రశాంత్ నీల్. ఐతే పోస్టర్ పేలింది.. అప్ డేట్ అదిరింది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.. ఇక తేలాల్సింది టైటిలే.. డ్రాగన్ వర్కింగ్ టైటిలే తప్ప అసలు డైటిల్ కాదన్నారు. ఇందులో హీరో పాత్ర పేరు మాత్రమే డ్రాగన్ అన్నారు.. మరి టైటిలేంటి? అక్కడే న్యూ డ్రాగన్ పేరు కన్ఫామ్ అవుతోంది.. గ్లింప్స్ మే 20న కాదు ఒకరోజు ముందే అంటే 19న అర్ధరాత్రి రిలీజ్ కాబోతోంది.. ఇంతకి గ్లింప్స్ లో ఏం చూపించబోతున్నారు..6 నెలల్లో రెండు సునామీలు కన్పామ్ అన్న ప్రచారం అర్ధమేంటి?

డ్రాగన్ సునామీకి డేట్ వచ్చింది. 2027 జూన్ 11న డ్రాగన్ రిలీజ్ కాబోతోందని ఫిల్మ్ టీం తేల్చింది. ఐతే గ్లింప్స్ ని ఎన్టీఆర్ బర్త్ డేకి రిలీజ్ చేయబోతున్నట్టు తేల్చిన టీం, టైటిల్ ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇదే కాదు 6 నెలల్లో రెండు సునామిలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అంటే డ్రాగన్ మూవీ నిజంగా రెండు భాగాలుగా రాబోతోందని తేల్చినట్టేనా? ఆరునెల్ల గ్యాప్ లో అంటే ధురందర్ 1, దురంధర్ 2 లానే ఇది సినీ సునామీలు క్రియేట్ చేయబోతోందా?ఈడౌట్లన్ని నిజమయ్యేలా ఉన్నాయి. ముందు టైటిల్ విషయానికొస్తే, డ్రాగన్ మూవీ అసలు టైటిల్ అది కాదు కేవలం వర్కింగ్ టైటిలే అదన్నాడు నిర్మాత.. అలాని అసలు టైటిల్ కూడా మరోకటి అనుకోవటానికి లేదు. ఎందుకంటే అదే డ్రాగన్ కి ముందు న్యూ అన్న పదం యాడ్ అవుతుంది. ఒకటి తమిళ మూవీ డ్రాగన్ టైటిల్ తో రావటం.. అలానే ఎన్టీఆర్ డ్రాగన్ పాన్ వరల్డ్ మూవీగా వస్తుండటంతో, హాలీవుడ్ లోఆ పేరు ఎప్పుడో రిజిస్టరై ఉండటం.

సో రైట్స్ ఇష్యూ వస్తుంది కాబట్టి, న్యూ డ్రాగన్ టైటిల్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ రాబోతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మే 19న పోస్టర్ తో కన్పామ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. ఇక మే 19 అర్ధరాత్రి ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా, గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో కేవలం ఒక పాత్రకు సంబంధించిన విజువల్సే ఉండబోతున్నాయని తెలుస్తోంది.అంటే తాతా, మనవడు ఇలా డ్యూయెల్ రోల్స్ వేస్తున్న ఎన్టీఆర్, రెండు పాత్రల్లో కూడా యంగ్ గానే కనిపిస్తాడంటే, తాత పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయ్యుండొచ్చనే అంచనాలున్నాయి. రెండు పాత్రలే కాదు, రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం వల్లే, ఈజూన్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా, వచ్చే ఏడాది జూన్ కి వాయిదా పడింది. అంతేకాదు మొదటి భాగం 2027 జూన్ లో రిలీజ్ ప్లాన్ చేసి, ఎగ్జాక్ట్ గా ఆరునెల్ల గ్యాప్ తో రెండో భాగం రిలీజ్ చేయాలనుకుంటోంది ఫిల్మ్ టీం.

అంటే 2027 జూన్ 11 న న్యూ డ్రాగన్ ఫస్ట్ పార్ట్, అలానే 2028 జనవరి 11న అంటే సంక్రాంతి సీజన్ లో న్యూ డ్రాగన్ రెండో భాగం రిలీజ్ అయ్యేలా ప్రశాంత్ నీల్ టీం టైం ఫిక్స్ చేసుకున్నట్టుంది. ఇక మే 19న అర్ధారాత్రి ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. రెండు డైలాగ్స్ మిగతాదంతా యాక్షన్ పార్ట్ ఉండేలా, గ్లింప్స్ ఆల్రెడీ ఎడిట్ చేసినట్టు తెలుస్తోంది. గ్లింప్స్ లో ఇలా హీరో డైలాగ్స్ వాడటం ఇదే తొలిసారి.. టీజర్ లో డైలాగ్స్ ఉండే సీన్ ఉండటం కామన్. కాని గ్లింప్స్ లో హీరో డైలాగ్స్ పెట్టి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించేలా ఉంది డ్రాగన్ టీం.

Published : 
  • 22 April 2026, 6:15 PM IST