Top story: ఉక్రెయిన్ వార్‌లో భారత్ ఆర్మీ ఎంట్రీ? వైట్ హౌస్ సీక్రెట్ మీటింగ్ లీక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు…!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అగ్రరాజ్యం అమెరికా వైట్ హౌస్‌లో జరిగిన ఒక అత్యంత రహస్యమైన మీటింగ్‌కు సంబంధించిన సంచలన విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లీక్ అయ్యాయి.

Post Published By: dialnews
Updated : 25 June 2026, 8:15 PM IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అగ్రరాజ్యం అమెరికా వైట్ హౌస్‌లో జరిగిన ఒక అత్యంత రహస్యమైన మీటింగ్‌కు సంబంధించిన సంచలన విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లీక్ అయ్యాయి. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడానికి, అక్కడ రష్యన్లను అడ్డుకోవడానికి ఏకంగా 'భారత సైన్యాన్ని' రంగంలోకి దించుదాం అంటూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఒక మైండ్ బ్లోయింగ్ ప్రపోజల్ పెట్టారు. అయితే ఈ ప్రతిపాదన వినగానే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా షాకై.. 'నో.. నో.. ఇండియన్స్ దీనికి అస్సలు ఒప్పుకోరు' అంటూ ఆ ప్లాన్‌ను అక్కడికక్కడే రిజెక్ట్ చేసేశారు. అసలు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఆ టాప్ సీక్రెట్ మీటింగ్‌లో ఏం జరిగింది? జేడీ వాన్స్ భారత సైన్యాన్ని ఎందుకు పంపాలనుకున్నారు? ట్రంప్ ఎందుకు వద్దన్నారు?

అసలు ఈ విషయాలన్నీ ప్రపంచానికి ఎలా తెలిసాయంటే.. ప్రఖ్యాతి గాంచిన 'న్యూయార్క్ టైమ్స్' పత్రికకు చెందిన టాప్ జర్నలిస్టులు మాగీ హేబర్‌మన్, జోనాథన్ స్వాన్ రాసిన ‘రెజీమ్ చేంజ్’ అనే సరికొత్త పుస్తకంలో ఈ సంచలన నిజాలు బయటపడ్డాయి. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. జనవరి 30న వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్ట్జ్ లాంటి అమెరికా టాప్ లీడర్స్ అందరూ కూర్చుని.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై చర్చలు జరిపారు.

ఈ చర్చల సమయంలో అమెరికా స్పెషల్ ఎన్వాయ్ కీత్ కెల్లాగ్.. ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందం కోసం 'అమెరికా ఫస్ట్ ప్లాన్'ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఒక ప్రతిపాదన తెచ్చారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగిపోయిన తర్వాత అక్కడ శాంతిని కాపాడటానికి.. అమెరికా సైన్యాన్నో లేదా నాటో బలగాన్నో పంపితే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తీవ్రంగా స్పందిస్తారని, అది మరో పెద్ద యుద్ధానికి దారితీస్తుందని వాన్స్ భావించారు. అందుకే రష్యాతో మంచి సంబంధాలు ఉండి, ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన దేశాలుగా పేరు తెచ్చుకున్న 'భారత్' లేదా 'సౌదీ అరేబియా' దేశాల సైన్యాన్ని ఉక్రెయిన్‌లో పీస్ కీపర్స్ గా పెడితే బాగుంటుందని వాన్స్ సలహా ఇచ్చారు.

అయితే వాన్స్ చెప్పిన ప్లాన్‌ను ట్రంప్ వెంటనే కొట్టిపారేశారు. 'ద ఇండియన్స్ వోంట్ డూ దట్.. భారతీయులు ఆ పని అస్సలు చేయరు. పైగా ఇలాంటి వాటి కోసం వారు రూపాయి కూడా ఖర్చు పెట్టరు, దే వోంట్ పే ఫర్ సంథింగ్ లైక్ దట్' అని ట్రంప్ అన్నట్లు ఈ పుస్తకంలో రాశారు. అంతటితో ఆగకుండా ట్రంప్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయని, మోదీకి తనంటే చాలా ఇష్టమని చెప్తూనే.. 'కానీ ఇండియన్స్ దేనికీ అంత ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టరు' అని సరదాగా వ్యాఖ్యానించారట. అంటే అంతర్జాతీయ శాంతి భద్రతల కోసం ఇండియా తన సైన్యాన్ని పంపి ఉచితంగా డబ్బులు తగలేయదని ట్రంప్‌కు బాగా తెలుసు.

నిజానికి భారత్ మొదటి నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఒకే స్టాండ్‌తో ఉంది. యుద్ధాల వల్ల సమస్యలు పరిష్కారం కావు, కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే శాంతి సాధ్యమని ప్రధాని మోదీ పదే పదే చెప్తున్నారు. రీసెంట్‌గా ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కలిసినప్పుడు కూడా మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 'భారత్ ఎప్పుడూ మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది, మేము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటాం' అని మోదీ ప్రకటించారు. అందుకే అమెరికా తన స్వార్థం కోసం లేదా నాటోను కాపాడుకోవడం కోసం భారత సైన్యాన్ని వాడుకుందామని చూస్తే భారత్ ఒప్పుకోదనే పక్కా క్లారిటీ డొనాల్డ్ ట్రంప్‌కు ఉంది.

Published : 
  • 25 June 2026, 8:15 PM IST