సూపర్ MASS ట్విస్ట్.. దేవరే వచ్చి చెబితే…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సూపర్ ట్విస్ట్ రెడీ అయ్యింది. కొరటాల శివ మేకింగ్ లో నటసింహం బాలయ్య సినిమా అనగానే, అంతా ఇక దేవర 2 లేనట్టే అనుకున్నారు. అలానే ప్రచారం పెంచారు. కట్ చేస్తే దేవర 2 విషయంలో ఎన్టీఆర్

Post Published By: dialnews
Updated : 4 May 2026, 5:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సూపర్ ట్విస్ట్ రెడీ అయ్యింది. కొరటాల శివ మేకింగ్ లో నటసింహం బాలయ్య సినిమా అనగానే, అంతా ఇక దేవర 2 లేనట్టే అనుకున్నారు. అలానే ప్రచారం పెంచారు. కట్ చేస్తే దేవర 2 విషయంలో ఎన్టీఆర్ ఎప్పుడో కొరటాలకి క్లారిటీ ఇచ్చాడట. ఆ ధైర్యంతోనే రీసెంట్ గా కొరటాల శివ కూడా దేవర2 పవర్ చూడబోతున్నారన్న సెన్స్ వచ్చేలా ట్వీట్ కూడా పెట్టాడు. ఐతే మరెందుకు బాలయ్యతో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది....? ఇది అసలు సమస్య.. నిజానికి డ్రాగన్ టీం ఇచ్చిన క్లారిటీ వల్లే, కొరటాల శివ చిన్న బ్రేక్ తీసుకుంటున్నాడట... కాని దేవర 2 ఆగేది లేదు. ఆగేలా లేదు.. ఆఖరికి త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకూడా దేవర 2 కి అడ్డు పడే పరిస్థితిలేదు.. ఇదే విషయం ఎన్టీఆరే మరోసారి ఎనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది? తన బర్త్ డే కి డ్రాగన్ ప్రోమో తో పాటు మరో గిఫ్ట్ ఇదేనా?

ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయాల్సిన దేవర సీక్వెల్ లేనట్టే అని అనుకోవటానికి రీజన్, బాలయ్యతో కొరటాల శివ మూవీ.. సడన్ గా ఈ ఇద్దరి కాంబినేషన్ లో పొలిటికల్ రెవెల్యూషనరీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్నట్టు ఎనౌన్స్ మెంట్ వచ్చింది. దేవర 2 విషయంలో ఎన్టీఆర్ నుంచి నో సిగ్నల్ కాబట్టే, ఇలా కొరటాల శివ అబ్బాయ్ తో కుదరంది తన బాబాయ్ తో డీల్ కుదుర్చుకున్నాడన్నారు.కాని ఇక్కడ మాస్ ట్విస్ట్ కనిపిస్తోంది. దేవర2 ప్రాజెక్ట్ ని పక్కన పెట్టే ఉద్దేశ్యం ఎట్టి పరిస్థితుల్లో తనకి లేదని తేల్చబోతున్నాడు ఎన్టీఆర్. అందుకే తన బర్త్ డేనే వేదిక కాబోతోంది. తన పుట్టిన రోజు డ్రాగన్ టీం ప్రోమో బాంబ్ పేల్చబోతోంది. ఆల్రెడీ ఆ విషయం చిన్న పోస్టర్ లుక్ తో ప్రశాంత్ నీల్ రెండు మూడు వారాల క్రితమే తేల్చాడు. అయితే ఈ సారి ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా, రెండు గిఫ్ట్ లు రెడీ అవుతున్నాయి.ఒకటి డ్రాగన్ గ్లింప్స్ అయితే, రెండోది దేవర2 స్పెషల్ ఎనౌన్స్ మెంట్. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయబోయే గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ వల్లే దేవర 2 అటకెక్కేలా ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఐతే ఆ సినిమాకు, దేవర సీక్వెల్ కి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఆవిషయం ఎన్టీఆరే స్వయంగా ప్రకటించబోతున్నాడు.

ఆల్రెడీ గతంలో ఒకసారి దేవర 2 ఉంటుందని తేల్చిన తనే, ఇప్పుడు దేవర 2 డిలేకి కారనం కూడా చెప్పబోతున్నాడట.ఇండస్ట్రీ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ చూస్తే, డ్రాగన్ వల్లే, దేవర 2డిలే అన్న మాట వినిపిస్తోంది. వార్ 2 రిజల్ట్ వల్లే, దాని ఎఫెక్ట్ తో డ్రాగన్ కథలో మార్పులు జరిగాయి.. తీసిన షూటింగ్ లో కొన్ని లోపాలను సరిదిద్దే ప్రాసెస్ వల్ల డ్రాగన్ కాస్త డిలే అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ మిస్ అయినా జూన్ లో రావాల్సిన డ్రాగన్, వచ్చే ఏడాది జూన్ కి వాయిదా పడింది. దీని వల్లే దేవర 2 ని సంక్రాంతి లేదంటే, వచ్చే సమ్మర్ కే మొదలు పెట్టే అవకాశాలున్నాయట.అందుకే ఈలోపు బాలయ్యకి చెప్పిన కథ ఓకే అయ్యిందని, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడు కొరటాల శివ. ఇక త్రివిక్రమ్ తో అనుకున్న ప్రాజెక్ట్ కూడా కొరటాల శివ సినిమా తో ప్యార్ లల్ గా తెరకెక్కేలా, లుక్ తో ఎలాంటి సమస్య రాకుండా, ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మే 20న తన బర్త్ డే కేక్ కట్ చేశాక, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే ఈ విషయం ఎనౌన్స్ చేసే ఛాన్స్ఉన్నట్టు తెలుస్తోంది. ఆ భరోసా ఎన్టీఆర్ నుంచి వచ్చింది కనుకే, మొన్నీ మధ్య దేవర 2 ట్వీట్ ని పోస్ట్ చేస్తూ, కాన్పిడెంట్ గా ఈ హిట్ మూవీ సీక్వెల్ ని గుర్తుచేశాడు కొరటాల శివ.

Published : 
  • 4 May 2026, 5:50 PM IST