తారక్ తర్వాతే అతను… ఇతను…!

కేజీఎఫ్, సలార్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మాస్ సునామీ సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్‌తో కలిసి ఒక గ్లోబల్ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

Post Published By: dialnews
Updated : 23 February 2026, 1:35 PM IST

కేజీఎఫ్, సలార్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మాస్ సునామీ సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్‌తో కలిసి ఒక గ్లోబల్ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ టాపిక్!. ఎన్టీఆర్ 31వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి "డ్రాగన్" అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 100 కోట్ల నుండి 120 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. కేవలం రెమ్యునరేషనే కాకుండా, కొన్ని ఏరియాల పంపిణీ హక్కులు లేదా లాభాల్లో 25% వాటా కూడా ఆయన డిమాండ్ చేసినట్లు టాక్.

ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమా కోసం 50 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను దాదాపు కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోర్డాన్ లో జరుగుతోంది. అక్కడ అత్యంత కఠినమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసుకుని సాంగ్స్ వైపు అడుగులు కదుపుతోందట. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో 'పవర్ వైలెన్స్'ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు.

ఎన్టీఆర్ తన లుక్ కోసం భారీగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమా విడుదల కాకముందే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దాదాపు 125 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్. ఈ సినిమా జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. "రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ రేంజ్ మేకింగ్ ఎన్టీఆర్ కి తోడైతే బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు ఖాయం అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి ఈ కాంబో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Published : 
  • 23 February 2026, 1:35 PM IST