ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ చేయని సాహసం వారణాసి టీం చేస్తోంది. ఆల్రెడీ అంటార్కిటికాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసిన టీం, నిజానికి గ్రీన్ మ్యాట్ లో సెట్ తో సరిపెట్టొచ్చు.. కాని రియల్ లొకేషన్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని అంటార్కిటికా మంచు ఖండంలో ప్లాన్ చేశారు. ఔను ఇంతవరకు నాలుగంటే నాలుగే హాలీవుడ్ సినిమాలు అక్కడ తీశారు.. ఐదో సినిమాగా మన తెలుగు మూవీ వారణాసి రికార్డు క్రియేట్ చేయబోతోంది.గతంలోనే ఈ వార్తలొచ్చినా, ఇప్పడే వాటిని నిజం చేస్తూ అంటార్కిటికా షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది వారణాసి టీం. అంతటితో ఆగితే అది వార్తెందుకు అవుతుంది.. అంతుకుమించేలా ఆర్కిటిక్ మంచు ఖండం మీద కూడా కన్నేశాడు రాజమౌళి. వరల్డ్ ఆడియన్స్ కి తెలుగు సినిమా దగ్గరవ్వాలంటే ఇలాంటి రిస్క్ లు చేయాలనుకుంటున్నాడా? లేదంటే స్క్రిప్ట్ పరంగా తప్పదో కాని ఉత్తర ద్రువం ఆర్కిటిక్, దక్షిణ ద్రువం అంటార్కిటికా .. ఇలా రెండు చోట్లా షూటింగ్ చేసిన రికార్డు వారణాసికే దక్కబోతోందా? ఇంతకి అక్కడ షూటింగ్ ఎప్పుడు? ఎంతకాలం షెడ్యూల్?
1400 కోట్ల భారీ బడ్జెట్ తో ఆల్రెడీ అందరూ షాక్ అయ్యేలా తెరకెక్కుతోంది వారణాసి మూవీ. దీనికితోడు ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కే మొదటి భారతీయ సినిమా ఇదే అని తేల్చారు. ఇప్పుడు ఈ రికార్డుకి తోడు, భూగోలానికి చెందిన ఉత్తర , దక్షిణ ద్రువాల్లో తెరకెక్కే మొదటి ప్రపంచ సినిమాగా కూడా వారణాసికి రికార్డు దక్కేలా ఉంది.వారణాసి షూటింగ్ పూర్తైతే, గిన్నిస్ బుక్ కి కూడా ఫిల్మ్ టీం అప్లై చేసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ గిన్నీస్ ప్రముఖులకు, లెటర్ వెల్లటం వల్లే, ఈ విషయం బయటికొచ్చిందనంటున్నారు.అసలు ఉత్తర దక్షిణ ద్రువాల్లో సినిమా తీస్తే అందులో ఏముంది అంత గొప్ప అన్న డౌట్ రాకుండా ఉండదు.
నిజం చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే ఎందుకు గొప్ప..? అదో సాహసం తో కూడిన ప్రయాణం... వేల మంది ఎక్కొచ్చిు.. కాని ఆశిఖరాన్ని ఎవరు కొత్తగా అధిరోహించినా అదో రికార్డే.. కారణం చాలా ఖటినమైన రిస్కీ సాహసం అది... అచ్చంగా ఇలానే దక్షిన ద్రువం, అంటే అంటార్కిటికీ ఎవరు చేరినా అదోరికార్డే.. అత్యంత ఖటినమైన ప్రదేశం ఆ ఖండం.ఎటుచూసినా కిలోమీటర్ల మందంతో మంచు... ఇంకేముండదు..అలాంటి దక్షిన ద్రువమైన అంటార్కిటికాలో హాలీవుడ్ సినిమాలు 4 తీశారు. ఐదో సినిమాగా వారణాసి రికార్డు క్రియేట్ చేయబోతోంది.
అక్కడ చాలా అడ్వెంచరస్ సీన్లు తీయబోతోంది ఫిల్మ్ టీం. అక్కడితోనే ఆగితే ఇది కేవలం న్యూసే అవుతుంది.. కాని రికార్డు తో కూడిన హిస్టారికల్ అంశం ఎందుకవుతుంది.కానే కాదు.. సో ఇక్కడ హాలీవుడ్ కి కూడా సాధ్యం కాని ఫీట్ ని వారణాసి ఏం చేయబోతోందంటే, దక్షిణ ద్రువమైన అంటార్కిటికాలోనే కాదు, ఉత్తర ద్రువమైన ఆర్కిటిక్ లో కూడా వారణాసి సినిమా షూటింగ్ జరగబోతోంది. ఇలా రెండు ద్రువాల మీద షూటింగ్ చేసిన సినిమా లేదు. కాబట్టి వరల్డ్ వైడ్ గా ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు, వరల్డ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేందుకు ఇది నిజంగా గొప్ప స్ట్రాటజీనే.. అందుకే ఈ ప్లాన్ వేశాడో లేదంటే కథ పరంగా కారణాలున్నాయో కాని, వారణాసి మూవీ మాత్రం ఉత్తర దక్షిన మంచు ద్రువాల్లో కూడా తెరకెక్కటం కన్ఫామ్ అయ్యింది.