సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన రేంజ్ కి హాలీవుడ్ లో ఉండాలి.. ఇది ఒక ఇంటర్వూలో సమంత అన్న మాట. దానికి మహేశ్ బాబు కూడా, ఇలా అనుకునే చాలా మంది షెడ్డుకెళ్లిపోయారని అన్నాడు.. దానర్ధం, మనకెందుకు హాలీవుడ్.. ఇక్కడ సినిమా తీస్తే, అక్కడెక్కడో సౌండ్ రావాలి.. ఇది తన ఫిలాసఫి.. ఐతే వారణాసి పుణ్యమో, మరి తన లుక్స్ మహిమో.. మొత్తానికి సమంత ఊహే నిజమయ్యేలా ఉంది. హాలీవుడ్ నుంచి మహేశ్ బాబుకి బంపర్ ఆఫర్ ఏదో చిక్కేలా ఉంది. ఎక్కడా న్యూస్ రాలేదు.. ఇంకెక్కడా లీకుల షాకులు లేవు.. కాని రాజమౌళి ఈ విషయంలో మహేశ్ ని హాలీవుడ్ కి మరో లా ప్రొజెక్ట్ చేస్తున్నాడా? నెట్ ఫ్లిక్స్ సంస్థ పుణ్యామాని మహేశ్ ఏకంగా హాలీవుడ్ సూపర్ మూవీ చేసేలా ఉన్నాడా? ఇంతకి ఏ సినిమా? ఏజోనర్...? అందుకే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో సుకుమార్, సందీప్ లను హోల్డ్ లో పెడుతున్నాడా?
ఇంతవరకు బాలీవుడ్ హీరోయిన్ పలానా త్రిబుల్ ఎక్స్ హాలీవుడ్ మూవీలో నటించిందనో.. దీపికా తర్వాత ఆలియా అండ్ కో ఏదో సినిమాలో ఇంకేదో రోల్ లో మెరిశారనో విన్నాం.. కాని ఇండియాన్ హీరోలు హాలీవుడ్ మూవీలో కామియోగా కాకుండా, లీడ్ రోల్ లో చేయటం చూశామా? మహేశ్ బాబు, ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ ఈముగ్గురిలో కనీసం ఇద్దరు ఈ మాటని నిజంచేయబోతున్నారు.సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు అది నిజం..కాకపోతే ఇప్పుడు తను వారణాసితో పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ మార్కెట్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. వారణాసి మూవీకి హలీవుడ్ సంస్థలైన డ్రీమ్ వర్క్స్, నెట్ ఫ్లిక్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నాయి.. ఈ ప్రాసెస్ లోనే మన తెలుగు స్టార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హాలీవుడ్ లో దుమ్ముుదులిపే రోజులొచ్చేలా ఉన్నాయి.ఫస్ట్ వారణాసి సినిమాతో వరల్డ్ వైడ్ గా మహేశ్ బాబుకి ఒక ఐడెంటిటీ రావటం కన్ఫామ్.. వారణాసి మరీ ఘోరంగా ఉంటే తప్ప, రాజమౌళి మీద మార్కెట్ కి ఉణ్న కాన్ఫిడెన్స్ తో చూస్తే, వారణాసి యావరేజ్ గా ఆడినా మహేశ్ బాబు పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగుద్ది.. ఇక్కడ అదొక్కటే కాదు, హాలీవుడ్ సినిమాల్లో ఇండియన్ హీరోని పెట్టి ఒకటిన్నర బిలియన్ జనాలను అట్రాక్ట్ చేయాలనేది అమెరికన్ ఫిల్మ్ మేకర్ల ఆలోచన.
ఎప్పటినుంచో ఇలా అనుకుంటున్నారు. కాబట్టే ఆలియా, దిపికా, ప్రియాంక ఇలా చాలా మందికి హాలీవుడ్ లో ఈజీ ఎంట్రీ దొరికింది. కాని మన మార్కెట్ ను వాల్లు కబ్జా చేయాలంటే, మన హీరోలని హాలీవుడ్ సినిమాల్లో తీసుకోవాలి.. అలా చేయాలంటే, ఇండియాని షేక్ చేసేంత స్టామినా, క్రేజ్ ఇక్కడ వాల్లకుండాలి... అందుకే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి అవేంజర్స్ లో సూపర్ హీరో ఆఫర్ దొరికిందనే వార్తలొచ్చాయి.ఇద్దరిలో ఒకరికి అవేంజర్స్ కొత్త సీక్వెల్ లో ఆఫర్ రావటం కన్ఫామ్.. హ్రితిక్ రోషన్, రజినీకాంత్ లాంటి స్టార్స్ ని కూడా హాలీవుడ్ కన్సిడర్ చేసినా, ఒకప్పటి క్రేజ్ వీల్లకి ఇప్పడు కనిపించట్లేదు. రజినీకాంత్ కైతే ఏజ్ ఫ్యాక్టర్ కూడా సమస్యే. గతంలో ఒకసారి తను ఇంగ్లీష్ మూవీలో చేసినా, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. సో ఇక్కడ మఎన్టీఆర్, షారుఖ్ లో ఎవరికి అవేంజర్స్ ఛాన్స్ అని డిస్కర్స్ జరుగుతున్న వేల, సీన్ లోకి మహేశ్ బాబు పేరొచ్చింది.
ఏకంగా జురాసిక్ వోల్డ్ లాంటి మూవీల్లో , లేదంటే సైఫై మూవీల్లో తనకి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ నెట్ ఫ్లిక్స్ సంస్థ వల్ల, రాజమౌళి తన హీరోని పుష్ చేయటం వల్లే అక్కడ జరుగుతోందట. హాలీవుడ్ ఏజెన్సీలే మహేశ్ ని సంప్రదించటం వల్ల, వారణాసి తర్వాత మహేశ్ కి హాలీవుడ్ లోనే డైరెక్ట్ గా మెరిసే ఛాన్స్ రావొచ్చనే స్పెక్కులేషన్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఆ ఆఫర్ ని బట్టే, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ ప్రాజెక్ట్స్ విషయంలో మహేశ్ బాబు ఒక నిర్ణయానికి వస్తాడట. ఇక వారణాసి మూవీ తీయటమే కాకుండా, తన హీరోని హాలీవుడ్ రేంజ్ లో పుష్ చేస్తూ ఎంకరేజ్ చేయటం రాజమౌళికి త్రిబుల్ ఆర్ నుంచి అలవాటే.. ఎన్టీఆర్,చరణ్ కి అమెరికన్ మీడియాలో కావాల్సినంత కవరేజ్ ని క్రియేట్ చేసిన తను, ఇప్పడుమహేశ్ బాబుని ఎలివేట్ చేసే పనిలో ఉన్నాడు.