షారుఖ్ ఖాన్ సడన్ గా ఒక తమిళ్ మూవీలో.. అది ఒక తెలుగు స్టార్ కోసం నటించబోతున్నాడు.. అదే రాకా మూవీ అన్న ప్రచారం పెరిగింది. కట్ చేస్తే ఇక్కడే ఎన్టీఆర్ కి అయిన గా యం గుర్తుచేస్తున్నారు. గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ తో కలిసి తను వార్2 చేస్తే, పాన్ ఇండియా లెవల్లో రావాల్సిన హ్యాట్రిక్ మిస్ అయ్యింది. ప్రభాస్ కూడా ఆదిపురుష్ లో సైఫ్ ఆలిఖాన్ అండ్ కో తో స్క్రీన్ షేర్ చేసుకుంటే పంచ్ పడింది. మెగా స్టార్ చిరంజీవి కోసం సల్మాన్ సీన్ లోకి వస్తే, గాడ్ ఫాదర్ గాడి తప్పింది. ఎలాచూసినా హిందీ మూవీ లో తెలుగు స్టార్, లేదంటే తెలుగు సినిమాలో హిందీ స్టార్ గెస్ట్ గా కనిపిస్తే, డిజాస్టరే.. ఒకటి రెండు గుడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నా, పుష్ప రాజ్ కోసం బాలీవుడ్ బాజీగర్ రంగంలోకి దిగటం మాత్రం షాకింగ్ న్యూసే... రాకా మూవీలో షారుఖ్ కనిపిస్తే, అది మరో ఆదిపురుష్ అవుతుందా? కల్కీ లో అమితాబ్ లా కలిసొస్తుందా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో జవాన్ డైరెక్టర్ ఆట్లీ తీస్తున్న 800 కోట్ల బడ్జెట్ మూవీ రాకా. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాలో, బాలీవుడ్ బాద్ షా గెస్ట్ రోల్ వేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ తో రాకా డైరెక్టర్ ఆట్లీ హిందీలో జవాన్ మూవీ తీశఆడు.1100 కోట్ల వసూళ్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు.సో ఆ కనెక్షణ్ వల్ల, ఆట్లి అడిగాడని, షారుఖ్ ఖాన్ వెంటనే ఒప్పుకున్నాడట. ఇది ఒకరకంగా బ్రహ్మస్త్రలో షారుఖ్ గెస్ట్ రోల్ వేసినట్టే, స్పెషల్ బీస్ట్ రోల్ అయ్యుంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. కాకపోతే, ఇక్కడ సమస్య ఏంటంటే, హిందీవాళ్లతోపెట్టుకుంటే, ఎందుకంటే బాలీవుడ్ బ్యాచ్ తెలుగు హీరోలకి నష్టాన్ని తప్ప లాభం తెచ్చిపెట్టలేదెన్నాడు.
వాళ్లది నిజంగా ఐరన్ లెగ్గో, లేదంటే వాళ్లు ఎంట్రీ ఇస్తే సినిమా లెవల్ పడిపోతుందో కాని, మూవీ రిజల్ట్ మాత్రం రివర్స్ అవుతూనే ఉంది. చిరు తో మొదలు పెడిదే, అమితాబ్ వచ్చాడు సైరా తుస్పుమంది. ప్రభాస్ తో కలిసి సైఫ్ ఆలిఖాన్ ఆదిపురుష్ చేస్తే, అది పోయింది. హ్రితిక్ రోషన్ తో ఎన్టీఆర్ వార్ 2 మూవి చేస్తే, పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్ కొట్టాల్సిన ఎన్టీఆర్ కి మూడో హిట్ బదులు, ఫెల్యూర్ ఎదురైంది.కాకపోతే చిరు సైరాకు కలిసి రాని, అమితాబ్, కల్కీకి ప్లస్ అయ్యాడు. ఆదిపురుష్ లో కలిసి రాని సైఫ్ ఆలిఖాన్, దేవరలో ఎన్టీఆర్ కి ప్లస్ అయ్యాడు. అలా కొంత పాజిటివిటి కూడా ఉంది..కాకపోతే హిందీ వాళ్ల లెగ్గంటే 80పర్సెంట్ నష్టమే అన్ని సెంటిమెంట్ బలపడింది.. అందుకే అల్లు అర్జున్ రాకాలో షారుఖ్ ఎంట్రీ ఇస్తే, మార్కెట్ లో ఇమేజ్, వైబ్స్, క్రెడిట్ అంతా తనకి పోవటమో, రిజల్ట్ తేడా కొట్టడబో జరగొచ్చనే సెంటిమెంటల్ భయాలున్నాయి.
అలా అయితే ప్రియాంక చోప్రా కూడా చరణ్ కి కలిసి రాలేదు. తుఫాన్ మూవీ గట్టెక్కలేదు. అలాంటి తనే వారణాసిలో మహేశ్ బాబుతో జోడీకడుతోంది. అయితే తను బాలీవుడ్ ని వదిలేసి, హాలీవుడ్ లో సెటిలై దశాబ్ధం దాటింది. కాబట్టి తనని బాలీవుడ్ లిస్ట్ లో వేయలేం. ఆలియా త్రిబుల్ ఆర్ లో కలిసొచ్చింది కాబట్టి, డ్రాగన్ లో ఎన్టీఆర్ కి కలిసి రావొచ్చు. అయినా డ్రాగన్ లో ఆలియాది సెకండ్ హీరోయిన్ రోలేనంటున్నారు. కాకపోతే షాహిద్ కపూర్ డ్రాగన్ లో విలనంటేనే నెగెటివ్ సెంటిమెంట్ పరంగా నష్టమేమైనా ఉంటుందా అన్నా సెంటిమెంటల్ భయాలు పెంచేస్తున్నారు. ఇవి జనరల్ ఆడియన్స్ కి సిల్లీగా అనిపించినా, ఇండస్ట్రీలో సెంటిమెంట్అనేది సినిమా స్క్రిప్ట్ కన్న గొప్పది... అందుకే ఆ నమ్మకాలు ఇండస్ట్రీ జనాలను వనికిస్తాయి..ఫ్యాన్స్ ని ఆలోచనలో పడేస్తాయి... ఏదేమైనా కథ కత్తిలా ఉంటే మాత్రం ఐరన్ లెగ్గులు కూడా గోల్డెన్ లెగ్గుగా మారొచ్చు.