Ntr సినిమాతో.. ఇద్దరు సూపర్ స్టార్స్ కి లైఫ్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల ఒక దర్శకుడు గట్టెక్కాడంటే అర్ధం చేసుకోవచ్చు.. ఆల్రెడీ దేవరతో కొరటాల శివ ఇలానే గట్టెక్కాడు. వరుస ప్లాపుల్లో ఉన్నతనతో పాన్ ఇండియా హిట్ తో రాజమౌలి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్, మరోరకంగా కొరటాల శివ ఫేట్ ని కూడా మార్చాడు.

Post Published By: dialnews
Updated : 10 April 2026, 7:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల ఒక దర్శకుడు గట్టెక్కాడంటే అర్ధం చేసుకోవచ్చు.. ఆల్రెడీ దేవరతో కొరటాల శివ ఇలానే గట్టెక్కాడు. వరుస ప్లాపుల్లో ఉన్నతనతో పాన్ ఇండియా హిట్ తో రాజమౌలి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్, మరోరకంగా కొరటాల శివ ఫేట్ ని కూడా మార్చాడు. కట్ చేస్తే ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు పాన్ వరల్డ్ జర్నీలో భాగం అవతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ వరల్డ్ జర్నీకి కూడా తానే కారనమౌతున్నాడు. అలాని ఈ ఇద్దరు హీరోలతో తను కలిసి నటించట్లేదు.. అసలు కలిసి నటించినా ఇంత సీన్ ఉండేది కాదేమో..కాని మహేశ్ బాబు వారణాసి, అల్లు అర్జున్ రాకా రెండీంటిని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా ప్రభావితం చేస్తున్నాడు.. అదెలా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీతో సూపర్ స్టార్ మహేశ్ బాబు తలరాత మారబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫేట్ మారేలా ఉంది. నిజంగా ఇది రెండు పాన్ వరల్డ్ మూవీల ఫేట్ తో కనెక్ట్ అయిన విషయం... ప్రజెంట్ ఇంటర్నెట్ లో ఇదే వార్త వైరలైంది. సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో దాడి చాలా వేడిగా జరుగుతోంది. ఓరకంగా ఇది ఎన్టీఆర్ కి చేతు గ్నాపకాన్ని మిగిల్నే ప్రయత్నంలా కనిపిస్తున్నా. అందులో కూడా ఒకరకమైన సక్సెస్ ఉన్నట్టు కనిపిస్తోంది...ముందుగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎన్టీఆర్ సినిమా ఎలా ఫేట్ డిసైడర్ గా మారిందో చూడాలంటే.. కొంచెం టైం ట్రావెల్ చేయాలి.. కాలంలో వెనక్కి వెళ్లాలి... ఎగ్జాక్ట్ గా 15 ఏళ్ల క్రితం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన మూవీ శక్తి.. మోహర్ రమేష్ బాదితుడిగా ఎన్టీఆర్ ని మార్చింది కూడా ఈ సినిమానే..

ఈ విషయంలో ఎన్నోసార్లు తన మూవీ ఎంతగా మర్చిపోలేని గునపాఠంగా మారిందో, తన మీద తానే సెటైర్లేసుకుంటూ చెప్పాడు.. అలాంటి మూవీ లో ఎన్టీఆర్ తాలూకు రెండు అంశాళు, ఇప్పుడు మహేశ్, బన్నీ పాన్ వరల్డ్ మూవీలకు పనికొస్తున్నాయి.. అదే రుద్ర, అదే రాకా...ఈరెండు పదాలు శక్తి మూవీలోనివే.. అందులో హీరో పేరు రుద్ర... అదే క్యారెక్టర్ ఇప్పుడు వారణాసిలో హీరో వేస్తున్నాడు.. ఇక ఇందులో రాక్షసుడి లాంటి పాత్రలో విలన్ కొడుకు రాకా కనీపిస్తాడు.. ఆ పాత్రతోనే ఆట్లి మేకింగ్ లో అల్లు అర్జున్ మూవీ వస్తోంది.. కేవలం పేర్లు వాడుకుంటే తలరాతలు మారతాయా అనుకోవద్దు.. పేర్లే కాదు పాత్రలు కూడా అవే వాడుతున్నారు.

శక్తిలో హీరో ఒక పురాతన వస్తువుని కాపాడే రుద్రుడిగా కనిపిస్తాడు.. అచ్చంగా వారణాసిలో విశ్వం తలరాత మార్చే పురాతన వస్తువుని వెతికే రుద్రుడిగా మహేశ్ కనిపించబోతున్నాడు. అంటే అచ్చంగా శక్తిలోని పాత్రే.. ఇక ఇందులో విలన్ గా రాక్షసుడిగ కనిపించే రాకా పాత్ర పేరే కాదు, ఆలక్షనాలు ఆట్లీతో బన్నీ చేసే సినిమాలో హీరో పాత్రకి పోలిక కనిపిస్తోంది.. కాబట్టి ఒకప్పటి ఎన్టీఆర్ ని ఫెల్యూర్ తో బాధపెట్టిన మూవీ, ఇప్పడు 15 ఏళ్ల తర్వాత మరో ఇద్దరు హీరోల తలరాతను మార్చేలా ఉంది.. అంత కనెక్సన్ ఉండటంతో, ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరలైంది.

Published : 
  • 10 April 2026, 7:50 PM IST