పిచ్చెక్కి పోతోందా? వారణాసి అంత ఎక్కేసిందా..?

వారాణాసి మూవీ ఏక్షణాన ఒప్పుకున్నాడో కాని, సగం మూవీ పూర్తయ్యే సరికి సూపర్ స్టార్ మహేశ్ బాబుకి పిచ్చెక్కిపోతోందా? ఆ కథ, అందులోని పాత్ర నిజంగా సూపర్ స్టార్ కి అంతగా ఎక్కేసిందా?

Post Published By: dialnews
Updated : 24 February 2026, 4:20 PM IST

వారాణాసి మూవీ ఏక్షణాన ఒప్పుకున్నాడో కాని, సగం మూవీ పూర్తయ్యే సరికి సూపర్ స్టార్ మహేశ్ బాబుకి పిచ్చెక్కిపోతోందా? ఆ కథ, అందులోని పాత్ర నిజంగా సూపర్ స్టార్ కి అంతగా ఎక్కేసిందా? ఈ డౌట్లకు కారణం, సూపర్ స్టార్ మహేశ్ బాబు నెక్ట్స్ మూవీ విషయంలో ఏర్పడ్డ సందేహం... నెక్ట్స్ ఏం చేయాలో ఎప్పుడో మహేశ్ బాబు డిసైడ్ అయ్యాడన్నారు. సందీప్ రెడ్డి వంగ కథ చెప్పాడు.. జేమ్స్ బాండ్ జోనర్ లో సుకుమార్ కథ సిద్దం చేశాడు.. ఇది కాకుండా కొత్త దర్శకుడి సరికొత్త కథకి మహేశ్ బాబు ఫిదా అయ్యాడు.. ఈ మూడు మాటలే గత నెలరోజులుగా ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తున్నాయి. కట్ చేస్తే, మహేశ్ బాబు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఏది కన్ఫామ్ చేయలేకపోతున్నాడా? అంతటికీ వారణాసి కథ వల్ల తనకి మైండ్ బ్లాంక్ అవ్వటమేనా? సగం పైగా షూటింగ్ అయ్యాక మహేశ్ బాబుకి ఏమైంది? వారాణాసి చేశాక, మరో మూవీకి కమిటవ్వాలంటే ఎందుకు తను కన్విన్స్ కాలేకపోతున్నాడు? ఇంతకి తనని ఏది ఆపుతోంది?

వారణాసి మూవీ స్క్రిప్ట్ సూపర్ స్టార్ కి ఎంతగా నచ్చిందో.. అది సగం షూటింగ్ అయ్యాక, అంతకంటే పిచ్చెక్కపోతోందట. కథ, పాత్రలు మొత్తంగా ఈ సినిమానే మహేశ్ బాబుకి ఓరేంజ్ లో ఎక్కేసిందంటున్నారు. ఇలా అంటానికి రీజనుంది... రాజమౌళి విజన్ కి అడిక్ట్ అయిన మహేశ్ బాబు, మరో వైపు చూడలేకపోతున్నాడు.. తనకు సుకుమార్, సందీప్ రెడ్డి చెప్పిన కథలు, జోనర్లు నచ్చాయట.కాని ఎందుకో వారణాసి రీసెంట్ షెడ్యూల్ షూటింగ్ తర్వాత మహేశ్ బాబు మనసు మారిందనంటున్నారు. ఇలా అనటానికి రీజన్, మైండ్ బ్లోయింగ్ రామయణం ఎపిసోడ్ తర్వాత వచ్చే సీన్స్.. అవే ఈ మధ్య షూట్ చేశాడు రాజమౌళి. చెప్పినదానికంటే ఘనంగా ఈ సీన్స్ తెరకెక్కాయని తెలుస్తోంది. అదే మహేశ్ బాబుని కుదురుగా కూర్చోనివ్వట్లేదు.అంటే, స్వీట్ తిన్నాక టీ తాగితే అందులో ఎంత చెక్కరున్నా చప్పగానే అనిపించినట్టు, వారణాసి మూవీ సగం షూటింగ్ అయ్యాక, మరే కథ విన్ని నథింగ్ గా అనిపిస్తోందా?

గతంలోనే సుకుమార్, సందీప్ రెడ్డి వంగ చెప్పిన స్టోరీలైన్లకు, వాటి జోనర్లకు మహేశ్ బాబు ఫిదా అయ్యే ఆ ఇద్దరు దర్శకులతో ఫ్యూచర్ ప్రాజెక్టులుఫిక్స్ చేసుకున్నాడన్నారు.కట్ చేస్తే ఇప్పుడు వారణాసి 50శాతం షూటింగే కాదు, డైనోసార్ల సీక్వెన్స్ తాలూకు ఒక షెడ్యూల్ షూట్ కాగానే మహేవ్ మతిపోయిందట... ఇంత హెవీ యాక్షణ్ ఎపిసోడ్స్, భారీ స్కేల్ మూవీ చేశాక, తను చేసే మూవీ అంతకు మించి లేదంటే, కనీసం వారనాసి రేంజ్ లో అయినా ఉండాలనేది మహేశ్ బాబు అభిప్రాయం.. కేవలం అంటే ఒక్క షెడ్యూల్ తోనే సూపర్ స్టార్ మనసు మారినట్టుంది.అందుకే సుకుమార్ గతంలో చెప్పిన జేమ్స్ బాండ్ జోనర్ కథకి, సందీప్ రెడ్డి వంగ చెప్పిన స్టోరీ లైన్ కి ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ తో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నాడట. అందుకే ఇద్దరికి కాల్స్ వెళ్లాయి.. ఈ ముగ్గురూ రెండు ప్రాజెక్టుల మీద కంబైండ్ గా డిస్కర్స్ కూడా చేసుకున్నట్టు చాలా లేటుగా బయటికొచ్చింది. స్టోరీ లైన్స్ ఓకే కాని వాటి స్కేల్, మేకింగ్ స్ట్రాండర్ట్స్ మాత్రమే కాదు, కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ ఓకే అనుకున్నాకే షూటింగ్ అని కూడా అన్నాడని తెలుస్తోంది. రాజమౌళి శిష్యుడు కొత్తవాడైనా తనకి రాజమౌళి ఆఫర్ ఇచ్చాడనే తెలుస్తోంది. అక్కడ కంటెంట్ మీదే గురి కుదిరాక, మార్పులు చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

Published : 
  • 24 February 2026, 4:20 PM IST