ఒక్కో సీక్వెన్స్ ఒక్కో స్టైల్…!

ప్రస్తుతం యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న ఏకైక సినిమా 'వారణాసి'. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఎస్. ఎస్. రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ

Post Published By: dialnews
Updated : 10 March 2026, 12:20 PM IST

ప్రస్తుతం యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న ఏకైక సినిమా 'వారణాసి'. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఎస్. ఎస్. రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ గురించి ప్రతి చిన్న వార్త నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఒక కీలకమైన ఫైట్ సీక్వెన్స్ గురించి వచ్చిన అప్‌డేట్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. రాజమౌళి ఈసారి కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచాన్ని తన విజువల్స్ తో షేక్ చేయబోతున్నారు. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ అంటే కేవలం దెబ్బలాటలు మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. 'వారణాసి' కోసం ఆయన అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్లను రంగంలోకి దించారు.

ఈ సినిమాలో మహేష్ బాబు మరియు విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య వచ్చే ఒక భారీ ఫైట్ సీక్వెన్స్‌ను మంచు కొండల నేపథ్యంలో ప్లాన్ చేశారు. రీసెంట్‌గా జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం, ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం అంటార్కిటికా వెళ్తోంది. అంటార్కిటికాలోని 'రోస్ ఐస్ షెల్ఫ్' వద్ద ఒక హై-ఓల్టేజ్ యాక్షన్ సీన్ చిత్రీకరించబోతున్నారు. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం!

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ యాక్షన్ ఎపిసోడ్ ఎడిట్ చేసిన వెర్షన్‌ను రాజమౌళి తన సన్నిహితుడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చూపించారట. ఆ ఫైట్ చూసి తారక్ షాక్ అయ్యారని, 'జక్కన్న.. ఇది నెక్స్ట్ లెవల్ లో ఉంది' అని ప్రశంసించారని ఇండస్ట్రీ టాక్. ఈ ఫైట్‌లో మహేష్ బాబు తన కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా ఒక 'బీస్ట్ మోడ్' లో కనిపిస్తారని సమాచారం. ముఖ్యంగా 400 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్లో మోషన్ కెమెరాలను ఉపయోగించి, ప్రతి చిన్న మైక్రో డీటెయిల్‌ను రాజమౌళి క్యాప్చర్ చేస్తున్నారట.

వారణాసి సినిమాలో ఒక ప్రత్యేకమైన రామాయణ ఎపిసోడ్ కూడా ఉంది. దీని కోసం దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ చేశారని తెలుస్తోంది. ఈ మైథాలజీ కనెక్షన్ ఉన్న యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మహేష్ బాబు ఇందులో 'రుద్ర' అనే పాత్రలో ప్రపంచం మొత్తం తిరిగే అడ్వెంచరర్‌గా కనిపిస్తుంటే, పృథ్వీరాజ్ 'కుంభ' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో ఢీకొట్టబోతున్నారు. ఈ ఇద్దరి మధ్య వార్ చూస్తుంటే  ఈ సినిమా ఏప్రిల్ 7,స్క్రీన్ పగిలిపోవాల్సిందే 2027న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

Published : 
  • 10 March 2026, 12:20 PM IST