సూపర్ స్టార్ లేకుండా.. మంచుకొండల్లో “MIND”BLOCK..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు లాస్ ఏంజెల్స్ లో ఏం చేస్తున్నాడు.. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో ఎందుకు వెళ్లబోతున్నాడు... అసలు తను లేకుండా అంటార్కిటికాలో వారనాసి షూటింగ్ ఏంటి.. అందుకోసం ఇక్కడ హైద్రబాద్ లో సెట్ వేయాల్సిన అవసరమేంటి?

Post Published By: dialnews
Updated : 24 April 2026, 8:10 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు లాస్ ఏంజెల్స్ లో ఏం చేస్తున్నాడు.. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో ఎందుకు వెళ్లబోతున్నాడు... అసలు తను లేకుండా అంటార్కిటికాలో వారనాసి షూటింగ్ ఏంటి.. అందుకోసం ఇక్కడ హైద్రబాద్ లో సెట్ వేయాల్సిన అవసరమేంటి? ఇలాంటి టైంలో మెక్సికోలో వారనాసి తాలూకు ఎక్స్ క్లూజివ్ ఫుటేజ్ రివిల్ చేస్తున్నారంటే అసలేం జరుగుతోంది... ఒకవైపు ఒకటి తర్వాత ఒకటి అప్ డేట్ రాబోతున్నాయని ఫ్యాన్స్ పండగ చేసుకునే పరిస్థితి..మరోవైపు మైండ్ బ్లాంక్ చేస్తున్న ఎన్నో ప్రశ్నలు... ఇంతకి మహేశ్ బాబు మరో కొత్త లుక్ కోసమే యూఎస్ వెళ్లాడా? సమ్మర్ వెకేషన్ అని రాజమౌళి టీం చెప్పినా, తెరవెనక ఏదో జరుగుతోందా? అంటార్కిటికీ షెడ్యూల్ లో హీరోతో అసలు పనేలేదా? మెక్సికోలో వారణాసి టీం ఎలాంటి బాంబు పేల్చబోతోంది?

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేకుండా, వారణాసి షూటింగ్ అన్న మాటే విచిత్రంగా ఉంది. తనేమో యూఎస్ కి వెళ్లి వారణాసిలో రెండో లుక్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. మరి అది క్రాఫ్ పరంగానా; లేదంటే మజిల్స్ పెంచి, మరోలా మారతాడా అన్నది తేలాలి. ప్రస్తుతానికి ఇది మాత్రం కేవలం ప్రచారమే.. తను యూఎస్ నుంచి హైద్రబాద్ కి డిఫరెంట్ లుక్ తో వస్తే మాత్రం, తనక్కడికి వెళ్లింది కొత్త లుక్ కోసమే అని కన్పామ్ అవుతుంది.అంటే వారణాసిలో మరో పాత్ర కోసం మహేశ్ తన లుక్ మార్చుకున్నాడని, ఆ పాత్ర తాలూకు షూటింగ్ మొదలౌతోందని పరోక్షంగా తేలుతుంది. ఇక తేలాల్సింది అంటార్కిటికా షెడ్యూల్.. ఆల్రెడీ అంటార్కిటికా సెట్ ని దేవర సెట్లో రీసెట్ చేసి, కొంత షూటింగ్ చేసింది ఫిల్మ్ టీం. అయితే ఇది కేవలం ప్రివ్యూకోసం చేసిన ప్రయత్నమే అని తెలుస్తోంది.

అది సినిమాలో వాడరని కూడా తెలుస్తోంది. అంటార్కిటికా మంచు ఖండంలో షూటింగ్ అంటే తేలిక కాదు. ఎముకలు కొరికేచలి, మంచుమీద అడుగేస్తే ఎక్కడ ఎంత పెద్ద లోయ ఉంటుందో తెలియదు. అందుకే ముందే ఎక్స పర్ట్స్ ని పంపి షూట్ చేయాలనుకున్ లొకేషన్ రెక్కీ చేయటమే కాదు, దాన్ని దేవర సెట్లో రీసెట్ చేసి శాంపిల్ షూట్ చేశారట.ఈ అనుభవంతో, అసలు లొకేషన్ అయిన అంటార్కిటికాలో రియల్ షూట్ ని ఐమ్యాక్స్ లో ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం.ప్రజెంట్ వెకేషన్ బ్రేక్ లోఉన్నా మహేవ్, జూన్ నుంచి అంటార్కిటికా షెడ్యూల్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. తను లేకుండా, వారణాసిలో కవరింగ్ షాట్స్ ని మాత్రం రాజమౌళి తన సెకండ్ యూనిట్ ని పంపి షూట్ చేయిస్తోంది. తను, మహేశ్ ఇద్దరూ జూన్ నుంచి అంటార్కికిటా అసలు షెడ్యూల్ కి వెళతారని సమాచారం అందుతోంది.ఇక వారనాసి టీజర్ మెక్సికోలో కామిక్ కామ్ షోలో టెలికాస్ట్ చేసే అవకాశాలున్నాయని తెులస్తోంది. లాటిన్ అమెరికా మార్కెట్టే టార్గెట్ గా ఇలా ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీం. సో మహేష్ బాబు కొత్త లుక్, తను లేకుండా అంటార్కిటికాలో పాసింగ్ షాట్స్ షూటింగ్, అలానేమెక్సికోలో వారణాసి టీజర్ రివీల్ చేయటానికి రీజన్ అన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తుంటే, సైలెంట్ గా రాజమౌలి బ్రహ్మాండమే బద్దలయ్యే పని చేస్తున్నాడనిపిస్తోంది... జూన్ లో సెన్సేషనల్ ఎనౌన్స్ మెంట్స్ ఏవైనా రావొచ్చనే మాట మాత్రం ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తూనే ఉంది.

Published : 
  • 24 April 2026, 8:10 PM IST