సూపర్ స్టార్ మహేశ్ బాబు తోరాజమౌళి తీస్తున్న సినిమా టీజర్ మోస్ట్ లీ ఆగస్ట్ నెల్లో రావటం పక్కా అని తెలుస్తోంది. కాని జస్ట్ ఇమాజిన్, ఈనెల్లోనే టీజర్ వచ్చేస్తే ఎలా ఉంటుంది.. అదికూడా ఈ వారంలోనే వారణాసి టీజర్ ని మనం చూసేస్తే ఇంకెలా ఉంటుంది. ఐనా ఆగస్ట్ 15 కి టీజర్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తూ, వారణాసి టీం, సడన్ గా ఇలా టీజర్ ఎందుకు లాంచ్ చేస్తుంది? ఖచ్చితంగా చేయదు.. కనీసం ప్రచారం చేసో, ఎనౌన్స్ మెంట్ ఇచ్చో టీజర్ లాంచ్ చేసేవాల్లు.. కాని నిజంగానే ఇవేవి లేకుండా, వారణాసి టీజర్ ని ఈ వారం, అది కూడా ఈ శుక్రవారమే రిలీజ్ చేయబోతున్నారు.. అది కూడా చాలా ఎక్స్ క్లూజివ్ అని తెలుస్తోంది.. ఇంతకి ఈ టీజర లాంచ్ ఎక్కడ? ఎందుకు ఇంత సడన్ గా రిలీజ్ చేస్తున్నారు? ఎందుకు ఆ విషయం చెప్పకుండా, సైలెంట్ అయ్యారు? ఇంతకి టీజర్ లో ఏం ఉండబోతోంది?
జస్ట్ ఇమాజిన్ మరో 12 నుంచి 18 గంటల్లో మహేశ్ బాబు వారనాసిటీజర్ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఆ షాక్ తో కోమాలో కాసేపు ట్రావెల్ చేసొస్తారు... కామన్ ఆడియన్స్ ఇదే వెరైటీ సర్ ప్రైజ్ అని షాక్ అవుతారు.. కాని ఈ శుక్రవారం అలాంటి అణుబాంబే పేల్చబోతున్నాడు రాజమౌళి. ఎందుకు ఏమిటనే ప్రశ్నలకు సమాధానం కూడా షాకింగ్ గానే అనిపిస్తుంది.వారనాసి విషయంలో రాజమౌళి ఎప్పుడు సడన్ గా ఎలాంటి బాంబు పేలుస్తాడో చెప్పలేం. ఈ సినిమా ను సీక్రెట్ గా మొదలు పెట్టి, సడన్ గా హీరో లుక్ రిలీజ్ చేశాడు. తర్వాత పోస్టర్, ఆతర్వాత టైటిల్ ని, కాన్సెప్ట్ గ్లింప్స్ ని ఏకంగా ఈవెంట్ తో రివీల్ చేశాడు. ఇక టైటిల్ సాంగ్, విలన్ సాంగ్ తర్వాత, ఏకంగా ఇంటర్వూలు పెట్టి, సినిమా తాలూకు చాలా ఇన్ ఫర్ మేషన్ ఇచ్చేశాడు.
ఇదంతా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ మీద ప్రేమతోనో, పాన్ ఇండియా ప్రేక్షకుల మీద అభిమానం తోనో చేయలేదు. అంతా ప్రమోషనే.. ఇలా చేస్తే అలా కలిసొస్తుంది, అంటే ఎలాంటి షాకింగ్ నిర్ణయాలకైనా రాజమౌలి రెడీ. అందుకే ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా, ఈ శుక్రవారమే టీజర్ ని లాంచ్ చేయబోతున్నాడు.. అది ఎవరికి తెలుగువాళ్లకి కాదు..తమిళ్ బ్యాచ్ కి కాదు.. అసలు ఇండియన్స్ కి ఈ టీజర్ చూసే భాగ్యమే లేదు.కేవలం మెక్సికన్లే ఔను... మెక్సికోలో జరిగుతున్న కామిక్ కాన్ ఫెస్టివల్ లో రాజమౌలి తీసిన ఈగ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరుగబోతోంది. అది శుక్రవారమే అని తెలుస్తోంది. తన మేకింగ్ లో వచ్చిన వెరైటీ సినిమాలకు మెక్సికన్ కామిక్ కాన్ ఫెస్టివల్ ఇస్తున్న ప్రయారిటీ ఇది. వరల్డ్ వైడ్ గా ఇలాంటి వెరైటీ ప్రయోగాల తాలూకు సినిమాలు అక్కడ స్పెషల్ గా స్క్రీన్ చేయబోతున్నారు.
అయితే అక్కడే ఎక్స్ క్లూజీవ్ గా వారణాసి స్పెషల్ విజువల్స్ స్క్రీన్ చేయబోతున్నారట. ఇదోరకంగా లాటిన్ అమెరికా, అంటే మెక్సికో, బ్రేజిల్, ఇలా సౌత్ అమెరికా మార్కెట్ లో వారనాసి ప్రమోషన్ కి ఉపయోగ పడుతుంది. అందుకే ఇండియాలో పెద్ద ఈవెంట్ లా ప్లాన్ చేసి రిలీజ్ చేయాల్సిన విజువల్స్ ని అక్కడ మెక్సికోలో కామీక్ కాన్ ఫెస్టివల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎక్స్ క్లూజివ్ విజువల్స్ అంటే, ఎవరూ చూడనివి, అలాంటివాటితో వచ్చే ఏదైనా టీజర్ తో సమానమే.. అందుకే ఆగస్ట్ 15 కి రివీల్ అనుకున్న వారణాసి టీజర్, ఈ శుక్రవారం మెక్సికోలో రిలీజ్ అవుతుందనే అభిప్రాయం కలుగుతోంది.ఇక ఇందులో కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా, ఎమోషనల్ కంటెంట్ కూడా రిలీజ్ చేస్తున్నారట. అసలు ఆ కామిక్ కాన్ ఫెస్టివల్ ఉద్దేశ్యమే, డిఫరెంట్ ఎమోషనల్ కంటెంట్ ని గ్రాఫికల్ గా ఎలా నెరేట్ చేస్తారో వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం. ఈ క్లూస్ అన్ని అధారంగా చేసుకుంటే, ఆల్ మోస్ట్ వారణాసి టీజర్ లాంటి వీడియోలు మెక్సికోలో రివీల్ అవటం ఖాయంగా కనిపిస్తోంది.