1400 కోట్ల వారణాసి రిలీజైందే అనుకుందాం? ఎంతొస్తుంద.. కొందరేమో 3 వేల కోట్లంటున్నారు. ఇంకొదరు 5 వేల కోట్లతో చరిత్ర స్రుష్టిస్తుందనంటున్నారు. ఇంకొదరు ఏకంగా 10 వేల కోట్ల రేంజ్ కి రీచై, హాలీవుడ్ కి మాస్టర్ స్ట్రోక్ ఇస్తుందనంటున్నారు.. ఇదెలా సాధ్యం.. మన ఇండియన్ సినిమా ఎంత దుమ్ముదులిపినా, 2వేలకోట్లు, మహా అయితే 3 వేలకోట్లకు మించి వసూళ్లు రావని తేలింది. దంగల్, ధురందర్, బాహుబలి, పుష్ప ఏది చూసినా 2వేలకోట్లు తప్ప 3 వేల కోట్లని టచ్ చేసింది లేదు.. అలా అయితే 1400 కోట్ల బడ్జెట్ తో వారణాసి తీయటం అంటే, డెఫినెట్ గా తెలివి తక్కువ విషయమే.. కాని అక్కడే బాహుబలి ఫార్ములాని మనం గుర్తుచేసుకోవాలి. మన మార్కెట్ చిన్నదైదే, కొత్త మార్కెట్ ని కబ్జా చేయాలి.. అలానే బాహుబలి రేంజ్ పెరిగింది. ఇప్పడు వారణాసి కూడా వరల్డ్ సినిమాగా రాబోతోంది. అంటే ఎక్కడెక్కడ వారణాసితో, ఇండియన్ సినిమాకు కొత్త మార్కెట్ల గేట్లు తెరుచుకుంటాయి? అమెరికానా? యూరోపా? లేదంటే లాటీన్ అమెరికా దేశాలా? సౌత్ ఆసియా కంట్రీసా? ఒకసారి రియలిస్టిక్ గా చూస్తే, ఏఏ మార్కెట్ లో వారణాసి వండర్స్ చేస్తే, 5 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల రేంజ్ కి రీచ్ అయ్యే ఛాన్స్ఉంది... లెక్కలు చూస్తే రాజమౌళి దర్శక ధీరుడనాల్సిందే.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి 1400 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడంటే ఎవరూ కామెంట్ చేయలేదు. ఇంకెవరూ ఆశ్చర్య పోలేదు. ఒకప్పుడు ఇదే రాజమౌళిని 280 కోట్లు పెట్టి బాహుబలి తీస్తే, పిచ్చన్నారు. మన మార్కెట్టే 200 కోట్లు మించదు అసలు బుర్రుందా అన్నారు. కాని 1400 కోట్లు అంటే, త్రిబుల్ ఆర్ టోటల్ కలెక్షన్స్.. అంత పెట్టి వారణాసి తీస్తుంటే, ఒక్కరంటే ఒక్కరు కూడా రాజమౌళిని ఏమనట్లేదెందుకు?కారణం బడ్జెట్ కాదు, మార్కెట్ ముఖ్యం... మన మార్కెట్ చిన్నదైతే, అప్పుడు కొత్త మార్కెట్లు వెతుక్కోవాలి... బాహుబలితో రాజమౌళి అదే పాఠం అందరికీ నేర్పాడు. కాబట్టే పాన్ ఇండియా ఫార్ములా కొత్తది కాకున్నా, పాన్ ఇండియా సినిమాలకు ప్రాణం పోసింది మాత్రం జక్కన్న చెప్పిన పాఠమే.. అందుకే 200 కోట్ల మార్కెట్ ఉన్న టాలీవుడ్ లో 280 కోట్లతో భాహుబలి రెండు భాగాలు తీసి, ఒకదాంతో 580 కోట్లు, మరో దాంతో 1850 కోట్లు రాబట్టి, 2400 కోట్ల వసూళ్ళు రాబట్టగలిగాడు.
అలా తెలుగు సినిమాకు, బాలీవుడ్, కోలీవుడ్,మాలీవుడ్, శాండిల్ వుడ్ తోపాటు ఐదు భాషల్లో ఓవర్ సీస్ మార్కెట్ కలిసొచ్చింది.జపాన్ మార్కెట్ తోడైంది... చైనా, రష్యా, జర్మనీలో కూడా బాహుబలి, త్రిబుల్ ఆర్ కి వసూల్ల వరద కొంతవరకు వచ్చినట్టైంది.. అలా ఇప్పుుడు వారణాసి కొత్త మార్కెట్లో మన సినిమాను వెలిగేలా చేయబోతోంది. ముందు అమెరికాలో ఉన్న తెల్లోల్లని గట్టిగా కొట్టేయాలని వారణాటి టీం గురిపెట్టింది.అక్కడి నుంచి కనీసం 3 వేల కోట్ల పైనే రాబట్టాలి.. యూరప్ నుంచి 2 వేల కోట్లు.. ఇక చైనా , జపాన్, కొరియా, ఇండోనేషియా, మలేసియా నుంచి కనీసం వెయ్యికోట్లు. ఆఫ్రికా దేశాల నుంచి 1000 కోట్లు, లాటిన్ అమెరికా దేశాలైన బ్రేజిల్ .. అలానే సౌత్ అమెరికా దేశమైన బ్రేజిల్ నుంచి కనీసం 1000 కోట్లు వస్తే.. ఇండియా లో అన్ని భాషలు, ఓవర్ సీస్ లో అన్ని భాషల పరంగా కనీసం 3 నుంచి 4 వేల కోట్లు వచ్చే, ఛన్స్ ఉంది. ఇదే జరిగితే 5 వేల కోట్లు కాదు, పది నుంచి 12 వేల కోట్ల వరకు వారణాసి వసూల్లు రాబట్టొచ్చు.ఇదే జరిగితే పాన్ ఇండియా మార్కెట్ ని ఎలా బాహుబలితో రాజమౌలి సెట్ చేశాడో, అలా పాన్ వరల్డ్ ట్రెండ్ ని రాజమౌళి సెట్ చేసిన వాడవుతాడు.. ఇదే జరిగితే హాలీవుడ్ మూవీస్ తర్వాత పదివేల కోట్ల రేంజ్ కి మరో ఇండస్ట్రీ మూవీ ఎదిగిందంటే అది తెలుగు సినిమానే... అదే జరిగితే హిస్టరీలో రాజమౌళి పేరు నిలిచిపోతుంది.. హాలీవుడ్ మీద ఇండియన్ సినిమాల దాడి మొదలౌతుంది... అంత ధైర్యం, సీన్ మన మిగతా సినిమాలకు వచ్చే ఛాన్స్ఉంది.