ఇంటర్నేషనల్ SuperHero.. మననుంచి First…!

హనుమాన్, క్రిష్ లాంటిసూపర్ హీరోల కాన్సెప్టులు ఇండియాలో పేలాయి... మున్నార్ మురళి కూడా బానే ఆడింది.. కాని ఇంటర్నేషనల్ రేంజ్ లో ఒక ఇండియన్ సూపర్ హీరో దూసుకెళితే ఎలా ఉంటుంది... అదే వారణాసితో నిజం కాబోతోందా?

Post Published By: dialnews
Updated : 2 May 2026, 6:50 PM IST

హనుమాన్, క్రిష్ లాంటిసూపర్ హీరోల కాన్సెప్టులు ఇండియాలో పేలాయి... మున్నార్ మురళి కూడా బానే ఆడింది.. కాని ఇంటర్నేషనల్ రేంజ్ లో ఒక ఇండియన్ సూపర్ హీరో దూసుకెళితే ఎలా ఉంటుంది... అదే వారణాసితో నిజం కాబోతోందా? వారణాసి సూపర్ హీరో మూవీ అని ఎక్కడా చెప్పలేదు.. రాముడుండబోతున్నాడు.. శివుడిని రాజమౌళి చూపించబోతున్నాడు. అంటే ఇదో డివోషనల్ ఎమోషన్ ఉన్న సినిమానే.. కాబట్టి ఇదెలా సూపర్ హీరో మూవీ అవుతుంది.. ? ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం ఇచ్చేలా ఉన్నాడు. ఫస్ట్ సూపర్ మ్యాన్ హనుమాన్ అని ఆమధ్య హనుమాన్ మూవీ టీం ప్రచారం చేసుకుంది... అలాంటి ప్రచారాలు ఇక్కడ లేవు.. కాని వారణాసి మూవీ అంతర్జాతీయ స్థాయిలో ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా మారేలా ఉంది.. అదెలా? ఏ కోణంలో..? అదే నిజమైతే, ఈపాటికే ఎనౌన్స్ మెంట్ రావాలి.. కాని రాలేదెందుకు?

సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హీ మ్యాన్, ఇప్పడు వీళ్లందరుండే అవేంజర్స్ సినిమాటిక్ యూనివర్స్.. ఇవేచూశాం.. ఇలాంటి స్టాండర్డ్స్ లో ఒక ఇండియన్ సూపర్ హీరో వస్తే.. ఆల్రెడీ వచ్చాడు.. గతంలో బాలీవుడ్ నుంచి క్రిష్... మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మున్నార్ మురళీ.. టాలీవుడ్ నుంచి హనుమ్యాన్... అన్నీ హిట్టే.. కాని ఇండియాలో మాత్రమే దుమ్ముదులిపాయి.హాలీవుడ్ సూపర్ హీరోలు మన దేశాన్ని షేక్ చేసినట్టు, వరల్డ్ మార్కెట్ ని కుదిపేసినట్టు, ఒక్క ఇండియన్ సూపర్ హీరో కూడా ప్రపంచాన్ని షేక్ చేసింది లేదు. అదే ఇప్పుడు సూపర్ స్టార్ చేయబోతున్నాడు. రాజమౌళి ఎంతసేపు ఒక మైథలాజికల్ సైఫై డ్రామాగా వారణాసిగా వస్తోందన్నాడు తప్ప.. అసలు ఇందులో సూపర్ హీరో జోనర్ కూడా ఉందన్న పాయింట్ స్ట్రెస్ చేయట్లేదు.

వాంటెండ్ గా ఇది దాచి పెడుతున్నారా? లేదంటే కావాలని అందరి ఫోకస్ అటువైపు పడకుండా సూపర్ హీరో కాన్సెప్ట్ ని హైడ్ చేస్తున్నారా? ఈ డౌట్లు రావటానికి రీజన్ ఇందులో మహేవ్ బాబు సూపర్ హీరోగా కనిపించేందుకు కావాల్సినంత స్కోప్ ఉండటమే. రుద్రుడిగా, రాముడిగా, శివుడిగా ఈమూవీలో మూడు పాత్రల్లో మహేశ్ బాబు కనిపించబోతున్నాడు.అందులో రాముడు, శివుడు దేవుల్లు... కాని రుద్రుడెవరు? తనేం చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. విలన్ అప్పచెప్పిన ఒక వస్తువు తెచ్చేందుకు కాలంలో ప్రయానించే ఒక యోధుడిగా, బౌంటీ హంటర్ గా నే కనిపిస్తాడనే ప్రచారమే జరుగుతోంది. కొద్ది వరకు ఈ పాత్ర హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ లో ని ఇండీ పాత్రతో పోల్చేదిగా ఉంటుందని రాజమౌళినే తేల్చాడు..కాని సూపర్ న్యాచురల్ పవర్స్ తనకి వస్తాయనే విషయం, ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ చేసే టీం, తన సైట్లో పెట్టుకున్న స్టోరీ లైన్ తో తేల్చింది. విశ్వం తలరాత మార్చే వస్తువుని తెచ్చేందుకు కాలంలో ప్రయాణించే వ్యక్తికి అసాధారన శక్తులు రావటం అంటే, దానర్థం సూపర్ హీరో అన్నట్టే కదా.. సో ఇది మైథాలాజికల్, సైఫై డ్రామానే కాదు.. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న సూపర్ హీరో కాన్సెప్ట్ అని కూడా అర్ధమౌతోంది. ఇది కనక వరల్డ్ వైడ్ గా హిట్టైతే, పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేసిన ఫస్ట్ ఇండియాన్ సూపర్ హీరోగా మహేశ్ బాబు హిస్టరీ క్రియేట్ చేసిన వాడౌతాడు.

Published : 
  • 2 May 2026, 6:50 PM IST