టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా వస్తోందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ 'వారణాసి'.'RRR' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన రాజమౌళి, ఇప్పుడు 'వారణాసి' చిత్రంతో మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగి, ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్‌ను చిత్ర యూనిట్ ముందు ఉంచినట్లు సమాచారం.
వారణాసి' సినిమాకు సంబంధించిన ప్రీ-గ్లింప్స్ విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అంతకుముందు ఈ సినిమా కథాంశంపై ఉన్న చిన్నపాటి సందేహాలన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్, కాన్సెప్ట్, మరియు మేకింగ్ స్కేల్ చూస్తుంటే... ఇది కేవలం ఇండియన్ సినిమా మాత్రమే కాదు, పక్కా హాలీవుడ్ రేంజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ అని అందరికీ నమ్మకం ఏర్పడింది. దీనితో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది.
ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినబడుతున్న టాక్ ప్రకారం.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడం కోసం బడా డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. అయితే ఈ రేసులో మైత్రీ మూవీ మేకర్స్ అందరికంటే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. వారణాసి మూవీ యూనిట్‌కు వారు ఒక భారీ స్థాయి, ఎవరూ ఊహించని విధంగా 'టెంప్టింగ్ ఆఫర్' ఇచ్చినట్లు గట్టిగా వినిపిస్తోంది. ఈ డీల్ గనుక ఫైనల్ అయితే, టాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన థియేట్రికల్ డీల్‌గా ఇది సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మైత్రీ ఆఫర్‌ను రాజమౌళి అండ్ టీమ్ అంగీకరిస్తారా? లేక అంతకంటే పెద్ద డీల్స్ కోసం వేచి చూస్తారా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న మరో ప్రధాన ఆకర్షణ దీని క్రేజీ కాస్టింగ్. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్ మరియు స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తుండటంతో గ్లోబల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో అత్యంత పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారనే వార్త సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ క్రేజీ కాంబినేషన్స్ చూస్తుంటే, సినిమా విడుదలకు ముందే థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో భారీ స్థాయిలో రికవరీ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా ఎక్కడా తగ్గడం లేదు. దాదాపు1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ వండర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. టెక్నికల్‌గా, విజువల్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఆగస్ట్ నాటికి టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసి, ఆ తర్వాత భారీ స్థాయిలో గ్రాఫిక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ రిలీజ్‌ను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ స్థాయి ప్రమోషన్స్ కోసం కూడా ఇప్పుడే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి 'వారణాసి' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. టాలీవుడ్‌ను మరోసారి గ్లోబల్ మ్యాప్‌పై గర్వంగా నిలబెట్టే అతిపెద్ద ప్రాజెక్ట్. ట్రేడ్ బిజినెస్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ డీల్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.