తారకమత్రంతో తాతొచ్చాడు.. ఆఫ్రికా Footage…!

డ్రాగన్ టీం సడన్ గా ఒక బాంబు పేల్చింది.. ఆ బాంబు పేరే ఆఫ్రికా వెపన్... ఔను ఒకే ఒక్క ఫోటో, ఒకే ఒక్క వీడియో మొత్తం సీన్ నే మార్చేసింది. డ్రాగన్ పాన్ ఆసియా మూవీ కాదు.. పక్కగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అని తేల్చింది

Post Published By: dialnews
Updated : 24 April 2026, 10:30 PM IST

డ్రాగన్ టీం సడన్ గా ఒక బాంబు పేల్చింది.. ఆ బాంబు పేరే ఆఫ్రికా వెపన్... ఔను ఒకే ఒక్క ఫోటో, ఒకే ఒక్క వీడియో మొత్తం సీన్ నే మార్చేసింది. డ్రాగన్ పాన్ ఆసియా మూవీ కాదు.. పక్కగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అని తేల్చింది. బొగ్గు పూసిన ముఖాలు... మళ్లీ కేజీయఫ్ ని గుర్తు చేసే యాంబియన్స్... దీనికి తోడు, 45 నిమిషాల పాన్ వరల్డ్ సీక్రెట్ ని కూడా ఈ వీడియో బయటపెట్టింది. డ్రాగన్ లో రెండు పాత్రలు వేస్తున్న ఎన్టీఆర్, ఒక పాత్రలో తాతగ, మరో పాత్రలో మనవడిగా కనిపిస్తాడనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమౌతోంది... జరుగుతున్న షూటింగ్ అంతా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే అన్న హింట్ ని, చిన్న వీడియో లాంటి ఫోటోలతో తేల్చేశాడు ప్రశాంత్ నీల్. ఇంతకి డ్రాగన్ డైరెక్టర్ ఏం రివీల్ చేశాడు? ఆఫ్రికా ఆర్టిస్టులతో డ్రాగన్ లో బయట పడ్డ ఫ్లాష్ బ్యాక్ తారకమంత్రమేంటి?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ తీస్తున్న ప్రశాంట్ నీల్ బాంబు పేల్చాడు.. ఈ సినిమా లో నటిస్తున్న ఆఫ్రికన్స్, అలానే సెట్ లోని విజువల్స్ బయటికి రావటంతో ఒక్కసారిగా డ్రాగన్ మీద అంచనాల భారం మరింత పెరిగింది. కారనం, ఇందులో ఎన్టీఆర్ వేసే రెండు పాత్రల విషయం పరోక్సంగా కన్ఫామ్ అయ్యింది. ఇంతవరకు ఇది పాన్ ఆసియా సినిమా అనుకుంటే, కాదు, పాన్ వరల్డ్ మూవీగానే రాబోతోందని పరోక్షంగా కన్ఫామ్ చేశాడు ప్రశాంత్ నీల్ఇలా చాలా వరకు రూమర్స్ అనుకున్న కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు నిజం అయ్యేలా ఉన్నాయి. ముందుగా ఇప్పుడు సెట్ విజువల్స్ లో ఆఫ్రికన్ నటులతో ప్రశాంత్ నీల్ ఫోటో దిగటం చూస్తుంటే, ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుగుతోందని తేలింది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

అంటే ఎన్టీఆర్ తాతగా, మనవడిగా నటిస్తున్న ఈ మాఫియా యాక్సన్ డ్రామాలో... తాత ఫ్లాష్ బ్యాక్ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఏడాది క్రితమే కన్ఫామ్ అయ్యింది. సో ఇప్పటి వరకు మనవడి పాత్ర తాలూకు షూటింగ్ చేసిన టీం, సడన్ గా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో తాత పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తెరకెక్కిస్తోందని అర్ధమౌతోంది.ఇక ఇండియా,చైనా, బూటాన్ ఇలా ఈ ట్రైయాంగిల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కడం చూస్తే, చైనా, జసాన్, ఇలా సౌత్ ఆసియా అంటే పాన్ ఆసియా మూవీగా డ్రాగన్ వస్తోందనుకున్నారు. కాని ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ కూడా ఉండటం, తాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోందని ఈ ఒక్క వీడియోతో తేలటంతో, లెక్కే మారిపోయింది.వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంటే, జూన్ లో డ్రాగన్ రాబోతోంది. అంటే పాన్ వరల్డ్ లెవల్లో వారణాసి తర్వాత వరల్డ్ మార్కెట్ మీద ఎటాక్ చేసే పాన్ వరల్డ్ మూవీగా డ్రాగన్ ఎటాక్ కన్ఫామ్ అయ్యింది. మొత్తానికి ఒక్క వీడియో, ఒక్క ఫోటో తో చాలా విషయాలు, చాలా రూమర్లకు క్లారిటీ దొరికినట్టైంది.

Published : 
  • 24 April 2026, 10:30 PM IST