మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నిజంగా వారణాసి సినిమాకు పెద్ద సమస్యగా మారే ఛాన్స్ఉందా? ఈ ప్రశ్న రేయిజ్ అవటానికి రీజన్ రెండు సినిమాల రిలీజ్ డేట్లు, రెండు ప్రాజెక్టుల దర్శకులే కారణం. రాజమౌళి రేంజ్ లో పాన్ ఇండియాని షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాంటి తను పాన్ ఇండియా ను రాజమౌళి సాయం లేకుండా షేక్ చేసిన ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా తీస్తున్నాడు. అది కూడా రెండు భాగాలు.. అందులో ఎన్టీఆర్ రెండు పాత్రలేస్తూ కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడ సమస్య అది కాదు... డ్రాగన్ మూవీ ఏమాత్రం బాగున్నా, వసూళ్ల వరద అంచనాలకు తగ్గట్టు రాబట్టినా, వారణాసికి హెడ్డేక్ తప్పదు.. డ్రాగన్ క్రియేట్ చేసే ప్రతీ రికార్డు, వారణాసికి ఒక ఛాలెంజ్ లా మారే ఛాన్సుంది. వారణాసి 55 వేల థియేటర్స్ లోరిలీజ్ అవుతుంటే, అందులో సగం థియేటర్స్ లో డ్రాగన్ రాబోతోంది.. కేవలం ఇదే వారాణాసికి సమస్యా అంటే కాదు, అంతకుమించి ఛాలెంజులు 2027 లో ఎదురు కాబోతున్నాయి... ఇంతకి ఏంటవి? రాజమౌళి సినిమాకే డ్రాగన్ తలనొప్పయ్యేంతగా ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి?
డ్రాగన్ మూవీ వారణాసి సినిమాకు చాలా కోణాల్లో ఛాలెంజులు విసిరేలా ఉంది. పెద్ద తలనొప్పయ్యేలా ఉందనటానికి సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఈరెండు సినిమాలు ఒకే సారి రిలీజ్ కావట్లేదు. కాబట్టి పోటీ అనే సమస్యే ఉండదు.. అలాంటప్పుడు డ్రాగన్ వర్సెస్ వారాణాసి అనే ప్రశ్నే రాదు.. అలా జరిగినా పర్లేదు కాని, ఈ రెండు సినిమాల మధ్య 3 నెల్లలపైనే గ్యాప్ ఉన్నా, ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు.2027 సంక్రాంతికే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కే డ్రాగన్ రిలీజ్ కాబోతోంది. ఇంకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయకున్నా, ఆల్ మోస్ట్ సంక్రాంతికే డ్రాగన్ వస్తుందనే మాటకే ఫిల్మ్ టీం కట్టుబడి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే వారనాసి రిలీజ్ కి ఎగ్జాక్ట్ గా 3 నెలల ముందు డ్రాగన్ వస్తే నిజంగానే చాలా కోణాల్లో వారణాసి మూవీకి హెడ్డేక్ అనాల్సిందే. చాలా విషయాల్లో పోలికలొస్తాయి.
ముందు డ్రాగన్ మూవీ వారణాసి రేంజ్ లో 1400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కట్లేదు.. అందులో సగం అంటే 670 నుంచి 700 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది. వారణాసి 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకుంటుంటే, డ్రాగన్ టీం టార్గెట్ 25 వేల థియేటర్లు.. సో వారణాసిలో సగం బడ్జెట్, వరల్డ్ వైడ్ గా వారణాసితో పోలిస్తే అందులో సగం థియేటర్ల సంఖ్యతోనే డ్రాగన్ రాబోతోంది.కాబట్టి డ్రాగన్ కి ఎన్ని ఓపెనింగ్స్ వస్తాయి...వన్ వీక్ వసూళ్లెంత? ఓవరాల్ ఫైనల్ కలెక్సన్స్ ఎంతొస్తాయనేది వారణాసి రిలీజ్ కి ముందే తెలుస్తాయి. కాబట్టి ఆ ప్రతీ రికార్డుని వారణాసి బ్రేక్ చేస్తుందా లేదా అన్న డిస్కర్షన్ వస్తుంది.. దీనికి తోడు డ్రాగన్ మూవీ ఒక భాగంగా రావట్లేదు. సంక్రాంతికి మొదటి భాగం, 2027 ఎండ్ కి రెండో భాగం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.అంటే వారాణాసి నిజంగా డ్రాగన్ మొదటి భాగం క్రియేట్ చేసే రికార్డులని రీచ్ కాకపోయినా, లేద రికార్డులు బ్రేక్ చేసినా, వెంటనే ఐదారు నెలల గ్యాప్ లో డ్రాగన్ రెండో భాగం వస్తుంది... మొదటి భాగం హిట్టైతే, రెండో భాగం అందుకు రెండింతల వసూళ్లు రాబడుతుంది కాబట్టి, పాన్ వరల్డ్ మూవీ వారణాసి రికార్డులు వేగంగా బ్రేక్ చేసే ఛాన్స్ డ్రాగన్ కి రెండో భాగంతో వచ్చినట్టే.. ఇలా ఒకే ఏడాది డ్రాగన్ రెండు ట్విస్ట్ లు ఇవ్వబోతుండటం వారణాసికి రికార్డులకు ఇబ్బందే.