వాళ్ల కోపానికో లెక్కుంది.. రెబల్ ఫ్యాన్స్ ఫైర్…
రాజసామ్ సినిమా విషయంలో ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి మీద మండిపడ్డారు.. ఊహించని రీతిలో తనని ట్రోల్ చేశారు.
రాజసామ్ సినిమా విషయంలో ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి మీద మండిపడ్డారు.. ఊహించని రీతిలో తనని ట్రోల్ చేశారు. డైరెక్టర్ కూడా సినిమా రిజల్ట్ విషయంలో డౌట్ ఉంటే రండంటూ, తన ఇంటి అడ్రస్ ఇచ్చి, అతి విశ్వాసంతో, కొరివితో తల గోక్కున్నాడు. కట్ చేస్తే ఇదంతా గడిచిపోయింది… కాని మళ్లీ ఎందుకు ఇప్పడు ఫ్రెష్ గా డైరెక్టర్ మారుతిని తగులుకున్నారు.. ఇదే షాకింగ్ అంశం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మారుతి నామ స్మరనే.. తనని ఏరేంజ్ లోమళ్లీ ట్రోలింగ్ చేస్తున్నారంటే, ప్రభాస్ తో సినిమా తీసే గోల్డెన్ ఆపర్చినుటీని వేస్ట్ చేశాడని, చాలా గట్టిగానే వేసుకుంటున్నారు. సినిమా రిలీజైన టైంలో, టాక్ వీకైందంటే, లేదు కథ నచ్చలేదంటే ఇలా ట్రోల్ చేశారని అర్ధం చేసుకోవచ్చు.. కాని సినిమా వచ్చి పది పన్నెండు రోజులైపోయింది… ఇప్పుడెందుకు మారతిని సడన్ గా రెండో సారి ట్రోల్ చేస్తున్నారు.. దానికి సాలిడ్ రీజనుంది… రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతగా ఎందుకు మళ్లీ రగిలిపోతున్నారో? వాల్ల ఆవేదనేంటో అర్ధమయ్యేంత పెద్ద కారణమే బయటికొస్తోంది.. ఇంతకి ఏంటా రీజన్?
రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు సడన్ గా సోషల్ మీడియాని భయపెట్టేలా చేస్తున్నాయి.. అంతా ఒకే సారి డైరెక్టర్ మారుతి మీద మండిపడుతున్నారు… రాజాసాబ్ ఏమి నిన్నో మొన్నో రిలీజ్ కాలేదు.. పండక్కి కాస్త ముందే జనవరి 9కి రిలీజైంది. సో విడుదలై పది పన్నెండు రోజులు గడిచింది. రిజల్ట్ రివర్స్ అవటానికి రీజన్ మారుతి మహోన్నతమైన మేకింగ్ అండ్ రైటింగ్ స్కిల్సే అని అంతా తిట్టుకున్నారు..150 కోట్ల ఓపెనింగ్ వచ్చిన మూవీ రెండో రోజుల్లో 50 కోట్లు కూడా రాబట్టేలేకపోవటానికి కారణాం, కథా లోపాలు, దర్శకుడి మేకింగ్ ఘోరాలే అన్న చేదు నిజాలని దిగమింగారు రెబల్ ఫ్యాన్స్…కొందరైతే, ప్రివ్యూలు, ఫస్డ్ డే పబ్లిక్ టాక్ లోనే ఓపెన్ గా మారుతి కనిపిస్తే అంటూ కామెంట్లతో చెలరేగిపోయారు.. మారుతి కూడా రిలీజ్ కి ముందు తన ఇంటి అడ్రస్ ఇచ్చి, రమ్మని పిచ్చిపనిచేశాడన్నారు.
అన్నట్టుగానే ఇంటివరకెళ్లి తన అంతు చూస్తామని ఫ్యాన్స్ వీరావేశంతో వెళ్లటం కూడా జరిగింది… అదంతా జరిగి వారం గడుస్తోంది.. కట్ చేస్తే ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలో మారుతి మీద ట్రోలింగ్ పెరిగింది. అదే చాలా మందికి విచిత్రంగా అనిపించొచ్చు..కాని రెబల్ ఫ్యాన్స్ కోపానికో లెక్కుంది… అదే సంక్రాంతి సినిమాల రిజల్ట్స్…
వాటి వసూళ్లు.. ఒక్కో సినిమా రాబట్టిన కలెక్సన్స్.మెగాస్టార్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు మూవీ వందలకోట్లు రాబట్టింది… రవితేజ మూవీ భర్త మహశయులకు బానే ఆడింది… అనగనగా ఒక రాజు వందకోట్ల వీకెండ్ వసూళ్లతో షాక్ ఇచ్చింది. ఆఖరికి శర్వానంద్ మూవీ నారి నారి నడుమ మురారి బానే ఆడిందని వసూల్ల లెక్కలు తేల్చాయి… నిజానికి ది రాజాసాబ్ యావరేజ్ గా ఆడినా, ఆ వసూల్ల వరదలో ఈ నాలుగు మూవీలు కొట్టుకుపోతాయనేది అభిమానుల అభిప్రాయం అంటున్నారు.
అంటే మిగతా మూవీలు నథింగ్, రాజాసాబే గ్రేట్ అని కాదు… రెబల్ స్టార్ మీదున్న అంచనాలు అలా ఉన్నాయి.. కల్కీ, సలార్ హిట్ల తర్వాత వస్తోంది కాబట్టి, వెయ్యికోట్ల సినిమా కింద మిగతా సంక్రాంతి సినిమాలు నలిగిపోతాయనుకున్నారు.. అలాంటిది, ఆ నాలుగు మూవీలు వసూళ్ల లెక్కలు షాక్ ఇవ్వటం చూసి, దీనంతటికి కారణం మారుతినే అని, రగిలిపోతున్నారు రెబల్ ఫ్యాన్స్… అదే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.











