1400 కోట్ల వారణాసి మూవీకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ తో తలనొప్పి పెరిగేలా ఉంది. రెబల్ స్టార్ స్పిరిట్ కూడా వారణాసికి వాయించేలా ఛాలెంజ్ విసురుతోంది. ఆల్రెడీ ధురందర్ కేవలం 260 కోట్ల ఖర్చుతో వచ్చి 1000 కోట్లు ఒకసారి, 2000 కోట్లు రెండో సారి అంటోంది. దీనికితోడు దంగల్ ఫేం నితీష్ తీవారి ఆల్రెడీ ఈ ఏడాది రామాయణం తో పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు.. ఇవన్నీ వారణాసికి వాయించే వాతలే.. వారణాసి రిలీజ్ కి ముందు రామాయణం రికార్డులు ఒక వార్నింగ్ లా మారే ఛాన్స్ఉంటే, డ్రాగన్ మూవీకూడా వారణాసికి అలాంటి వార్నింగ్ ఇచ్చేలా ఉంది. ఈ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి సందీప్ రెడ్డి కూడా వారణాసికి, దాని విడుదల తర్వాత ఛాలెంజ్ విసరబోతున్నారు. ఎలా చూసినా వారనాసి ఎంత గొప్ప కళా ఖండంగా వస్తున్నా... ఈ సినిమాకు మాత్రం ముందు నుయ్యి వెనక గొయ్యిలా పరిస్తితులు తయారయ్యాయా? నిజంగా ఈసారి రాజమౌళికి ఏది అంత ఈజీగా ఉండేలా లేదా?
1400 కోట్ల వారణాసిని అధ్బుతంగా మార్చే ప్రాసెస్ లో రాజమౌళి చాల పద్దతిగా ఖర్చుచేస్తున్నాడు. హైద్రబాద్ లో కాశీ పట్టనం సెట్ మతిపోగొడుతోంది. సోషల్ మీడియా నిండా ఇప్పుడు వారణాసి సెట్ విజువల్సే వైరలయ్యాయి. ఇదేం లీకేజి కాదు.. అలాని ప్రమోషన్ కూడా కాదు.. అయినా కాశీ సెట్ కి జనం ఫిదా అవుతున్నారు. ఇంతవరకు బానే ఉంది.కాని వారాణాసిని మెల్లిగా మూడుతోందన్న ఒక చర్చ పెరిగింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్, రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ ఈ రెండూ ఓరకంగా వారణాసికి చెక్ పెట్టే సినిమాలే.. ఏవి కూడా రిలీజ్ టైంలో పోటీ ఇచ్చేవి కావు. కాని ఈ రెండు మాత్రం వారణాసిని వణికించే మూవీలే.. పరోక్షంగా చాలెంజ్ విసిరే ప్రయోగాలే.
అసలే ధురందర్ రెండు భాగాలు 260 కోట్లతో తీస్తే ఒకటి 1200 కోట్లు రాబ్టింది. దాని సీక్వెల్ వన్ వీక్ లో, 1000 కోట్లు రాబట్టింది. నెలలో 2 వేల కోట్ల నుంచి 3 వేలకోట్ల ని చీచ్ అయ్యేలా ఉంది. ఆలెక్కన 1400 కోట్ల పెట్టుబడితో వచ్చే వారణాసి ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టాలి.. అది కూడా పాన్ వరల్డ్ మార్కెట్లో అంటే కనీసం 5 వేల కోట్లు లేదంటే అంతకుమించకపోతే వారణాసి వరల్డ్ సినిమా అనలేం.ఇలాంటి ఛాలెంజెస్ వారణాసికి మరిన్ని ఎదురయ్యేలా ఉన్నాయి. ఆల్రెడీ 2 వేల కోట్ల రికార్డు క్రియటే్ చేసిన దంగల్, దాని డైరెక్టర్ రామాయణం తీస్తున్నాడు. ఈ ఏడాది రామాయణం మొదటి భాగం రాబోతోంది. అది కూడా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. 2 వేల కోట్ల బడ్జెట్ తో వస్తోంది. రణ్ బీర్ కపూర్, యష్, సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తోంది.
సో ఇది ఈ ఏడాదే ఏదైనా వండర్స్ చేస్తే, దాని ప్రెజర్ వారణాసి మీద ఉంటుంది. దంగల్ దర్శకుడి కొత్త రికార్డుని రాజమౌళి టీం ఎలా రీచ్ అవుతుందనే పోలికలు, ఖచ్చితంగా వస్తాయి.. ఇక సంక్రాంతికి డ్రాగన్ వస్తే, అది వసూళ్ల వండర్స్ చేస్తే, దాని ప్రెజర్ కూడా 2027 ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే వారణాసి మీదుంటుంది.. రిజీల్ట్ ఏమాత్రం నెగెటివ్ కాదు, కనీసం యావరేజ్ గా వచ్చినా కష్టమే.. ఎందుకంటే తర్వాత స్పిరిట్ రిలీజ్ అవుతుంది. సో వారణాసి రిలీజ్ కి ముందు వచ్చే మూవీలు, వారణాసి తర్వాత వచ్చే సినిమాలు రెండూ, ఈ ప్రాజెక్ట్ కి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారుతున్నాయి. బాహుబలి, త్రిబుల్ ఆర్ లా రాజమౌళికి ఈ సారి మాత్రం ఏది అంత ఈజీకాదని తెలుస్తోంది.