రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' ఓటీటీలో సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. ఈ మధ్యే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన నేపథ్యంలో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర డార్లింగ్ ప్రభాస్ మేనియా ఎలా ఉంటుందో మనకు తెలుసు.. కానీ, ఇప్పుడు 'ది రాజా సాబ్' ఓటీటీలో సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ఓటీటీలో మాత్రం ఈ సినిమా ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.
ఓటీటీలో వచ్చిన 'ఎక్స్టెండెడ్ కట్' వ రిపోర్ట్స్ ప్రకారం జియో హాట్ స్టార్ ఆల్ టైం రికార్డుల్ని తిరగరాసింద. ఈ సినిమా ఓటీటీ హక్కులు ఏకంగా 160 కోట్ల నుండి 180 కోట్ల వరకు అమ్ముడయ్యాయని సమాచారం. ఇది ప్రభాస్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజిటల్ డీల్స్. ఈ డీల్‌లో ఒక స్పెషల్ క్లాజ్ కూడా ఉంది. బాక్సాఫీస్ కలెక్షన్లను బట్టి అదనంగా మరికొంత మొత్తాన్ని కూడా నిర్మాతలు అందుకునేలా ఒప్పందం కుదిరింది.
ఫిబ్రవరి 6న ఓటీటీలో సినిమా రిలీజ్ అయిన సమయంలో, ఒకేసారి లక్షలాది మంది లాగిన్ అవ్వడంతో జియో హాట్‌స్టార్ సర్వర్లు స్లో అయ్యాయంటే ప్రభాస్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. థియేటర్లో లేని సుమారు 10 నిమిషాల ఎక్స్ట్రా సీన్స్‌ను ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ కి సంబంధించిన సీన్స్ ఓటీటీలో హైలైట్‌గా నిలిచి, రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్-కామెడీలో ప్రభాస్ లుక్స్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సంజయ్ దత్, మాళవిక మోహనన్, రిధి, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటించగా, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్ గా నిలిచింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయగా, ఓటీటీ ద్వారా భారీ రికవరీ సాధించింది.