టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో 'వారణాసి' ఒకటి. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ కొన్ని వెబ్‌సైట్లలో కథనాలు దర్శనమిస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం, ఈ సినిమా కథ పూర్తిగా వారణాసి పుణ్యక్షేత్రం చుట్టూ తిరుగుతుందట. కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా, అక్కడ జరిగే కొన్ని చీకటి వ్యాపారాలు, మాఫియా మరియు పురాతన రహస్యాల చుట్టూ ఈ కథను అల్లినట్లు తెలుస్తోంది. కథానాయకుడు వారణాసికి ఒక ప్రత్యేకమైన మిషన్‌పై వస్తాడని, అక్కడ అతనికి ఎదురైన వింత అనుభవాలే సినిమాకు ప్రాణం అని ఇవి చెప్పుకొస్తున్నాయి.
హీరో కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదని, అతని గతం కాశీలోని ఒక పురాతన వంశానికి లేదా రహస్యానికి ముడిపడి ఉంటుందని టాక్. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, సినిమాలో కొన్ని హై-వోల్టేజ్ సీన్లు ఉండబోతున్నాయట. సినిమా ఆరంభంలో వచ్చే గంగా హారతి సీన్ విజువల్ వండర్‌గా ఉంటుందని, అక్కడే హీరో విలన్‌ను మొదటిసారి ఎదుర్కొంటాడని సమాచారం. వారణాసి వీధుల్లో జరిగే చేజింగ్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని సోషల్ మీడియాలో లీకులు వినిపిస్తున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాల కథలు లీక్ అవ్వడం కొత్తేమీ కాదు. అయితే 'వారణాసి' విషయంలో మాత్రం మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ స్టోరీ లీక్ వార్తలపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కానీ, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. బయటకు వచ్చిన కథలో కేవలం 10 శాతం మాత్రమే నిజం ఉండొచ్చని, అసలు సినిమా అంతకు మించి ఉంటుందని అంటున్నారు. ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉన్న ఈ కథ కేవలం ఊహాగానాలు మాత్రమే. సినిమా అసలు కథను వెండితెరపై చూసి ఆస్వాదించాల్సిందే. ఏదేమైనా, సినిమా కథ లీక్ అవ్వడం అనేది మేకర్స్‌కు కొంత ఇబ్బంది కలిగించే విషయమే అయినా, ఇది సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. కాశీ విశ్వనాథుని సాక్షిగా సాగే ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.