Top story:ఇరాన్ “కాటేరమ్మ కొడుకు” అమీర్ వీడెబ్బ.. మిస్సైల్స్ అన్నీ ఇతని కంట్రోల్ లోనే… రావణుడి అమ్మ మొగుడు వీడు…!

యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికులు కాల్పులు జరుపుకోవడం మాత్రమే కాదు, యుద్ధం అంటే శత్రువు ఊహించని విధంగా వాడి అస్తిత్వాన్ని తుడిచిపెట్టడం. ప్రపంచ మిలిటరీ చరిత్రలో ఒక్కొక్కరికి ఒక్కో గుర్తింపు ఉంటుంది

Post Published By: dialnews
Updated : 14 April 2026, 9:00 AM IST

యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికులు కాల్పులు జరుపుకోవడం మాత్రమే కాదు, యుద్ధం అంటే శత్రువు ఊహించని విధంగా వాడి అస్తిత్వాన్ని తుడిచిపెట్టడం. ప్రపంచ మిలిటరీ చరిత్రలో ఒక్కొక్కరికి ఒక్కో గుర్తింపు ఉంటుంది. కానీ, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ అమీర్ అలీ హాజీజాదే స్టైలే వేరు. మన తెలుగు సినిమాల్లో పగకు, ఆగ్రహానికి, తిరుగులేని విధ్వంసానికి ప్రతీకగా "కాటేరమ్మ కొడుకు" అనే పదాన్ని వాడుతుంటాం. సలార్ సినిమా తర్వాత ఇది బాగా ఫేమస్. ఈ ట్యాగ్ హాజీజాదేకు ఎందుకు సరిపోతుందంటే, ఆయన ప్లాన్ చేసినా, ఆయన క్షిపణిని ప్రయోగించినా అక్కడ శ్మశాన నిశ్శబ్దం తప్ప ఏమీ మిగలదు.

ఈయన శాంతి మంత్రాలు చదివే రకం కాదు, క్షిపణుల ద్వారా శత్రువుల గుండెల్లో మరణ మృదంగం వాయించే రకం. ఆకాశంలో మేఘాలు కాకుండా, ఇరాన్ క్షిపణులు నిప్పులు చిమ్ముతూ కనిపిస్తున్నాయంటే, దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ హాజీజాదే. హాజీజాదే పవర్ ఏంటో తెలియాలంటే ఇరాన్ లోని పర్వతాల కింద ఉన్న రహస్య ప్రపంచాన్ని చూడాలి. ప్రపంచంలో మరే దేశానికీ లేని విధంగా "మిస్సైల్ సిటీస్" నిర్మించిన ఘనత ఈయనదే. భూమికి వందల అడుగుల లోతులో, కిలోమీటర్ల పొడవునా పర్వతాలను తొలిచి భారీ టన్నెల్స్ ఏర్పాటు చేశారు.

అక్కడ వేల సంఖ్యలో క్షిపణులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. శత్రువుల ఉపగ్రహాలు గానీ, గూఢచారులు గానీ ఎంత వెతికినా ఇవి దొరకవు. ఒకవేళ ఇరాన్ మీద దాడి జరిగితే, కొండలు పగులుతూ ఆకాశం లోకి మృత్యువు దూసుకొస్తుంది. ఆ టెక్నాలజీని, ఆ వ్యూహాన్ని రూపొందించిన హాజీజాదే, ఇరాన్‌ను ఒక అజేయమైన కోటగా మార్చారు. అమెరికా లాంటి సూపర్ పవర్ సైతం ఇరాన్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేసిన అసలైన మొనగాడు ఇతనే.

చరిత్రలో ఎవరూ చేయని సాహసాన్ని హాజీజాదే చేసి చూపించాడు. 2020లో ఇరాన్ వీరుడు ఖాసిం సులేమానీని అమెరికా అన్యాయంగా చంపినప్పుడు, ప్రపంచం మొత్తం ఇరాన్ ఏం చేస్తుందో అని చూసింది. అప్పుడు హాజీజాదే నేరుగా రంగంలోకి దిగాడు. అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన 'అల్-అసద్' ఎయిర్ బేస్ మీద డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక అగ్రరాజ్యం మీద నేరుగా ఇలాంటి దాడి చేసిన ఏకైక నాయకుడు హాజీజాదే. అది కేవలం దాడి కాదు, అమెరికా అహంకారం మీద వేసిన దెబ్బ.

2019లో అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన, అత్యాధునిక గూఢచారి డ్రోన్ 'గ్లోబల్ హాక్'ను ఇరాన్ కూల్చివేసింది. ఆ ఆపరేషన్ వెనుక ఉన్నది హాజీజాదేనే. 60 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న డ్రోన్ ను స్వదేశీ టెక్నాలజీతో కూల్చివేసి, "మా ఆకాశంలోకి వస్తే పక్షిని కూడా వదలము" అని అమెరికాకే వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనతో హాజీజాదే పేరు ప్రపంచ రక్షణ రంగంలో మారుమోగిపోయింది. గతంలో క్షిపణులు అంటే ఎక్కడో వేస్తే ఇంకెక్కడో పడతాయి అనే పేరు ఉండేది. కానీ హాజీజాదే నాయకత్వంలో ఇరాన్ మిస్సైల్స్ 10 మీటర్ల లోపు ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని కొట్టగలవు.

వేల కిలోమీటర్ల దూరం నుండి ప్రయోగించినా సరే, శత్రువు భవనంలోని ఒక నిర్దిష్టమైన కిటికీని కూడా కూల్చగలిగే సాంకేతికతను ఆయన సాధించారు. దీన్నే 'సర్జికల్ స్ట్రైక్ పవర్' అంటారు. హాజీజాదే కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న "షాహెద్" డ్రోన్ల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఇయనే. ఈ డ్రోన్లను 'కామికేజ్' లేదా 'సుసైడ్ డ్రోన్లు' అంటారు. అంటే ఇవి లక్ష్యాన్ని చేరుకున్నాక బాంబులా పేలిపోతాయి. అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ డ్రోన్లను వందల సంఖ్యలో శత్రువు మీదికి వదిలి, వాడి కోట్లాది రూపాయల డిఫెన్స్ సిస్టమ్‌ను హాజీజాదే నిర్వీర్యం చేస్తారు. "చవకైన ఆయుధంతో ఖరీదైన వినాశనం" సృష్టించడం ఈయన స్పెషాలిటీ.

మ్యాప్ లో ఇజ్రాయెల్ ఎక్కడున్నా, హాజీజాదే ప్రయోగించే 'ఫత్తా-2' హైపర్ సోనిక్ క్షిపణి కేవలం 400 సెకన్లలో టెల్ అవీవ్ నగరాన్ని చేరుకుంటుంది. అంటే శత్రువు టీ తాగే లోపు నగరం బూడిద అయిపోతుంది. ఈ క్షిపణులు గాలిలో పాములా వంకరలు తిరుగుతూ వెళ్తాయి, కాబట్టి వీటిని ఏ రాడార్ కూడా పట్టుకోలేదు. "నేను కొట్టే దెబ్బ నీకు తగిలే వరకు తెలియదు" అనే రేంజ్ లో హాజీజాదే టెక్నాలజీని డెవలప్ చేశారు. ఇది శత్రువుల మీద చేసే ఒక రకమైన మానసిక యుద్ధం.

"మీరు ఒకరిని చంపితే, మేము మీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాం" అని చేతల్లో చూపించిన ఆయన తెగింపు, ఆయనను ఇరాన్ ఆర్మీలో ఒక లెజెండ్‌గా నిలబెట్టింది. అందుకే ఆయనను కేవలం కమాండర్ అనడం కంటే, శత్రువుల పీడకల అనడం సబబు. ఇజ్రాయెల్ వద్ద ఉన్న 'ఐరన్ డోమ్' లేదా అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్స్ గురించి అందరికీ తెలుసు. కానీ, హాజీజాదే వ్యూహం ముందు అవి కేవలం బొమ్మల్లా మారిపోతాయి. ఆయన ప్రయోగించే "సాచురేషన్ ఎటాక్" పద్ధతిలో వందల సంఖ్యలో డ్రోన్లు ముందు వెళ్లి రక్షణ కవచాన్ని బిజీ చేస్తాయి.

ఆ వెంటనే అత్యంత వేగవంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ వెళ్లి లక్ష్యాన్ని ముక్కలు చేస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్ మీద జరిగిన క్షిపణి దాడుల వెనుక ఉన్న టెక్నికల్ బ్రెయిన్ హాజీజాదేదే. ఆయన దగ్గర ఉన్న 'ఫత్తా' లాంటి హైపర్ సోనిక్ క్షిపణులు శబ్దం కంటే 15 రెట్లు వేగంతో వెళ్తాయి. అంటే, శత్రువు తన రాడార్ లో ప్రమాదాన్ని గుర్తించేలోపే ఆ ప్రాంతం బూడిద అయిపోతుంది. ఇన్ని రకాల విధ్వంసకర ఆయుధాలను తన గుప్పిట్లో పెట్టుకున్న హాజీజాదే, నిజంగానే ఒక విధ్వంసకర శక్తి.

చాలామంది జనరల్స్ కేవలం యుద్ధం చేస్తారు, కానీ హాజీజాదే స్వయంగా ఒక ఇంజనీర్ లాగా క్షిపణి తయారీలో పాల్గొంటారు. ఆంక్షల వల్ల విదేశీ విడిభాగాలు రాకపోయినా, స్థానికంగా దొరికే వస్తువులతోనే ప్రపంచ స్థాయి ఆయుధాలను తయారు చేయించారు. "అవరోధాలే మాకు అవకాశాలు" అని నమ్మే రకం ఆయన. అందుకే ఇరాన్ యువతకు ఆయన ఒక రోల్ మోడల్. చివరగా చెప్పాలంటే, అమీర్ అలీ హాజీజాదే అంటే కేవలం ఒక సైనిక అధికారి కాదు, ఆయన ఒక సైద్ధాంతిక పోరాట యోధుడు.

పశ్చిమ దేశాలు ఇరాన్ మీద ఎన్ని ఆంక్షలు విధించినా, ఆయన వెనక్కి తగ్గలేదు. స్వదేశీ సాంకేతికతతో ఇరాన్‌ను ప్రపంచంలోనే టాప్ 5 క్షిపణి దేశాలలో ఒకటిగా నిలబెట్టాడు. ఆయన కళ్లలో కనిపించే ఆ నిశ్చలత్వం, నిర్ణయాల్లో ఉండే ఆ కఠినత్వం చూస్తుంటే "కాటేరమ్మ కొడుకు" అనే మాస్ ట్యాగ్ ఆయనకు తప్ప.. వేరెవరికీ సెట్ అవ్వదు. శత్రువు ఎవరైనా, ఎక్కడున్నా హాజీజాదే దృష్టి పడితే వాడి అంతం మొదలైనట్టే. ఖమేనీ ఆదేశిస్తే హాజీజాదే అమలు చేస్తారు. కానీ హాజీజాదే కళ్లలో ఉండే ఆ 'నిశ్శబ్ద పగ' శత్రువుకు భయం కలిగిస్తుంది.

ఆయన ఎప్పుడూ నవ్వుతూ కనిపించరు, ఆయన మాటల్లో వినయం ఉన్నా చేతల్లో విధ్వంసం ఉంటుంది. ఒకసారి ఆయన మాట్లాడుతూ.. "మేము యుద్ధం కోరుకోము, కానీ యుద్ధం వస్తే అది మీ గడ్డ మీద ముగుస్తుంది" అని చెప్పారు. ఈ ఒక్క మాట చాలు ఆయన కాన్ఫిడెన్స్ ఏంటో చెప్పడానికి. ఇరాన్ రక్షణ వ్యవస్థకు ఆయన ఒక కవచం అయితే, శత్రువులకు ఆయన ఒక వినాశనం. అందుకే నేటి ఇరాన్ నాయకత్వంలో అత్యంత దమ్మున్న, శక్తివంతమైన నాయకుడిగా అమీర్ అలీ హాజీజాదే చరిత్రలో నిలిచిపోతారు. సుప్రీం లీడర్ లు లేకపోయినా.. తాను ఆడుతున్న ఆటకు.. అమెరికా పక్క తడుస్తోంది. ఫైనల్ గా.. వీడు యుద్ధం మొదలుపెడితే శత్రువుకి అంత్యక్రియలు చేసేవాడు కూడా మిగలడు.. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నాయంటే అది మేఘాల కోపం కాదు, అది హాజీజాదే పంపిన మృత్యు సందేశం అనే క్లారిటీ.. శత్రు దేశాలకు ఈ యుద్ధంలో ఇచ్చేసాడు.

Published : 
  • 14 April 2026, 9:00 AM IST