Top story: జగన్ మళ్ళీ వస్తాడని… బాబు, పవన్ భయపడుతున్నారా?

అయ్యవారి బొమ్మ గీయాలి అనుకుంటే చివరికి అది కోతి అయిందంట. అదెలాగో నేను చెప్తాను. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఐదున్నర గంటల పాటు చర్చ జరిగింది.

Post Published By: dialnews
Updated : 1 April 2026, 9:15 AM IST

అయ్యవారి బొమ్మ గీయాలి అనుకుంటే చివరికి అది కోతి అయిందంట. అదెలాగో నేను చెప్తాను. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఐదున్నర గంటల పాటు చర్చ జరిగింది. చర్చలో స్పీకర్ తో మొదలుపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తోపాటు మిగిలిన అందరూ మాట్లాడిన ఒకే ఒక మాట జగన్. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే.... అమరావతిగా రాజధాని రద్దు చేస్తాడని... అది జరగకుండా అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలని, అందుకే తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ప్రతి ఒక్కరూ మాట్లాడారు.

అమరావతికి చట్టబద్ధత దాని ఆవశ్యకత ఏమిటి అన్న దాని కంటే ప్రతి ఒక్కరి ప్రసంగంలోనూ జగన్ మళ్ళీ వస్తాడు... జగన్ మళ్ళీ వస్తాడు.... వస్తే ఏదో చేస్తాడు... ఇంకేదో జరుగుతుంది అనే భయమే ఎక్కువ కనిపించింది. అమరావతికి చట్టబద్ధత అనే అంశం కంటే జగన్ మళ్ళీ వస్తాడని వీళ్ళందరూ డిసైడ్ అయిపోయారు.... వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఇండైరెక్టుగా చెప్పేస్తున్నారు అనే భావన జనంలోకి వెళ్ళిపోయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో.... అమరావతికి కల్పించిన ఆటంకాలు గురించి చెబుతూనే.. మళ్లీ వస్తే రాజధానిగా అమరావతిని అడ్డుకోకుండా ఉండేందుకే, చట్టబద్ధతపై తీర్మానం అని నొక్కి ఒక్కడి నుంచి చెప్పారు.

వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందని.... జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడని చంద్రబాబు అంత బలంగా నమ్ముతున్నారా? ఆ అనుమానమే రాకపోతే పదేపదే జగన్ వస్తాడు... అమరావతి నీ రాజధానిగా రద్దు చేస్తాడు మాట ఎందుకు అంటున్నారు. ఇప్పుడు జనంలో చర్చ జరుగుతుంది. రాజధానిగా అమరావతి గొప్పతనం గురించి చెప్పాలి. దాని అవసరం చెప్పాలి. ఇవన్నీ వదిలేసి జగన్ వస్తాడు... వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది... అమరావతి నీ రద్దు చేస్తారు అని పదే పదే చెబుతూ... తమలో భయాన్ని బయట పెట్టుకున్నారు చంద్రబాబు. ఆయన కుమారుడు లోకేష్ కూడా అదే పాట పాడాడు . జగన్ ఫోబియా కూటమి నేతలను వదిలిపెట్టడం లేదనేది అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టి చేసుకున్నారు.

చంద్రబాబు, లోకేష్ కంటే జగన్ అంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ భయపడుతున్నట్లు ఉంది. అసెంబ్లీలో తన ప్రసంగంలో అదే విషయాన్ని స్పష్టంగా బయట పెట్టాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. కూటమిలో అందరూ కలిసి ఉండకపోతే, జగన్ మళ్ళీ పవర్ లోకి వచ్చేస్తాడని చెప్పకనే చెప్పాడు.
అంటే వ్యక్తిగతంగా, రాజకీయంగా జగన్ తమకంటే బలవంతుడని పవన్ ప్రసంగం స్పష్టం చేసింది. మూడు పార్టీలు ఒక్కడితో తల పడుతున్నాయి... ఎందుకో వీళ్లంతా భయపడుతున్నారు... అనే భావన జనంలోకి తీసుకెళ్లి పోయింది పవన్ ప్రసంగం.

ఈ విషయాన్ని టిడిపి జనసేన నేతలు ఆలస్యంగా గుర్తించారు. అసెంబ్లీలో సమయాన్నంతా జగన్ నీ తిట్టడం కోసమే ఎక్కువ కేటాయించామని...ఇది రివర్స్ అయ్యే ప్రమాదం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం వచ్చే ఎన్నికల్లో కూటమికున్న ఏకైక నినాదం జగన్ మళ్ళీ వస్తే అరాచకమే... అనేది మాత్రమేనని, అందువలన జగన్, అతని పార్టీ మళ్లీ వస్తే రాష్ట్రం లో అరాచకం ప్రబలిపోతుందనే విషయాన్ని పదేపదే చెప్పడంలో తప్పేం లేదని వాదిస్తున్నారు. టిడిపి జనసేన పార్టీలు 2029లో అధికారంలోకి మళ్లీ రాలేమోనని భయపడుతున్నారనే అభిప్రాయం మాత్రం జనంలో ఉంది.

Published : 
  • 1 April 2026, 9:15 AM IST