ఎప్స్టిన్ ఫైల్స్‌లో ఆరోపణలో ఎదుర్కొంటున్న బిల్‌గేట్స్...ఏపీలో పర్యటించడం దుమారం రేపుతోంది. ఎప్స్టిన్ ఫైల్స్ కారణంగానే...ఏఐ సదస్సుకు దూరంగా ఉంచారు. చిన్నారుల జీవితాలతో ఆడుకున్న బిల్‌గేట్స్‌కు రాచమర్యాదలు చేయడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సర్కారు తీరును పలువురు పార్లమెంట్ సభ్యులు సైతం తీవ్రంగా తప్పుబట్టారు. బిల్‌గేట్స్‌పై చంద్రబాబు, లోకేశ్..ప్రసంశలు కురిపించడం దుర్మార్గమని విమర్శిస్తున్నారు.ఎప్స్టిన్ ఫైల్స్...ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఎప్స్టిన్ ప్రైవేట్ ఎస్టేట్‌కు వెళ్లిన వారంతా చిక్కుల్లో పడ్డారు. పలువురు పదవులు కోల్పోయారు.
ఆ జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు. ఆయన తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడిన బిల్ గేట్స్...ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ బంధువుగా బిల్‌గేట్స్‌ను ఆలింగనం చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిల్‌గేట్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం విశిష్ట అతిథిగా రాచ మర్యాదలు చేయడం.. అమరావతిలో మహిళల వద్దకు తీసుకెళ్లి మాట్లాడించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సర్కారు తీరును పలువురు పార్లమెంట్ సభ్యులు సైతం తీవ్రంగా తప్పుబట్టారు. ఏఐ సదస్సు ప్యానలిస్టుగా ఏఐ సదస్సులో బిల్‌గేట్స్ గురువారం ప్రసంగించాల్సి ఉంది. జాతీయ మీడియా దీన్ని తీవ్రంగా తప్పుబడుతూ చర్చలు నిర్వహించింది. లైంగిక నేరాలను చంద్రబాబు ప్రభుత్వం ఆమోదిస్తోందా? అని సూటిగా నిలదీసింది. వెంటనే ఏఐ ఇండియా సదస్సు ప్యానలిస్టుల జాబితా నుంచి బిల్ గేట్స్ పేరు తొలగించింది.ఎప్స్టిన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరు కూడా ఉంది. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు.. ఎప్స్టీన్ ఫైల్స్ సాక్షిగా బట్టబయలయ్యాయి.
రష్యన్ అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడంతో సుఖవ్యాధుల బారినపడ్డారు. ఎఫైర్ల కారణంగానే భార్య మెలిండా గేట్స్ విడాకులు తీసుకున్నారు. తీవ్ర లైంగిక నేరాలకు పాల్పడ్డారన్నది తెలుసుకుని యావత్ ప్రపంచం కంపించిపోయింది. ఎప్స్టిన్ కలవడంపై బిల్‌గేట్స్‌కు క్షమాపణలు చెప్పారు. అందుకే బిల్ గేట్స్ అంటేనే యావత్ ప్రపంచం దూరం పెడుతోంది. కానీ అంతటి దారుణాలకు పాల్పడ్డ వ్యక్తి సీఎం చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీ ప్రతినిధులు, విదేశీ కార్పొరేట్ ప్రతినిధులను అతిథులుగా ఆహ్వానించే ముందు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం సంప్రదాయం. ఇక వివాదాస్పద వ్యక్తులను పిలవాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా తీసుకునే నిర్ణయాలు జాతీయ విధానాలు, దేశ ప్రతిష్టకు భంగకరంగా ఉండకూడదు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు.
బిల్ గేట్స్‌ను యావత్ ప్రపంచం దూరం పెట్టింది. గతంలో బిల్ గేట్స్‌ను ముఖ్య అతిథిగా పిలిచేందుకు పోటీపడ్డ ప్రపంచ దేశాధినేతలు, కార్పొరేట్ ప్రముఖులు...ఎప్స్టిన్ ఫైల్స్‌తో ఆయన పేరు పలికేందుకు ససేమిరా అంటున్నారు. ఆయనతో వేదిక పంచుకునేదే లేదని తేల్చిచెబుతున్నారు. అలాంటి బిల్ గేట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పనిగట్టుకుని పిలిచి మరీ రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా రాచ మర్యాదలు చేశారు. చంద్రబాబు తీరుపై దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిల్ గేట్స్ రాష్ట్రానికి రావడం గర్వకారణమని చంద్రబాబు, లోకేశ్‌లు బహిరంగంగా ప్రకటించడం, వీటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టడం దిగజారుడుతనమేనని... మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. లైంగిక నేరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.