లారెన్స్‌ త్యాగం.. విజయ్‌ కేబినెట్‌లో మినిస్టర్‌గా త్రిష ?

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఒకే ఒక్క పేరు.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష. తలపతి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ త్రిష గురించే ఎక్కడలేని చర్చ నడుస్తోంది.

Post Published By: dialnews
Updated : 4 July 2026, 6:50 PM IST

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఒకే ఒక్క పేరు.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష. తలపతి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ త్రిష గురించే ఎక్కడలేని చర్చ నడుస్తోంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న త్రిష, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని, వస్తూనే ఏకంగా డిప్యూటీ సీఎం లేదా మంత్రి కాబోతున్నారని కోలీవుడ్‌లో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే, ముఖ్యమంత్రి విజయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన 'తిరుచ్చి' స్థానం నుంచి త్వరలో ఉపఎన్నిక జరగాల్సి ఉంది.

ఈ స్థానం నుంచే త్రిషను బరిలోకి దించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్రిష ప్రస్తుతం పైకి ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించకపోయినా.. టీవీకే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ తిరుచ్చి బై-ఎలక్షన్‌లో టీవీకే అభ్యర్థిగా త్రిష పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిస్తే.. ఆమెకు విజయ్ ప్రభుత్వంలో ఏకంగా 'డిప్యూటీ సీఎం' పోస్ట్ లేదా కేబినెట్‌లో అత్యంత కీలకమైన మంత్రి పదవి దక్కుతుందని జోరుగా వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించి ఇంత గట్టిగా చర్చ జరుగుతున్న సమయంలోనే.. నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ పేరు హఠాత్తుగా తెరపైకి వచ్చింది. విజయ్ పై ఉన్న అభిమానంతో, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన టీవీకే పార్టీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. త్రిషకు చెక్ పెడుతూ, తిరుచ్చి స్థానం నుంచి ఆమెకు బదులుగా లారెన్స్ పోటీ చేస్తారని రకరకాల పోస్టులు వైరల్ అయ్యాయి. కానీ, ఈ ఊహాగానాలకు లారెన్స్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు.

తాను తిరుచ్చి నుంచి పోటీ చేయడం లేదని, సోషల్ మీడియాలో తన పేరుతో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రీసెంట్‌గా ఓ వీడియో ద్వారా స్పష్టం చేశారు. దీంతో లారెన్స్ రేసులో లేరని తేలిపోవడంతో.. మళ్లీ సోషల్ మీడియా ఫోకస్ మొత్తం త్రిష వైపు మళ్లింది. దీంతో త్రిష ఎంట్రీకి దాదాపు రూట్ క్లియర్ అయిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. త్రిష ఉప ముఖ్యమంత్రి కాబోతోంది అన్న వార్తలు నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్నప్పటికీ.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అటు త్రిష టీమ్ కానీ, ఇటు విజయ్ టీవీకే పార్టీ కానీ ఈ వార్తలను అఫీషియల్‌గా ధృవీకరించలేదు. ప్రస్తుతం త్రిష తన చేతిలో ఉన్న వరుస సినిమాల షూటింగ్స్‌తో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి, పార్టీ అధిష్టానం నుంచి లేదా త్రిష నుంచి క్లారిటీ వస్తే తప్ప ఈ కన్ఫ్యూజన్‌కు తెర పడదు. అయితే, తమిళ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు కాబట్టి.. భవిష్యత్తులో ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.

Published : 
  • 4 July 2026, 6:50 PM IST