ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పదవి స్వీకార ప్రమాణం చేశాడు. కుటుంబం మొత్తం ఆ వేడుకను కనులారా చూసింది. అన్నిటికీ మించి విజయ్ ప్రియురాలు, నెచ్చెలి త్రిష పదవి స్వీకార ప్రమాణోత్సవంలో.... హడావుడి చేశారు. విజయ్ తల్లి... తన కొడుకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న దృశ్యాన్నిఆనందభాష్పాలతో వీక్షించారు. ఇక త్రిష సంతోషానికి హద్దులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి దృష్టి ఒక ఇద్దరి పైనే ఉంది. కానీ వాళ్ళిద్దరూ అక్కడ లేరు. వాళ్ళ ఫంక్షన్ కి రాలేదు. వాళ్లే విజయ్ కొడుకు జేసన్. కూతురు దివ్య. జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకున్న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న వేళ భార్య సంగీత, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా రాకపోవడం ఈ వేడుకకు ఏకైక లోటని అందరూ కామెంట్ చేస్తున్నారు .
విడాకులకు అప్లై చేసుకున్నందున భార్య సంగీత రాకపోయినా.., పిల్లలు ప్రమాణ స్వీకారం కి హాజరు అయిఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు . విజయ్ తో విభేదాలు, విడాకులు వ్యవహారం తర్వాత సంగీత పిల్లలతో కలిసి లండన్ వెళ్లిపోయారు. వాళ్ళకి దుబాయ్ లో కూడా ఒక ఇల్లు ఉంది. సంగీత కు బ్రిటిష్ సిటిజన్ షిప్ ఉంది. ఆమె ప్రస్తుతం అక్కడే ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నారు.
విజయ్ ఆమెను పిల్లల్ని అసలు ప్రమాణ స్వీకారానికి పిలిచారా పిలవలేదా..? పిలిచినా వాళ్ళు రాలేదా అనే చర్చ బాగా జరుగుతుంది. మరోవైపు నటి త్రిష ప్రమాణస్వీకారంలో ప్రధాన ఆకర్షణగా నిలవడం, విజయ్ తో ఆమె డేటింగ్ రూమర్స్ కు మరింత బలాన్ని ఇచ్చింది.
ప్రపంచం మొత్తం మనకోసం చప్పట్లు కొడుతుంటే.. ఆ చప్పట్ల మధ్య సొంత రక్తం పలకరింపు లేకపోతే, ఆ గెలుపు ఒక కాలీ గ్లాస్ లాంటిది. కటౌట్లు... హిట్ లు... రికార్డులు వీటన్నిటిని దాటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు విజయ్. తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్, తల్లి శోభ కళలో ఆనందం చూస్తుంటే కొడుకుగా అతను గెలిచాడు అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే తండ్రిగా ఓడిపోయాడేమో సందేహం వస్తుంది. లోకమంతా అతని నాయకుడు అని పిలుస్తున్నారు, కానీ ఆ పిలుపులో కొడుకు కూతురు గొంతులు మాత్రం లేవు.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక ప్రభంజనం. అతని గెలుపు ఒక చరిత్ర. హిస్టరీ పేజీల మధ్య ఇప్పుడు పర్సనల్ ట్రాజడీ కూడా చేరింది. తండ్రి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు.. పిల్లలు పక్కన లేకపోవడం.... గుండెలో ఒక మూల ఎప్పుడు గుచ్చుకుంటూనే ఉంటుంది. అధికారం వస్తుంది, హోదా వస్తుంది పోతుంది. కానీ ఆ మిస్ అయిన బంధం మళ్ళీ రావు. ఇప్పుడు విజయ్ అనుభవిస్తున్న బాధ అదే. విజయ సాధించిన విజయం అలాంటి విజయం కాదు. ఆ విజయంలో ఆయన పిల్లలు భాగస్వాములు కాకపోవడమే అందరినీ బాధిస్తోంది. కొడుకుగా... నాయకుడిగా సక్సెస్ అయిన విజయ్ తండ్రిగా మాత్రం ఓడిపోయాడు.