Top story: వైట్ హౌస్ లో గణపతి పూజ, జేడి వాన్స్ భార్య సంచలనం… నేను చచ్చే వరకు హిందువునే…!

అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒక భారతీయ మూలాలున్న మహిళా సంచలనంగా మారారు. ఆమె మరెవరో కాదు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్య, యూఎస్ సెకండ్ లేడీ ఉషా వాన్స్.

Post Published By: dialnews
Updated : 26 June 2026, 9:25 AM IST

అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒక భారతీయ మూలాలున్న మహిళా సంచలనంగా మారారు. ఆమె మరెవరో కాదు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్య, యూఎస్ సెకండ్ లేడీ ఉషా వాన్స్. తన భర్త జేడీ వాన్స్ క్రిస్టియానిటీ లోకి మారినప్పటికీ, తానెందుకు ఇప్పటికీ హిందూ మతాన్నే నమ్ముతున్నానో చెప్తూ ఉషా వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన భర్త తనను క్రైస్తవ మతంలోకి మార్చాలని అనుకుంటున్నారనే ఊహాగానాలకు ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే, జేడీ వాన్స్ గతంలో రాసిన పుస్తకాల వల్ల ఆయన తన హిందూ భార్యను కూడా క్రిస్టియన్‌గా మార్చాలని చూస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది.

దీనిపై ఉషా వాన్స్ స్పందిస్తూ, తన భర్త తనను ప్రతిరోజూ మతం మారమని బలవంతం చేయడం లేదని స్పష్టం చేశారు. తన భర్త జేడీ వాన్స్ చిన్నతనం మొత్తం ఎంతో గందరగోళంగా, తీవ్రమైన మానసిక ఒత్తిడితో సాగిందని.. అందుకే ఆయన జీవితంలో స్థిరత్వం కోసం, ప్రశాంతత కోసం చర్చిని మరియు కాథలిక్ విశ్వాసాలను వెతుక్కున్నారని ఆమె గుర్తుచేశారు. కానీ తాను మాత్రం కాలిఫోర్నియాలో భారతీయ వలస తల్లిదండ్రుల వద్ద ఎంతో సంతోషకరమైన, ప్రశాంతమైన హిందూ కుటుంబంలో పెరిగానని.. తన జీవితంలో ఆల్రెడీ మానసిక స్థిరత్వం ఉందని, అందుకే తాను మతం మార్చుకుని వేరే వ్యక్తిలా నటించాల్సిన అవసరం రాలేదని ఉషా వాన్స్ పక్కా క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఈ దంపతులకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. 'స్టోరీటైమ్ విత్ ది సెకండ్ లేడీ' అనే ఒక పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో ఉషా వాన్స్‌తో కలిసి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పాల్గొన్నారు. ఆ సమయంలో జేడీ వాన్స్ తన భర్తగా పక్కన కూర్చుని.. ఎంతో వింతగా ఉషా వాన్స్ మోకాలిపై తట్టారు. ఈ చిన్న మూమెంట్‌ను నెటిజన్లు పట్టుకుని.. "అదేం టచ్.. కుక్కను నిమిరినట్లు నిమురుతున్నాడు.. అసలు వీళ్లిద్దరికీ ఒకరినొకరు తెలుసా?" అంటూ విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరి మధ్య బాండింగ్ సరిగ్గా లేదంటూ కొందరు ట్రోల్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అదంతా సాధారణమైన విషయమేనని కొట్టిపారేస్తున్నారు.

ట్విస్టులు మరియు ట్రోలింగ్స్ ఎలా ఉన్నా.. వాన్స్ కుటుంబంలో త్వరలోనే ఒక పెద్ద గుడ్ న్యూస్ రాబోతోంది. ఉషా వాన్స్, జేడీ వాన్స్ దంపతులకు ఇప్పటికే ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఉషా వాన్స్ నాలుగో సారి గర్భం దాల్చారని, రాబోయే కొన్ని వారాల్లోనే వారు తమ నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఈ ఇంటర్వ్యూ ద్వారా అధికారికంగా వెల్లడించారు. భవిష్యత్తులో ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఉండటానికే తాము కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడిని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు ఈ స్టార్ కపుల్ పేర్కొన్నారు. సో చూశారుగా.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ భార్య అయినప్పటికీ, తన భారతీయ మూలాలను, హిందూ సంస్కృతిని ఉషా వాన్స్ ఎంత ధైర్యంగా కాపాడుకుంటున్నారో.

Published : 
  • 26 June 2026, 9:25 AM IST