Top story: భారత్ లక్ష్యంగా ఏకమైన చైనా, బంగ్లాదేశ్ బోర్డర్‌లో మాన్‌స్టర్‌ను దించిన ఇండియా..!

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనా పర్యటనలో ఉన్నాడు. ఇవాళ చైనా ప్రీమియర్ లీతో భేటీ అయ్యాడు. రేపు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నాడు. ఈ పర్యటనలో అత్యంత కీలక అంశం చైనీస్ జే-10సీఈ మల్టీరోల్ ఫైటర్ జెట్ కొనుగోలుకు సంబంధించి తుది చర్చలు జరపడమే.

Post Published By: dialnews
Updated : 26 June 2026, 5:15 PM IST

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనా పర్యటనలో ఉన్నాడు. ఇవాళ చైనా ప్రీమియర్ లీతో భేటీ అయ్యాడు. రేపు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నాడు. ఈ పర్యటనలో అత్యంత కీలక అంశం చైనీస్ జే-10సీఈ మల్టీరోల్ ఫైటర్ జెట్ కొనుగోలుకు సంబంధించి తుది చర్చలు జరపడమే. చైనా నుండి 24 జే-10సీఈ ఫైటర్లను కొనుగోలు చేయాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. ఈ ఒప్పందాన్ని ఆగస్టు 2026 నాటికి ఖరారు చేయాలని డాకా భావిస్తోంది. ఈ ఒప్పందం ఖరారైతే పాకిస్తాన్ తర్వాత చైనా యుద్ధ విమానాలను వాడబోతున్న రెండవ దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ వైమానిక దళం వద్ద 36 జే-10సీఈ విమానాలున్నాయి. ఈ డీల్‌తో భారత్‌కు ముప్పు తప్పకపోవచ్చనే చర్చ మొదలైంది. ఎందుకంటే, జే-10సీ యుద్ధ విమానాలను మన రాఫెల్ ఫైటర్ జెట్లకు కౌంటర్‌గా చెబుతారు. ఫ్రాన్స్ నుంచి భారత్ రాఫెల్‌ జెట్లను కొనుగోలు చేసిన తర్వాత ఆఘమేఘాల మీద చైనా ఫైటర్లను కొనుగోలు చేసింది ఇస్లామాబాద్. ఇప్పుడు ఆ దేశ బాటలోనే అడుగులేస్తూ బంగ్లాదేశ్‌ కూడా వాటినే కొనుగోలు చేస్తుంది.

పాకిస్తాన్‌లానే రాఫేల్‌కు ధీటుగా జే-10సీఈ యుద్ధ విమానాలు నిలుస్తాయని బంగ్లా కూడా భావిస్తోంది. అయితే ఈ ఫైటర్ జెట్లపై ముందు నుంచీ అన్నీ అనుమానాలే. చైనా చెబుతున్నట్టుగా ఈ జెట్స్ అంత మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చని.. రాఫేల్‌కు ధీటుగా ఉండకపోవచ్చని మిలటరీ ఎక్స్‌పర్ట్స్ ఎప్పటి నుంచో అనుమానిస్తున్నారు. సింగిల్ ఇంజిన్ మల్టీరోల్ ఎయిర్ క్రాఫ్ట్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో, ఎయిర్ టూ ఎయిర్ కాంబాక్ట్ ఆపరేషన్స్ చేపట్టగలదని చైనా చెబుతోంది. ఈ మాటలు నమ్మిన పాకిస్తాన్ సైతం చైనాకు చెందిన ఈ ఫైటర్ జెట్స్ తమ వైమానిక దళ బలాన్ని పెంచుతాయని భావించింది. భారత్ రాఫేల్‌ విమానాల డీల్‌లో విమానాలతో పాటు సాంకేతికతను పొందినట్టే.. తాము కూడా జే-10సీఈ విమానాల ఒప్పందంతో ఫైటర్ జెట్లతోపాటు సాంకేతికతను అంది పుచ్చు కుంటామని గొప్పలు పోయింది. కానీ, ఆపరేషన్ సిందూర్ సమయంలో జే-10సీ ఫైటర్లు ప్రభావం చూపించలేకపోయాయి. మరి బంగ్లాదేశ్ వీటిని ఎందుకు కొంటున్నట్టు?

నిజానికి.. రాఫెల్‌తో చైనాజే-10సీఈకి అసలు పోలికే లేదు. థ్రస్ట్, షార్ట్-రేంజ్ క్షిపణులు మొదలు అన్నింట్లోనూ జే-10సీఈ జెట్లకంటే రాఫెల్స్‌కు స్పెషల్ అడ్వాంటేజ్ చాలానే ఉన్నాయి. విజువల్ రేంజ్ ఫైటింగ్ సమయంలో జే-10సీ కంటే ఎక్కువమందిని అంతంచేసే సత్తా రాఫెల్ యుద్ధ విమానాలకు మాత్రమే ఉంది. మీటీయర్ మిస్సైల్, ఆర్‌బీఈ2 ఏఈఎస్ఏ రాడార్ కలయికతో విజువల్ రేంజ్ వార్‌లో చైనా జెట్లకంటే చాలా మెరుగ్గా పనిచేసే సత్తా రాఫెల్ సొంతం. ఇది మాత్రమే కాదు.. ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించగల సత్తా రాఫెల్‌కు ఉంది. ఇవి 9వేల 500 కేజీల ఆయుధాలను మోసుకెళ్లగలవు. అలాగే, అణు క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం రాఫెల్‌ ఫైటర్ జెట్లకు ఉంది. రాఫెల్‌ ఫైటర్ జెట్ గంటకు 1,389 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. వీటి ఎత్తు 5.30 మీటర్లు, పొడవు 10.30 మీటర్లు. గాల్లోనే ఇంధనం నింపుకునే సత్తా వీటి సొంతం. రాఫెల్‌ విమానానికి అన్ని వైపుల నుంచి నిఘా పెట్టే సామర్థ్యం ఉంటుంది. అంటే 360 డిగ్రీస్ విజిబిలిటీ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, లిబియా, మాలి, ఇరాక్, సిరియాల్లో జరిగిన యుద్ధాల్లో రాఫెల్‌ ఫైటర్లను విజయవంతంగా ఉపయోగించారు.

ఒక్కటి మాత్రం స్పష్టం.. బంగ్లాదేశ్, చైనా రక్షణ ఒప్పందం దక్షిణాసియాలో, ముఖ్యంగా బంగాళాఖాతంలో వ్యూహాత్మక మార్పులకు కారణం కాబోతోంది. దీనివల్ల మన దేశానికి రెండు వైపులా అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వైపు నుండి వైమానిక ముప్పు ఏర్పడే అవకాశం ఉందని భద్రతా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య కేవలం యుద్ధ విమానాల ఒప్పందమే కాదు.. భారత్ లక్ష్యంగా మరో కుట్రకు కూడా తెరలేపారు. ఉత్తర బంగ్లాదేశ్‌లోని కీలక లాల్‌మోనిర్‌హాట్ ఎయిర్‌బేస్‌ను బంగ్లాదేశ్ తిరిగి ప్రారంభించబోతోంది. ఇది భారత సరిహద్దుకు కేవలం 12 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో, అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్‌కు అతి సమీపంలో ఉంది. ఈ ఎయిర్‌ బేస్ ఆధునీకరణకు మరియు కొత్త హ్యాంగర్ల నిర్మాణానికి బీజింగ్ సహాయం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా బంగ్లాదేశ్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించుకోవడానికి చైనాతో రక్షణ, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ కుట్రలు భారత్ లక్ష్యంగానే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

చైనాతో కలిసి బంగ్లాదేశ్ చేస్తున్న కుట్రలను న్యూఢిల్లీ నిశితంగా గమనిస్తోంది. లాల్‌మోనిర్‌హాట్ ఎయిర్‌బేస్ వేదికగా సిలిగురి కారిడార్‌పై కన్నేయాలని చూసినా.. చైనా జెట్లతో తూర్పు సరిహద్దుల్లో ఒత్తిడి పెంచాలని ప్లాన్ చేసినా.. ఆ కుట్రలను తిప్పికొట్టడానికి భారత్ పూర్తి సన్నద్ధతతో ఉంది. శత్రువుల కదలికలను క్షణాల్లో పసిగట్టే అత్యాధునిక నిఘా వ్యవస్థలు, గాల్లోనే శత్రు క్షిపణులను, ఫైటర్ జెట్లను తుత్తునియలుచేసే ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇప్పటికే తూర్పు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నాయి. వీటికి తోడు హసిమారా ఎయిర్‌బేస్ నుంచి గర్జిస్తున్న రాఫెల్ స్క్వాడ్రన్లు ఎలాంటి సవాల్‌నైనా క్షణాల్లో బూడిద చేయడానికి రెడీగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా.. ఇప్పుడు వాటి తోక పట్టుకుని వస్తున్న బంగ్లాదేశ్.. ఇలా ఏ వైపు నుంచి ముప్పు వచ్చినా, టూ-ఫ్రంట్ కాదు కదా త్రీ-ఫ్రంట్ వార్‌ ముంచుకొచ్చినా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉంది. 1971లో బంగ్లాదేశ్‌కు విముక్తి ప్రసాదించిన భారత బలగాలు.. అవసరమైతే మళ్లీ దాని అంతేచూడటానికీ సిద్ధంగా ఉన్నాయి.

 

Published : 
  • 26 June 2026, 5:15 PM IST