కాంగ్రెస్ అంటే అంతే. కాంగ్రెస్ అలాగే ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవడు ఎలా పడితే అలా మాట్లాడతారు. ఆ పార్టీలో ఎవరు ఏమైనా అంటారు అనిపించుకుంటారు. అధికారం ఇచ్చినా సరే... ఫైనల్ గా కంపు చేసుకుని జనం చేత చి కొట్టించుకుంటారు . ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే.రేవంత్ రెడ్డి అవినీతిపరుడని, వాళ్ళ అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.... సెటిల్ మెంతులు చేస్తున్నారని టాబ్లెట్ మంత్రులు ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. మంత్రుల బహిరంగ సభలపై అంతు చూస్తామని సవాళ్లు విసురుతున్నారు. ఎన్నికలు ఇంకా రెండున్నర సంవత్సరాలకు ఉండగానే... పల్నా వాళ్లకు సీట్ ఇస్తా... పలనా వాళ్ళకి సీటు ఇవ్వను అని ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. సీట్ ఇవ్వను సీట్ ఇస్తాను అనడానికి ముఖ్యమంత్రి ఎవడు అంటూ వెటకారాలు ఆడుతున్నారు.
ఆర్థిక మంత్రి బట్టి భార్య బిల్లులు విడుదల చేయడానికి పది పర్సెంట్ కమిషన్ అడుగుతుంది అంటూ ఒక సామాన్య మహిళ ఉద్యోగి రోడ్డెక్కితే కనీసం ఆ సమస్యను అడ్రస్ చేయడానికి కూడా ప్రభుత్వంలో పార్టీలో ఒకరు ముందుకు రాలేదు. ఎవరి బ్యాటింగ్ వాళ్ళది. ఎంత స్కోర్ కొట్టుకుంటే అంత అన్న స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తోంది. ఈ స్కోర్ కొట్టుకునే విషయంలో మంత్రులు ఎగబడి మరి కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం అనేది ఇప్పటికే జనంలో బాగా నానుతోంది. ఇప్పుడు ఈ అంతర్గత కు మ్ములాటలతో.. మరింత జనంలోకి వెళ్ళింది.
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాతగానీ అధికారం సంపాదించుకోలేక పోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని, అందుకు భారీ మూల్యాన్ని చెల్లించి, ఆంధ్రప్రదేశ్ ని కూడా వదులుకొని తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చికూడా, రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పొందడానికి, పదేళ్లు పట్టింది ఆ పార్టీకి. అది కూడా టిఆర్ఎస్ భారీగా తప్పులు చేయడం, ఆ పార్టీ నేతల అహంకారం 2023లో కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టింది. కానీ, ఇంత శ్రమించి, సమష్టిగా కృషిచేసి, తెచ్చుకున్న అధికారాన్ని కాంగ్రెస్ నేతలు చేజేతులా జారవిడుచుకుంటున్నారా? పార్టీని నాశనం చేసుకుంటున్నారా? అనే అనుమానం ప్రజల్లో బాగా వచ్చేసింది. తినే కంచంలో మట్టిపోసుకోవడం కాంగ్రెస్‌కు కొత్తేం కాదు.
ఇప్పుడా పార్టీలో జరుగుతున్న అంతర్గత సంక్షోభం చూసి, జనం దటీజ్ కాంగ్రెస్ అని మాట్లాడుకుంటున్నారు. మంత్రి పదవి రాలేదని ఒకరు.. అడిగింది ఇవ్వలేదని మరొకరు.. గౌరవం దక్కడం లేదని వేరొకరు.. ఇలా ఎవరికివాళ్లు తిరుగుబాటు జెండాను ఎగురవేసి, జనంలో పార్టీని చులకన చేశారు. వ్యక్తిగత స్వార్థాలకోసం, సొంత ఉనికి కోసం, సీఎంని ధిక్కరించాలని కొందరు చేస్తున్న ప్రయత్నం.. చివరికి పార్టీ పుట్టి ముంచబోతోంది. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడ , ఏకపక్ష నిర్ణయాలు.... సొంత పార్టీ నేతలని వెనకనుంచి దెబ్బ కొట్టే వ్యూహాలు ఇవన్నీ విరసి చివరికి మరో 10 ఏళ్లపాటు వెనక్కి నెట్టైపోతున్నాయి. కాంగ్రెస్ హై కమాండ్ ఇంకా అలసత్వం ప్రదర్శిస్తే, ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టే. ఇక సమయం లేదు. వ్యూహాత్మకంగానో, నయాన్నో, భయాన్నో నాయకులను దారికి తీసుకురాలేకపోతే కాంగ్రెస్ మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చినప్పుడు, ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. రెండేళ్లయినా అది నేరవేరకపోవడంతో సహజంగానే దూకుడు ప్రద్శించే రాజగోపాల్ రెడ్డి, తరచూ తన నోటికి పని చెబుతున్నారు. అధిష్టానాన్ని, సీఎంని నానా మాటలు అంటున్నారు.ఇక సీనియర్ నేత చిన్నారెడ్డి: నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నేత అయిన చిన్నారెడ్డి సహజంగానే గుర్తింపునీ గౌరవవాన్నీ కోరుకుంటారు. మెగా రెడ్డి అనే డబ్బులను నాయకుడు చిన్నారెడ్డి సీటు కొనుక్కున్నారు. సీటు తక్కని చిన్నారెడ్డి ఇప్పుడు గౌరవం కూడా దక్కలేదని ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇదే సమస్యతో జీవన్ రెడ్డి ఏకంగా పార్టీని వీడి, బీఆర్ఎస్కు వెళ్లిపోయారు.
ఇక సురేఖ. వివాదాలకు కేంద్ర బిందువైన సురేఖ.. తాను అధికారంలో ఉన్నాననే విషయాన్ని తరచూ మరిచిపోతుంటారు. కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలను చుట్టి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన సురేఖ.. మొన్నటి ఎన్నికల్లో గెలిచి మరోసారి మంత్రయ్యారు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఆమె, ఆమె భర్త కొండా మురళీ నేరుగా సీఎంతోనే యుద్ధానికి దిగుతున్నారు.కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఏకంగా ముఖ్యమంత్రిని... నువ్వు నువ్వు అంటూ చాలెంజులు చేయడం చూస్తే కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం ఎంతగా ఉందో కనిపిస్తోంది.ఇవన్నీ పైకి కనిపించే కథలు. ఇంకా బయటపడకుండా ప్రతీ జిల్లాలోనూ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
నల్లగొండ జిల్లాలో మందుల సామేలు గొడవ ఇంకా సద్దుమణగలేదు. ఇలాంటి పంచాయితీలు నియోజవర్గానికి ఒకటి ఉన్నాయి. మా కాంగ్రెస్‌లో ఇది మామూలే. మాకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.. అని పార్టీ నాయకులు ఎంత దబాయించినా, జనం వీటినంత తేలిగ్గా తీసుకోరు. అధికారంలోకి వచ్చిన ప్రతీసారీ కాంగ్రెస్ కేవలం అంతర్గత కుమ్ములాటలతోనే పవర్‌కు దూరమవుతుంది. ఈ పచ్చి నిజాన్ని ఎందుకు ఆ పార్టీ నేతలు గ్రహించి వ్యవస్థను సెట్ చేసుకోరో అర్థం కాదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కళ్లు తెరవాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన అన్నదమ్ముల్ని కంట్రోల్ చేయకపోతే.. ప్రభుత్వంలోనే సంక్షోభం వచ్చిన ఆశ్చర్యం లేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సీఎంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యూహాలే ప్రదర్శిస్తున్నారు అనే విమర్శ ఆయన క్యాబినెట్ లోనే బలంగా వినిపిస్తోంది. అందుకే సీఎం కూడా మొండిగా వ్యవహరించకుండా అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. నాయకత్వానికి ఎదురయ్యే అతిపెద్ద ఛాలెంజ్ అదే. కాంగ్రెస్‌లో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లడం.. ఒక్కొక్కరి సమస్యను వ్యక్తిగతంగా దృష్టిపెట్టి పరిశీలించడం.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అత్యవసరం.
కాంగ్రెస్ సంస్కృతికి తనను తాను ట్యూన్ చేసుకుని, నయాన్నో భయాన్నో అన్ని వర్గాలను కులపుకుని ముందుకు వెళ్లాలి. అవసరమైతే అధిష్టానంతో కూర్చుని, ఒక్కొక్క సమస్యను విడివిడిగా అడ్రస్ చేయాలి. ఇక తప్పని పరిస్థితుల్లో మాత్రమే కొరడా ఝళిపించాలి. నాకు ఎవరూ అసరం లేదు.. నేనే అన్నీ చూసుకుంటాను అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యంకాని పని.
ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా గడువు ఉంది. అందుకే, ఆదిలోనే ఈ కుమ్మలాటల్నీ, తిరుగుబాటుల్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ మామూలే అని గాలికొదిలేస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ తన గొయ్యి తానే తీసుకుంటుందనే మాట తెలంగాణలో మరోసారి రుజువవుతుంది.నిన్ను మొన్నటి వరకు గ్రాఫ్ పెరగని బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో కొమ్ములాటలతో తన గ్రాఫ్ క్రమంగా పెంచుకుంటుంది. జనంలో ఈ కాంగ్రెస్ వాళ్ళ కంటే కెసిఆర్ఏ బెటరు అనే ఆలోచన మొదలైంది. మొత్తంగా కాంగ్రెస్ కి కౌంటర్ కూడా స్టార్ట్ అయింది.