Top story: భారతీయులకు అమెరికా సేఫ్ కాదా…? మనోళ్లు వచ్చేస్తామనడానికి కారణాలేంటి…?

డాలర్ డ్రీమ్స్ ఢమాల్ అవుతోంది. అమెరికాపై భారతీయులకు మోజు తగ్గుతోంది. వీసా కష్టాలు, అమెరికాలో ఆర్థిక కష్టాలు ఇండియావైపు తిరిగొచ్చేలా చేస్తున్నాయి. అభద్రతా భావంతో ఉండేకంటే...స్వదేశానికి తిరిగి రావడం బెటర్ అనుకుంటున్నారు.

Post Published By: dialnews
Updated : 24 April 2026, 9:07 AM IST

డాలర్ డ్రీమ్స్ ఢమాల్ అవుతోంది. అమెరికాపై భారతీయులకు మోజు తగ్గుతోంది. వీసా కష్టాలు, అమెరికాలో ఆర్థిక కష్టాలు ఇండియావైపు తిరిగొచ్చేలా చేస్తున్నాయి. అభద్రతా భావంతో ఉండేకంటే...స్వదేశానికి తిరిగి రావడం బెటర్ అనుకుంటున్నారు. అమెరికాను వదిలేస్తున్న వారు కేవలం భారత్‌కే కాకుండా.. కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల వైపు చూస్తున్నారు.అమెరికాపై క్రమంగా మోజు తగ్గిపోతోంది. వీసా కష్టాలు ఎక్కువయ్యాయ్. గ్రీన్ కార్డులు ఇంతకుముందులా రావడం లేదు.మారిన రూల్స్ అన్నీ ముప్పతిప్పలు పెడుతున్నాయి. నిత్యం అభద్రత భావమే.

ఇన్ని కష్టాలు పడుతూ అమెరికా ఉండటం అవసరమా అనేదాకా పరిస్థితులు దాపురించాయి.అమెరికా వెళ్లాలి. అక్కడ కొన్నేళ్లు ఉండాలి. పది,పదిహేనేళ్లు ఉండి వస్తే లైఫ్ సెటిల్.గ్రీన్ కార్డు వస్తే అక్కడే స్థిరపడిపోవాలి.అగ్రరాజ్యంలోనే శాశ్వతంగా ఉండిపోవాలి. లేదంటే భారత్ తిరిగొచ్చాక బిందాస్‌గా బతికేయొచ్చు అనుకునేవారు.అందుకే ఇక్కడ చదువు పూర్తికాగానే అమెరికా ఫ్లైట్‌ ఎక్కేవాళ్లు. మంచి ఉద్యోగంలో చేరి హ్యాపీగా లైఫ్‌ లీడ్‌ చేసేటోళ్లు.

ఎంఎస్ కోసం వెళ్లిన స్టూడెంట్స్ పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేటోళ్లు.ఇదంతా ఒకప్పుడు.ఇప్పుడుంతా సీన్ రివర్స్. ట్రంప్ రెండోసారి వచ్చాక..అమెరికా అంటే ఎందుకు రా బాబు అక్కడికెళ్లి కష్టపడేదానికంటే ఇక్కడో ఏదో మంచి జాబ్ బెటర్ అనుకునే భారతీయుల శాతం అంతకంతకూ పెరుగుతోంది.డాలర్ల సంగతేమోగానీ..నిత్యం నరకమే.ట్రంప్ ఎప్పుడు ఏ తలతిక్క నిర్ణయం తీసుకుంటాడోననే టెన్షన్.ఇది రెండుళ్లుగా మరింత ఎక్కువైంది.అందుకే అక్కుడున్న మనోళ్లలో అమెరికా అంటే అసహనం పెరుగుతోంది.ఇండియా తిరిగి వచ్చేయడం మంచిదని 40 శాతం ఫీల్ అవుతున్నారని ఓ సర్వే తేల్చింది.

కోట్లాది మంది భారతీయుల మదిలో మెరిసే అమెరికన్ డ్రీమ్ ఇప్పుడు ఒక పీడకలలా మారుతోంది. ఏళ్ల తరబడి కష్టపడి కూటబెట్టిన డబ్బులతో, సముద్రాలు దాటి, సిలికాన్ వ్యాలీలో సామ్రాజ్యాలు నిర్మించిన భారతీయులు.. ఇప్పుడు తమ సొంత దేశానికి తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నారు. లేదంటే మరో దేశానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారట. డాలర్ల కోసం వ్యయప్రయాసలు, దశాబ్దాల నిరీక్షణలు, మారుతున్న రాజకీయ పరిస్థితుల మధ్య విసిగిపోయిన ప్రవాస భారతీయుడు ఇప్పుడు తన మకాం మార్చాలని చూస్తున్నారని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ 2026 సర్వే రిపోర్ట్ వెల్లడించింది.

అమెరికాను వీడాలనుకునే వారిలో 58 శాతం మంది అక్కడ మారిన రాజకీయ వాతావరణం తమ నిర్ణయానికి ప్రధాన కారణమని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశంలో రాజకీయ విభజన పెరిగిందని 71 శాతం మంది ఇండియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా కేవలం అమెరికన్లకే అనే నినాదాలు.. మారుతున్న సామాజిక పరిస్థితులు భారతీయుల్లో తమ ఉనికిపై అనుమానాలను పెంచుతున్నాయి. ఒకప్పుడు డెమోక్రాట్లకు మద్దతుగా నిలిచిన భారతీయులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు.

2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగిన ఈ సర్వే ప్రకారం.. ప్రతి 10 మంది భారతీయ-అమెరికన్లలో నలుగురు అమెరికాను వదిలి వెళ్లిపోవాలని సీరియస్ గా ఆలోచిస్తున్నారని తేలింది. అంటే దాదాపు 40 శాతం మంది అమెరికాలో ఉండటం సురక్షితం కాదని భావిస్తున్నారు. అమెరికా జనాభాలో భారతీయుల వాటా కేవలం 1.5 శాతం మాత్రమే. కానీ ఆ దేశ పన్నుల ఆదాయంలో ఏకంగా 6 శాతం మనోళ్లే కడుతున్నారు. ఒక విధంగా ఈ కేటగిరీ ప్రజలు వెళ్లిపోవటం అమెరికాకు కూడా భారీ దెబ్బే. గత ఏడాది హెచ్1బీ వీసాల జారీ 25శాతం మేర తగ్గింది. లక్ష డాలర్ల అప్లికేషన్ ఫీజు అమల్లోకి వచ్చిన తర్వాత హెచ్‌-1బీ వీసాల కోసం కంపెనీల నుంచి డిమాండ్ 87శాతం తగ్గింది.

ఇండియన్స్ అసహనానికి మరో ప్రధాన కారణం అక్కడి ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. అది చేతికి రావడానికి దాదాపు 30 నుంచి 40 ఏళ్లు పడుతోంది. అమెరికా ఇప్పటికీ 2013-14 నాటి గ్రీన్ కార్డ్ అప్లికేషన్లనే ప్రాసెస్ చేస్తున్నట్లు మే 2026 వీసా బులెటిన్ తెలిపింది. అంటే దాదాపు 10 ఏళ్ల కిందట అప్లై చేసినోళ్లకు ఇప్పుడు ప్రాసెస్ చేస్తుంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది.ఆ తర్వాతి వాళ్లకు ఇంకెప్పుడు వస్తాయనే భయాలు వెంటాడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వెయిటింగ్ 70 ఏళ్లు కూడా ఉండవచ్చని అంచనా. అంటే ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితం మొత్తం గ్రీన్ కార్డ్ కోసమే పోరాడాల్సి వస్తుందన్నమాట. దీంతో అక్కడ స్థిరపడలేకపోతున్నాయి ఇండియన్ ఫ్యామిలీస్.

Published : 
  • 24 April 2026, 9:07 AM IST