Top Story: వీడే అసలు సమస్య… ప్రపంచానికి ఉన్న ఏకైక సమస్య ట్రంప్… అన్ని అరాచకాలకు ఒక్కడే కారణం…!

యుద్ధం తర్వాత యుద్ధం. రక్తపాతం తర్వాత మరో రక్తపాతం. ఒకవైపు వేలమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరో వైపు దేశాలన్నీ ఆర్థికంగా అతలాకుతలం అయిపోతున్నాయి.

Post Published By: dialnews
Updated : 12 March 2026, 12:50 PM IST

యుద్ధం తర్వాత యుద్ధం. రక్తపాతం తర్వాత మరో రక్తపాతం. ఒకవైపు వేలమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరో వైపు దేశాలన్నీ ఆర్థికంగా అతలాకుతలం అయిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా ప్రపంచంలో అశాంతి ప్రబలిపోయింది. ఏ దేశం.. ఏ ప్రజలు ఏ రాత్రి ప్రశాంతంగా పడుకోవటం లేదు. ఎక్కడో ఇరాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ఇండియాలో వంట గదిలో సంక్షోభం. వేల ఫ్లైట్లు నేలపై నిద్రపోతున్నాయి. లక్షలాది మంది జనం ఎయిర్పోర్టులో పడిగాపులు పడుతున్నారు.

వేల మంది చిన్నారులు యుద్ధంలో కన్నుమూశారు. ఈ విధ్వంసం మొత్తం సృష్టిస్తున్నది ఒకే ఒక్కడు. ఆ ఒక్కడి అరాచకం.... ఒక్కడి అహంకారం... ఆ ఒక్కడి అత్యాశ ....ప్రపంచానికి ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. వాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. రెండోసారి అధ్యక్షుడు అయిన దగ్గర్నుంచి ప్రపంచ దేశాలకు కంటిమీద కొనుక్కులేదు. రోజు ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే.... ఆ సమస్యను తన వైపు మళ్లించడం తద్వారా ఆర్థిక ప్రయోజనాలు, పబ్లిసిటీ, కుటుంబ వ్యాపార ప్రయోజనాలు ఏదో ఒకటి ట్రంప్ ఆశిస్తూ ఉంటాడు.

2025 జనవరి లో రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ట్రంప్ రకరకాలుగా చెలరేగిపోతున్నాడు. అసలు అమెరికన్లు అంటే ఇంత వెధవల..? అనే భావన ప్రపంచంలో ప్రజలందరికీ తీసుకొచ్చాడు. తెల్లారి లేచిన దగ్గర్నుంచి అమెరికా అధ్యక్షుడిని అనే స్థాయి మర్చిపోయి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతూ అమెరికన్ల అంటే అందరికీ చులకన చేసి పారేశాడు. పెహల్గాం దాడి తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్ జరిపింది.

తనకు ఎటువంటి సంబంధం లేకుండానే ఆ వివాదాల్లో దూరాడు ట్రంప్. కనీసం ఇప్పటికీ 36 సార్లు భారత్ పాకిస్తాన్ మధ్య నేనే యుద్ధం ఆపానంటూ ప్రగల్బాలు పలుకుతూ ఉంటాడు. మరోవైపు పాకిస్తాన్ ని రెచ్చగొడుతూ, దగ్గరకు తీస్తూ ఆ దేశానికి మద్దతు ఇస్తూ ఉంటాడు. నాకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తారా ఇవ్వరా అంటూ ఆగం ఆగం చేశాడు.
మరోవైపు సుంకాల పేరుతో ప్రతి దేశంతో సున్నం పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరినీ భయపెట్టాడు. కేవలం అగ్రరాజ్యం అనే ఒక్క సాకుతో ఏడాదిగా ట్రంప్ చేస్తున్న అరాచకాలు అన్ని ఇన్ని కావు.

అమెరికా ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్న భిన్నం చేసేసాడు. హెచ్ వన్ వీసా లకు రకరకాల ఆంక్షలు పెట్టి, రేట్లు పెట్టి ఆ వ్యవస్థని దెబ్బ కొట్టాడు. అమెరికా పౌరసత్వాలపై కొత్త రూల్స్ పెట్టి అమెరికన్లకే పిచ్చెక్కించాడు. అన్ని దేశాలపై 100%....200% శుంకాలు వేస్తే అమెరికాకి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుందని నమ్మించి... చివరికి ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేశాడు. అమెరికాలో కంపెనీలు మూతపడ్డాయి. ఆంక్షలుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ దెబ్బతిన్నాయి.రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డుకుంటానని చెప్తూనే మరోవైపు ఉక్రెయిన్నీ ఎగదోసాడు. సిరియాపై ఎయిర్ స్ట్రైక్స్ చేశాడు. యూజ్బుల్లా ఇజ్రాయిల్ మధ్య నేరుగానే జోక్యం చేసుకొని ఇజ్రాయిల్ తరపున యుద్ధం చేశాడు.

అధికారం చేపట్టిన నాటి నుంచి ఇరాన్ తో గొడవ పడుతూనే. ఇప్పుడు ఇజ్రాయిల్ సహాయంతో ఇరాన్ పై యుద్ధానికి దిగాడు ట్రంప్. ట్రంప్ తో స్నేహం చేసి.... అమెరికాకు అనుకూలంగా వ్యవహరించి , ఏడు గల్ఫ్ దేశాలు సర్వనాశనం అయ్యాయి. దుబాయ్, యూఏఈ, అబుదాబి , సౌదీ ఇరాన్ దాడుల్లో అతలాకుతలం అయిపోయాయి. ఆ దేశాలు ఆర్థికంగా కోలుకోవాలంటే కనీసం ఐదారు ఏళ్లు పడుతుంది. ట్రంప్ వచ్చిన తర్వాత రకరకాల అటాక్స్ లో పలువురు అమెరికా సైనికులు చనిపోయారు. వాళ్ల కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి.

ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఇప్పటికే లక్ష కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు వాడేసింది. మిస్సైల్స్, వార్ ఫ్లైట్స్, బాంబ్స్ కె ఖర్చు అయిపోయింది. సైనిక మోహరింపు వ్యయం దీనికి అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయడం ,అమెరికా కాంగ్రెస్ నీ ఆందోళన గురిచేస్తుంది. ఇలా చేస్తే ఎక్కువకాలం యుద్ధం చేయలేమని, యుద్ధం నిలిపివేయడం మంచిదని ట్రంప్ సలహాదారులు చెప్తున్నారు. ఇదంతా కేవలం ట్రంప్ అనేవాడి అహంకారం, అత్యాశ వల్లే వచ్చింది. అందుకే ట్రంప్ అనే వాడు ప్రపంచానికే శత్రువుగా మారాడు. ఇప్పుడు వరకు అమెరికా నీ పాలించిన అధ్యక్షుల్లో ఇంత పనికిమాలిన వాడు మరొకడు లేడని అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం కోడై కూస్తోంది.

అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఆర్మోజ్ జలసంది మొత్తం స్తంభించిపోయింది. వేలాది నౌకలు నిలిచిపోయాయి. ప్రపంచం మొత్తం చమురు సంక్షోభం మొదలైంది. ఇండియా మొత్తం వంట గ్యాస్ కొరత ఏర్పడింది. పాకిస్తాన్ ,శ్రీలంక ,బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాలు చమురు సంక్షోభంతో అల్లాడిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. ఇవన్నీ ట్రంప్ అని వాడి వల్లనే వచ్చాయి.
ప్రపంచంలో ప్రతి దేశాన్ని ట్రంప్ ఏదో రకంగా కెలుకుతూనే ఉన్నాడు. ఐక్యరాజ్యసమితిని పూర్తిగా నిర్వీర్యం చేసేసాడు. అనేక అంతర్జాతీయ సంస్థలకు ఫండింగ్ ఆపేశాడు.

ఒక చిల్లర గాడు అమెరికా అధ్యక్షుడు అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది అనే ముద్ర వేయించుకున్నాడు ట్రంప్. చివరికి అమెరికన్లు సైతం రోజు లు లెక్కపెడుతున్నారు. మరో మూడు సంవత్సరాలు ఈ మూర్ఖుని ఎలా భరించాలి..? ఈ లోపు వీడు ఏమేమి చేయబోతున్నాడు..? ఇంకెన్ని సంక్షోభాలు సృష్టిస్తా డో అని అందరూ వనికి చస్తున్నారు. అందుకే ఇవాళ ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్క సమస్య... డోనాల్డ్ ట్రంప్. ప్రపంచ శత్రువు డోనాల్డ్ ట్రంప్.

 

 

 

Published : 
  • 12 March 2026, 12:50 PM IST