Top story: తమిళనాడులో విజయ్‌ గెలుపు ప్రశాంత్‌కిశోర్‌ స్పీచ్ వైరల్‌…!

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్‌ ధోని ఎలాగో...విజయ పార్టీకి ప్రశాంత్‌ కిశోర్‌ అంతేనా ? ధోని ఎలా విజయాలు అందించాడో...తాను కూడా టీవీకేని విజయం చేకూర్చుతానని పీకే ముందే చెప్పేశారా ? తమిళనాడులో టీవీకే మెజార్టీ సీట్లు సాధించడంతో...ప్రశాంత్‌ కిశోర్‌

Post Published By: dialnews
Updated : 5 May 2026, 3:04 PM IST

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్‌ ధోని ఎలాగో...విజయ పార్టీకి ప్రశాంత్‌ కిశోర్‌ అంతేనా ? ధోని ఎలా విజయాలు అందించాడో...తాను కూడా టీవీకేని విజయం చేకూర్చుతానని పీకే ముందే చెప్పేశారా ? తమిళనాడులో టీవీకే మెజార్టీ సీట్లు సాధించడంతో...ప్రశాంత్‌ కిశోర్‌ స్పీచ్‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ప్రశాంత్‌ కిశోర్‌...టీవీకే పార్టీ సమావేశాల్లో ఏం చెప్పాడు ?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీ అవతరించింది. పూర్తి మెజార్టీ సాధించకపోయినా...మెజార్టీకి దగ్గరగా వచ్చింది. దీంతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవేళ విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే...టీవీకే పార్టీకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పీకే వ్యాఖ్యానించారు. తాను టీవీకే సీట్లు గెలవడం గురించి చెప్పడం లేదని, తమిళనాడులో పాగా వేయడం గురించి మాట్లాడుతున్నట్లు వివరించారు.

గతేడాది టీవీకే నిర్వహించిన ర్యాలీలో సైతం విజయ్ పార్టీ గెలుపుపై ప్రశాంత్ కిశోర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన బిహారీ టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, సీఎస్కే ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ అని తెలిపారు. కానీ తాను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేను గెలిపిస్తే తమిళ గడ్డపై అత్యంత ప్రజాదరణ పొందిన బిహారీని తానే అవుతానన్నారు. టీవీకేని గెలిపించడానికే తాను తమిళనాడులో ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పీకే మాట్లాడిన ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.విజయ్ పార్టీ...టీవీకే తిరుగుండదని ప్రశాంత్‌కిశోర్‌ ఎప్పుడో చెప్పేశారు. అనేక సమావేశాల్లో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించారు. తనకు ఉన్న అవగాహన, సూచన, డేటా ప్రకారం విజయ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలుపునకు చాలా మంచి అవకాశం ఉందని వివరించారు. తాను సీట్లు గెలవడం గురించి చెప్పడం లేదు.

తమిళనాడులో టీవీకే గెలవడం గురించి చెబుతున్నాను. ఈ వీడియోను భద్రంగా ఉంచుకోండి. ఫలితాలు వచ్చినప్పుడు చూడండి. విజయ్ అవిశ్రాంతంగా ఎన్నికల కోసం శ్రమించాలి. ఒకవేళ అన్నాడీఎంకే- బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి, డీఎంకే కూటమి యథాతథంగా కొనసాగితే టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే విజయ్‌కు చాలా మంచి విజయకాశాలు ఉంటాయి. ఇది రాసిపెట్టుకోండి" అని పీకే వ్యాఖ్యానించారు. కాగా, తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే వందకు పైగా సీట్లలో ఆధిక్యాన్ని కనబర్చడంతో పీకే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏడాది క్రితమే విజయ్ గెలుపును పీకే అంచనా వేశారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించింది.

100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అధికార డీఎంకేను చావుదెబ్బ కొట్టింది. అన్నాడీఎంకే కూటమికి మరోసారి అధికారాన్ని అడియాసగానే మిగిల్చింది. టీవీకే దెబ్బకి ఏకంగా కోలత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ ఏకంగా ఓడిపోయారు. టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో స్టాలిన్ ఓటమిపాలయ్యారు. అంతలా ఎన్నికల్లో టీవీకే హవా కొనసాగింది. విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. అతి తక్కువ సమయంలోనే రాజకీయాల్లో అద్భుత ఫలితాన్ని సాధించారు విజయ్. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటారు. తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి గండి కొట్టారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

Published : 
  • 5 May 2026, 3:04 PM IST