అంతర్జాతీయ సరిహద్దుల్లో ఇప్పుడు ఒక నమ్మశక్యం కాని యుద్ధ వాతావరణం నెలకొంది. నిన్నటివరకు తీవ్రవాదాన్ని పెంచి పోషించి, ప్రపంచ దేశాలపైకి ఉసిగొల్పిన పాకిస్తాన్‌కు.. ఇప్పుడు సొంతంగా తనే పెంచి పోషించిన వాళ్ల చేతుల్లోనే చుక్కలు కనిపిస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం పాకిస్తాన్‌ను తాలిబాన్లు ఉచ్చపోయిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దళం పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లి మరి బాంబుల వర్షం కురిపించింది. పాక్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బ కొడుతూ తాలిబాన్ సైన్యం సరిహద్దు దాటి జరిపిన ఈ వైమానిక దాడులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు తాలిబాన్లు పాకిస్తాన్ లోపలికి వెళ్లి ఎందుకు దాడులు చేశారు? అక్కడ జరిగిన విధ్వంసం ఏంటి?
అసలు ఏం జరిగిందంటే.. పాకిస్తాన్ లోపల ఉన్న ఐసిస్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దళం ఈ ఆపరేషన్ చేపట్టింది. పాకిస్తాన్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన బలూచిస్తాన్, అలాగే ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సుల్లో ఈ దాడులు జరిగాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఐసిస్ ఉగ్రవాదులు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుని క్యాంపులు నడుపుతున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న తాలిబాన్ మిలిటరీ.. తమ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించింది. ఆ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి వాటిని పూర్తిగా నామరూపాలు లేకుండా ధ్వంసం చేసింది. ఈ హఠాత్ పరిణామానికి పాక్ సరిహద్దు రక్షణ దళాలు కనీసం ఎదురుదాడి చేసే అవకాశం కూడా దక్కలేదు.
అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే.. అసలు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పాకిస్తాన్ లోపలికి వచ్చి ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? దీనికి తాలిబాన్ ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ లోపల పెద్ద ఎత్తున పేలుళ్లు జరపడానికి, అమాయక ప్రజలను చంపడానికి ఐసిస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ వేదికగా స్కెచ్‌లు వేస్తున్నట్లు తమ ఇంటెలిజెన్స్‌కు పక్కా సమాచారం అందిందని తాలిబాన్ ప్రకటించింది. పాక్ భూభాగం నుండే ఆఫ్ఘన్లో అశాంతి సృష్టించడానికి ప్లాన్ రచిస్తున్నందునే.. సెల్ఫ్ డిఫెన్స్ కింద ముందస్తుగా తామే వెళ్లి ఆ స్థావరాలను లేపేశామని తాలిబాన్లు బహిరంగంగానే చెప్తున్నారు. అంటే పాక్ భూమిపై ఉగ్రవాదులు ఉంటే మేము చూస్తూ ఊరుకోం, లోపలికి వచ్చి మరీ కొడతాం అని తాలిబాన్లు పాకిస్తాన్‌కు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ దాడులతో పాకిస్తాన్ పరువు ప్రపంచ దేశాల ముందు పూర్తిగా గంగలో కలిసిపోయింది. ఎందుకంటే.. ఒకవైపు తమ దేశంలో అసలు ఐసిస్ స్థావరాలే లేవని పాక్ చెప్పుకుంటుంటే, తాలిబాన్లు మాత్రం ఆధారాలతో సహా వచ్చి బాంబులు వేసి వెళ్లారు. ఒకప్పుడు ఇదే తాలిబాన్లను ఉపయోగించి భారతదేశంపైకి, ఇతర దేశాలపైకి ఉగ్రవాదాన్ని నడిపించాలని పాకిస్తాన్ చూసింది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు.. ఇప్పుడు పాకిస్తాన్నే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద మూకల సంచారంతో పాక్ సరిహద్దులను తాలిబాన్ సైన్యం పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటోంది. తాలిబాన్ల వైమానిక దాడుల ధాటికి ఏం చేయాలో పాలుపోక పాక్ ఆర్మీ లబోదిబోమంటోంది. పెంచిన పామే ఇప్పుడు పాకిస్తాన్‌ను కాటేస్తోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాడు అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన పాకిస్తాన్‌కు.. నేడు తాలిబాన్ల రూపంలో అసలైన శాస్తి జరుగుతోంది.