Top story: 12 ఏళ్ళలో మోడీకి బిగ్గెస్ట్ షాక్ కాంగ్రెస్ వల్ల కాలేదు.. ‘కాక్రోచ్‌లు’ చేసి చూపించారు మోదీ ప్రభుత్వానికి ఎర్త్ పడినట్లేనా..?

భారత రాజకీయ చరిత్రలో నిన్న ఢిల్లీ వేదికగా ఒక నభూతో నభవిష్యతి అనే రేంజ్ అద్భుతం జరిగింది! గత 12 ఏళ్లుగా అప్రతిహతంగా దేశాన్ని ఏలుతున్న, తిరుగులేని శక్తిగా ఎదిగిన బిజెపి ప్రభుత్వానికి నిన్న ఎవరూ ఊహించని ఒక భారీ షాక్ తగిలింది.

Post Published By: dialnews
Updated : 22 July 2026, 4:50 PM IST

భారత రాజకీయ చరిత్రలో నిన్న ఢిల్లీ వేదికగా ఒక నభూతో నభవిష్యతి అనే రేంజ్ అద్భుతం జరిగింది! గత 12 ఏళ్లుగా అప్రతిహతంగా దేశాన్ని ఏలుతున్న, తిరుగులేని శక్తిగా ఎదిగిన బిజెపి ప్రభుత్వానికి నిన్న ఎవరూ ఊహించని ఒక భారీ షాక్ తగిలింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా వీధుల్లో పోరాడినా, పార్లమెంట్‌లో గర్జించినా చేయలేని పనిని... నిన్న కేవలం ‘కాక్రోచ్‌లు’ చేసి చూపించాయి. అవును, మీరు విన్నది నిజమే.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పిలుపునిచ్చిన ‘చలో పార్లమెంట్’ మార్చ్‌తో దేశ రాజధాని ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. వేలాది మంది యువత, విద్యార్థులు పార్లమెంట్‌ను ముట్టడించడానికి దూసుకురావడంతో బిజెపి ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అసలు ఏంటి ఈ కాక్రోచ్ పార్టీ? కాంగ్రెస్ కంటే పవర్‌ఫుల్‌గా వీరు బిజెపికి ఎలా ఎర్త్ పెట్టగలిగారు? ఈ వీడియోలో ఇన్-డెప్త్ అనాలిసిస్ చూద్దాం.

ముందుగా అసలు ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఎలా పుట్టిందో తెలుసుకుంటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది ఒక ఆన్‌లైన్ శటైర్ లేదా వ్యంగ్య ప్రచారంగా మొదలైంది. దేశంలో నిరుద్యోగం, వ్యవస్థలోని లోపాలపై పోరాడుతున్న యువతను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలను బేస్ చేసుకుని కొందరు ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ అని సంబోధిస్తే.. అభిజీత్ దిప్కే అనే 30 ఏళ్ల యువకుడు "దేశంలోని బొద్దింకలంతా ఏకమైతే ఎలా ఉంటుంది?" అంటూ సోషల్ మీడియాలో ఒక ఐడియా వదిలాడు. అంతే, అది కాస్తా దావానంలా వ్యాపించింది.

కేవలం రెండు వారాల్లోనే ఈ కాక్రోచ్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు ఏకంగా 22 మిలియన్ల (2.2 కోట్లు) ఫాలోవర్స్ వచ్చారు. ఇది స్వయంగా అధికార బిజెపి అధికారిక పేజీ ఫాలోవర్స్ కంటే రెట్టింపు! జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వం వీరి అకౌంట్‌ను బ్యాన్ చేయాలని చూసినా, "బొద్దింకలు అంత ఈజీగా చావవు" అంటూ సరికొత్త అకౌంట్‌తో యువత దూసుకువచ్చింది. శటైర్‌గా మొదలైన ఈ ఉద్యమం.. ఇప్పుడు బిజెపిని గద్దె దించేంత పవర్‌ఫుల్ పొలిటికల్ ఫోర్స్‌గా మారింది. నిన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే.. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ‘చలో పార్లమెంట్’కు పిలుపునిచ్చింది.

నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు, దేశంలో విద్యావ్యవస్థ పతనం, మరియు యువతలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నిరసిస్తూ... కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే సింగిల్ డిమాండ్‌తో వేలాది మంది జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా వీరికి మద్దతుగా 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండటం ఈ ఉద్యమానికి మరింత బలాన్ని ఇచ్చింది. నిన్నటి ర్యాలీ ఎంత ప్రభావం చూపిందంటే.. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఐదు కీలక మెట్రో స్టేషన్లను మూసివేసింది, మొబైల్ ఇంటర్నెట్‌ను కట్ చేసింది, 163 సెక్షన్‌ను విధించింది.

అయినా సరే యువత వెనక్కి తగ్గలేదు. బారికేడ్లను బద్దలు కొట్టుకుంటూ పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, వాటర్ కానన్స్ కొట్టడంతో నిన్న ఢిల్లీ వీధులన్నీ రణరంగంగా మారాయి. ఇక్కడ గమనించాల్సిన అతిపెద్ద పొలిటికల్ ట్విస్ట్ ఏంటంటే... గత 12 ఏళ్ల బిజెపి పాలనలో కాంగ్రెస్ ఎన్నో నిరసనలు చేసింది, కానీ దేనికీ బిజెపి లొంగలేదు సరే కదా.. వాటిని ‘రాజకీయ స్టంట్లు’ అని కొట్టిపారేసింది. కానీ నిన్న కాక్రోచ్ పార్టీ చేసిన నిరసనకు మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, నిరసనకారులు శాంతించాలని కోరుతూ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వయంగా కాక్రోచ్ పార్టీ ప్రతినిధులను తన నివాసానికి పిలిపించుకుని చర్చలు జరపాల్సి వచ్చింది.

ఎందుకంటే కాంగ్రెస్ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, కానీ ఈ కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది ఏ రాజకీయ జెండాలు లేని స్వచ్ఛమైన దేశ యువత. తమ భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్న జెన్-జెడ్ సైన్యం ఇది. అందుకే వీరు రోడ్డు మీదకు వస్తే ఏ ప్రభుత్వానికైనా పునాదులు కదలాల్సిందే. బాంగ్లాదేశ్, శ్రీలంకల్లో యువత తిరగబడితే ప్రభుత్వాలే కూలిపోయిన హిస్టరీ మన కళ్లముందే ఉంది, అందుకే బిజెపి ఈ ఉద్యమానికి వణికిపోతోంది. మొత్తానికి నిన్న ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ పార్టీ నిరసన బిజెపి ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ బెల్ లాంటిది. యువత తలుచుకుంటే ఏ తిరుగులేని అధికారాన్నైనా క్షణాల్లో కదిలించగలరని నిన్నటి సీన్ నిరూపించింది. కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు చేయలేని మైండ్ గేమ్, పబ్లిక్ ప్రెజర్‌ను ఈ కాక్రోచ్ పార్టీ కేవలం సోషల్ మీడియా పవర్ మరియు స్ట్రీట్ పవర్‌తో సాధించి చూపించింది. బిజెపి గ్రాఫ్‌కు నిజంగానే ఇక్కడ గట్టి ఎర్త్ పడినట్లే కనిపిస్తోంది.

Published : 
  • 22 July 2026, 4:50 PM IST