Top Story: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం…. విజయ్ దారిలోనే తారక్..!

ఏపీ రాజకీయాల్లో త్వరలోనే భూకంపం రాబోతుంది. పాలక ప్రతిపక్ష పార్టీల కు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో కొత్త సవాల్ ఎదురు కాబోతుంది. రాష్ట్ర రాజకీయ స్వరూపాన్ని సమూలంగా మార్చి వేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

Post Published By: dialnews
Updated : 14 July 2026, 1:50 PM IST

ఏపీ రాజకీయాల్లో త్వరలోనే భూకంపం రాబోతుంది. పాలక ప్రతిపక్ష పార్టీల కు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో కొత్త సవాల్ ఎదురు కాబోతుంది. రాష్ట్ర రాజకీయ స్వరూపాన్ని సమూలంగా మార్చి వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు మనవడు, తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ రంగ ప్రవేశానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాడు. అయితే అది తక్షణం ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయం కాకుండా 2034 లక్ష్యంగా జూనియర్ ఎన్టీఆర్ పావులు కదపబోతున్నాడు. దానికి తొలిమెట్టుగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తరహాలోనే సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమా లు మొదలుపెట్టబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం లోని ఒక బలమైన... చంద్రబాబు వ్యతిరేక గ్రూప్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు జూనియర్.

నందమూరి తారకరామారావు స్ఫూర్తితో రా ఎన్టీఆర్ అనే సంస్థ తరపున ఊరువాడ అనే కార్యక్రమాన్ని ఆయన అభిమానులు జులై 18న ప్రారంభించబోతున్నారు.100 కోట్ల రూపాయలతో రకరకాల సామాజిక కార్యక్రమాలు రా ఎన్టీఆర్ నిర్వహిస్తుంది. తద్వారా 20 34 లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి భూమికను సిద్ధం చేస్తున్నారు ఎన్టీఆర్. తమిళనాడు సీఎం విజయ్ తరహా లోనే కొన్నేళ్లపాటు సామాజిక కార్యక్రమాలు కొనసాగించి ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలన్నది జూనియర్ ప్లాన్.జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాల్సిందే. పెద్ద ఎన్టీఆర్ పోలికలతో ఉండే జూనియర్ నందమూరి ఫ్యామిలీలో నటుడిగా ఎవరికి అందనంత స్థాయికి చేరుకున్నాడు. 2024లో ఏర్పడిన కూటమి సర్కార్లో పవన్ కళ్యాణ్ హవా ఇప్పుడు క్రమంగా తగ్గుతుంది. ప్రధానమైన పోటీ వైసీపీ టీడీపీ మధ్య భవిష్యత్తులో ఉండబోతుంది. అయితే టిడిపి, కమ్మ సామాజిక వర్గంలో ఒక బలమైన వర్గం జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.

తాత వదిలిపెట్టిన స్థానం నీదేనని... ఎప్పటికైనా నువ్వు కైవసం చేసుకోవాలని జూనియర్ కు నూరిపోస్తుంది ఈ వర్గం. ఒక మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఓ మాజీ కేంద్రమంత్రి, ఓ పత్రిక ఎడిటర్ తో పాటు మరి కొందరు జూనియర్ ని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం జూనియర్ కి కష్టమే. తారక్ ఇంకా అగ్రస్థాయి స్టార్ నటుడు గానే ఉన్నారు. ఆయనకు చాలా అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఇప్పటికీ అగ్రస్థాయి నటుడు జూనియర్ ఎన్టీఆరే.2034 నాటికి చిన్న ఎన్టీఆర్ కి 51 సంవత్సరాలు నిండుతాయి. వయసు పరంగా కూడా అన్ని రకాలుగా రాజకీయ పదవులు అధిరోహించడానికి సరిపోతాడు.అందుకే 20 34 టార్గెట్ గా తారక అడుగులు వేస్తున్నాడు. టిడిపిలోనే ఉన్న స్లేపర్ సేల్స్, కమ్మ సామాజిక వర్గంలోని ఒక బలమైన గ్రూప్ తారక్ కి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి కసరత్తు చేస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి లోకి రావాలి, వస్తాడు అన్నది తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిలాష. టిడిపి వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ కి అసలు సిసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని అటు రాజకీయాల్లోనూ ఇటు జనంలోనూ ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న జూనియర్... కొన్నాళ్లు చంద్రబాబు బాలకృష్ణ కుటుంబాలకు దగ్గరగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత నందమూరి, నారా కుటుంబాలు ముందు జాగ్రత్తగా తారక్ ని కుటుంబం నుంచి కట్ చేశాయి. హరికృష్ణ రెండవ భార్య కుమారుడైన ఎన్టీఆర్ ని చాన్నాళ్లు నందమూరి ఫ్యామిలీ దగ్గరకు తీయలేదు. హీరోగా నిలబడి స్టార్ గా ఎదిగిన తర్వాత తారక్ ని కొన్నాళ్లపాటు కుటుంబంలో కలుపుకున్నారూ. 2009 ఎన్నికల్లో జూనియర్ టిడిపికి స్టార్ క్యాంపెనర్ గా ప్రచారం చేశాడు. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కోల్కున్నాడు కూడా.

ఆ తర్వాత క్రమంగా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ లతో విభేదాలు జూనియర్ ని నందమూరి కుటుంబానికి దూరం చేశాయి. మధ్యలో కమ్మ సామాజిక వర్గం ప్రముఖులు కొందరు జూనియర్ కి చంద్రబాబు కుటుంబానికి మధ్య రాజీ కుదరచాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తారక్ ఎప్పటికైనా తనకి ముప్పు అవుతాడని, అలాగే లోకేష్ రాజకీయ ఎదుగుదలకి అడ్డంకిగా మారతాడని.... రాజకీయ వారసత్వం అంటూ వస్తే... అది జూనియర్ ఎన్టీఆర్ కి దక్కుతుందని భయపడిన చంద్రబాబు తారక్ ని కుటుంబం నుంచి దూరంగా పెట్టారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణకు ప్రాధాన్యమిస్తూ... మూడుసార్లు ఎమ్మెల్యేనీ చేశారు. బాలయ్యతో వియ్యం అందుకున్నారు. తద్వారా నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ వైపు వెళ్లకుండా కట్టడి చేయగలిగారు. తారక్ పదేళ్లుగా పూర్తిగా నందమూరి కుటుంబానికి దూరంగా ఉన్నారు. జూనియర్ కి తన వ్యూహం తనకంటూ ఉంది. మొదట నటనపై దృష్టి పెట్టి.,! స్టార్ గా ఎదిగి, ఆర్థికంగా బలోపేతమై ఆ తర్వాతే రాజకీయాల వైపు దృష్టి సారించాలనుకున్నాడు. తెలుగుదేశం నుంచి జూనియర్ ఎన్టీఆర్ ని పూర్తిగా కట్ చేసిన.. కూడా ఎన్నడూ నోరు జారి విమర్శలు, అడ్డగోలు వ్యవహరించడం లాంటివి చేయకుండా.... కాస్త పరిణితిని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు తారకకి సన్నిహితులు. తారక్ తో సాన్నిహిత్యం వల్లే వాళ్ళిద్దరూ కూడా టిడిపి నుంచి బయటికి వచ్చి వైసీపీలో చేరాల్సి వచ్చింది. అయితే అప్పటి నుంచి తెలివిగా వాళ్ళిద్దరికీ కూడా సమాన దూరం పాటిస్తూ వచ్చాడు జూనియర్.భవిష్యత్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ అవసరాన్ని గుర్తించిన బిజెపి ఎప్పటినుంచో అతన్ని తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకానొక సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ తో స్వయంగా సమావేశం అయ్యారు. రాజకీయాల్లో చేరే విషయంపై అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ తేల్చి చెప్పలేదు. ఇప్పుడు ఇక సమయం దగ్గర పడిందని ఎన్టీఆర్ మనవడు గుర్తించినట్లు ఉన్నాడు. తారక్కి కొత్తగా ప్రచారం అక్కర్లేదు.

అయితే ఇక్కడ సమస్య అంతా... ఎన్టీఆర్ టిడిపిలో యాక్టివ్ అవుతారా...? లేక తెలుగుదేశం పేరు నే బ్రాండ్ గా తీసుకొని మరో టిడిపి పెడతారా? అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. 2029 ఎన్నికల్లో వైసిపి వర్సెస్ టిడిపి బేస్ గాని ఎన్నికలు జరుగుతాయి.2032లో.... ప్రత్యక్ష రాజకీయాలు ప్రారంభిస్తే 2034 సార్వత్రిక ఎన్నికల్లో 51 ఏళ్ల వయసులో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగలుగుతాడు. ఆయన ప్లాన్ కూడా ఇదే. దానికి బేస్ కోసం రా ఎన్టీఆర్ పేరుతో అయిదారేళ్ల పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, జనంలో తిరుగుతూ అనధికార రాజకీయాలు చేస్తాడు. తమిళనాడులో విజయ్ సక్సెస్ ఫార్ములాను జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2034లో ఏపీలో జగన్, లోకేష్ ,జూనియర్ ఎన్టీఆర్ పార్టీల మధ్య ట్రయాంగిల్ వార్ తప్పదు.

Published : 
  • 14 July 2026, 1:50 PM IST