ఈ ఏడాది జూన్ లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. రాజ్యసభ సీట్ల కోసం చాలామంది పోటీపడుతున్నప్పటికీ రకరకాల సమీకరణాలతో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. నలుగురిలో రెండు టీడీపీకి, ఒకటి జనసేన కి, ఒకటి బిజెపికి ఇవ్వబోతున్నారు. జనసేన నుంచి లింగం నేని రమేష్ కి ఖరారు అయిపోయింది. అలాగే టిడిపి నుంచి సానా సతీష్ కి మరోసారి రాజ్యసభ ఇవ్వబోతున్నారు. టిడిపి నుంచి మరో రాజ్యసభ సీటు కోసం రెడ్డివారి శ్రీనివాస్ రెడ్డి, వర్ల రామయ్య పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరికి రాజ్యసభ సీటు ఖరారు కానుంది. ఇక బిజెపికి ఇవ్వనున్న రాజ్యసభ సీటు పరిమల్ నత్వాని లేదా రిలయన్స్ ప్రసాద్ కు కేటాయిస్తారు. ఇద్దరూ ముఖేష్ అంబానీ కి అత్యంత సన్నిహితులు.
జనసేన తరపున రాజ్యసభ ఎంపీ కాబోతున్న లింగం నేని రమేష్ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు.
జనసేన ను.... పవన్ ను కొన్నేళ్లుగా ఆర్థికంగా ఆదుకుంటుంది లింగంనేనీ రమేష్. విజయవాడలో పవన్ ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని, అలాగే కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఉంటున్న ఇంటిని ఇచ్చింది కూడా లింగంనేనే. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, కోస్టల్ ఎయిర్లైన్స్ అధినేతగా పలు వ్యాపారాల్లో లింగంనేని రమేష్ రాణించాడు. లింగమనేనికి జనసేన తరపున రాజ్యసభ వస్తుందనేది అందరికీ తెలిసిందే.
ఇక రెండో రాజ్యసభ సీటు సానా సతీష్ కి మరోసారి ఇవ్వబోతున్నారు. సానా సతీష్ లోకేష్ కి అత్యంత సన్నిహితుడు. ఢిల్లీలో వ్యవహారాలన్నీ ప్రస్తుతానికి సతీష్ఏ చక్కబెడుతున్నాడు. గతంలో సిబిఐ డైరెక్టర్ కి రెండు కోట్లు లంచం ఇచ్చిన కేసులో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్ 2024 ఎన్నికల్లో టిడిపికి తెరవెనక పని చేశారు. అధికారంలోకి రాగానే మోపిదేవి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ సీట్ సానా సతీష్ కి ఇచ్చారు లోకేష్. జూన్ తో దాని కాలపరిమితి ముగుస్తుంది. అదే సీటు సానా సతీష్ కి కొనసాగించబోతున్నారు.టిడిపి వాటాకు వచ్చిన మరో రాజ్యసభ సీటు కోసం కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే రెడ్డి వారి మాధవి భర్త రెడ్డివారి శ్రీనివాస్ రెడ్డి పోటీ పడుతున్నాడు. అలాగే ఎస్సీ కోటలో వర్ల రామయ్య ఎప్పటినుంచో రాజ్యసభ సీటు అడుగుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఒకరికి రాజ్యసభ ఎంపీ సీటు ఇవ్వబోతున్నారు చంద్రబాబు.
ఇక బిజెపి కోటాలో ఈసారి రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎవరికీ రాజ్యసభ ఎంపీ దక్కే అవకాశం లేదు. గతంలో ప్రధాని మోడీ రికమండేషన్ పైఅంబానీ కి సన్నిహితుడైన పరిమల్ నత్వానికి జగన్ వైసీపీ తరఫున రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా బిజెపి ఆదేశంతో అంబానీకి మిత్రుడైన పరిమళనత్వానికి మళ్లీ రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. లేదా ముకేశ్ అంబానీ కి అత్యంత సన్నిహితుడైన రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఎం ఎస్ ప్రసాద్ కి రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. పీఎంఎస్ ప్రసాద్ నీ రిలయన్స్ ప్రసాద్ అని కూడా పిలుస్తారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద్ అంబానీకి రైట్ హ్యాండ్ లాంటివారు. చంద్రబాబు నాయుడు కి కూడా ఆయన అత్యంత సన్నిహితులు. బాబు పరిమళనత్వాని కంటే రిలయన్స్ ప్రసాద్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ ఈ సీట్ డిసైడ్ చేసేది మాత్రం ముకేశ్ అంబానీఏ.