Top story:వాట్ ది ఫక్, నెతన్యాహుపై ట్రంప్ సీరియస్… సీజ్ ఫైర్ కోసం అమెరికా ట్రయల్స్…!

ఇజ్రాయిల్ పై ఇరాన్ చేస్తున్న దాడులు అమెరికాకు ఆగ్రహం కలిగించాయా?? తాము ఊహించిన దాని కంటే ఇరాన్ రియాక్షన్ బలంగా ఉందని అమెరికా భయపడుతోందా??

Post Published By: dialnews
Updated : 10 March 2026, 3:10 PM IST

ఇజ్రాయిల్ పై ఇరాన్ చేస్తున్న దాడులు అమెరికాకు ఆగ్రహం కలిగించాయా?? తాము ఊహించిన దాని కంటే ఇరాన్ రియాక్షన్ బలంగా ఉందని అమెరికా భయపడుతోందా?? కాల్పుల విరమణ కోసం వైట్ హౌస్ ప్రయత్నాలు చేస్తోందా?? ఇజ్రాయిల్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సీరియస్ గా ఉన్నాడా?? అంటే అవుననే అంటుంది ఇంటర్నేషనల్ మీడియా. ఇస్లామిక్ రిపబ్లిక్ ను తక్కువ అంచనా వేసి, స్టార్ట్ చేసిన వార్ కు అమెరికా కుదేలు అయిపోతోంది. ఆయుధాలు, ఆర్ధిక వనరులపై భారీ దెబ్బ పడుతోంది.

ఇంత చేసినా ఇరాన్ ఎందుకు దారిలోకి రావడం లేదో ట్రంప్ కు అర్ధం కావడం లేదు. సుప్రీం లీడర్ ను చంపేస్తే, అగ్ర నాయకత్వాన్ని లేపేస్తే, తమ మాట ఇరాన్ వింటుందని ట్రంప్ వేసుకున్న లెక్కలు అన్నీ గాలి లెక్కలు అని తెలిపోయినట్లే కనపడుతోంది. సుప్రీం లీడర్ లేకపోయినా ఇరాన్ ఒకటే మాట మీద నడుస్తోంది. బలమైన ఆయుధ వనరులు, ఆర్మీ ఉన్న ఇరాన్ గల్ఫ్ దేశాలకు సారీ చెప్పినట్లే చెప్పి, దాడులు కంటిన్యూ చేస్తుంది. ఎప్పుడు, ఏ అస్త్రం వాడుతుందో ఇజ్రాయిల్ గానీ, అమెరికా గానీ అర్ధం చేసుకోలేకపోతున్నాయి.

ఇప్పుడు ఫైనల్ గా అమెరికా “వాట్ ది ఫక్” అంటూ ఇజ్రాయిల్ పై ఊగిపోయిన సిచ్యువేషన్ కనపడుతోంది. రీసెంట్ గా ఇరాన్ లోనని 30 ఆయిల్ డిపోలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఈ దాడుల సమాచారాన్ని అమెరికాకు ఇచ్చింది ఇజ్రాయిల్. ఆ విషయం విని, ఆ వీడియోలు చూసిన వెంటనే, అమెరికా వైట్ హౌస్ అధికారులు ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు మిమ్మల్ని ఎవరు ఆ స్థాయిలో దాడి చేయమన్నారని, వాట్ ది ఫక్ అంటూ ఊగిపోయారని ఈ విషయాలను గమనిస్తున్న మీడియా వెల్లడించింది.

అసలు ఈ అటాక్ తమ ప్రెసిడెంట్ ట్రంప్ కు ఇష్టం లేదని, ట్రంప్ సలహాదారు ఒకరు మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేసారు. దాడులు చేసే ముందు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్, అమెరికా సైన్యానికి సమాచారం అందించిందని ఇజ్రాయెల్, అమెరికా అధికారులు తెలిపారు. కానీ దాడుల తీవ్రత చూసి, వాషింగ్టన్ ఆశ్చర్యపోయిందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. మీ టార్గెట్ కరెక్ట్ కాదని, ఆ దృశ్యాలు చూస్తే ఆయిల్ మార్కెట్ లో ధరలు మండిపోతాయని, ఆ ప్రభావం అమెరికాపై తీవ్రంగా పడుతుందని వైట్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అధ్యక్షుడికి ఈ దాడి ఇష్టం లేదని.. ట్రంప్ చమురును ఆదా చేయాలనే ప్లాన్ లో ఉన్నారని, అలాంటిది కాల్చడం అసలు ఇష్టం లేదని అమెరికన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీని కారణంగా గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే భయం ట్రంప్ లో ఉందని ఆ అధికారి వెల్లడించారు. ఇరాన్ అలాంటి ప్లాంట్లపై దాడి చేయడం మొదలుపెడితే మాత్రం, ప్రపంచ వ్యాప్తంగా.. చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్లు (అంటే మన కరెన్సీలో 18,461 రూపాయలు) వరకు పెరిగే అవకాశం ఉందని ఆ అధికారి వార్నింగ్ ఇచ్చారట. ఈ దాడుల తర్వాతనే ఆయిల్ ధరలు భారీగా పెరిగాయనే కోపం కూడా ట్రంప్ లో ఉందట. అందుకే యుద్దాన్ని ఆపడానికి అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది.

Published : 
  • 10 March 2026, 3:10 PM IST