తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ సృష్టించిన సునామీ ఇప్పట్లో ఆగేలా లేదు. తాను పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్.. ఈ రెండు చోట్లా విజయకేతనం ఎగురవేసి, అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు విజయ్. అయితే, ఇక్కడే అసలైన పొలిటికల్ గేమ్ మొదలైంది. రెండు చోట్లా గెలిచిన విజయ్, ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఖాళీ అయ్యే సీటులో కూర్చునే ఆ ‘పవర్ ఫుల్’ లీడర్ ఎవరు..? ఇప్పుడు తమిళనాడు అంతా వినిపిస్తున్న పేరు.. నటి త్రిష.విజయ్ ఖాళీ చేసే స్థానంలో త్రిష పోటీ చేస్తారనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోట వరకు మార్మోగిపోతున్నాయి. ఇది కేవలం గాలి వార్త కాదని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పార్టీ టిక్కెట్ల కేటాయింపు సమయంలో టీవీకే సీనియర్ నేతలు త్రిష నివాసం వద్ద క్యూ కట్టిన దృశ్యాలు అందరం చూశాం. అభ్యర్థుల ఎంపికలో, పార్టీ వ్యూహాల్లో ఆమె కీలక పాత్ర పోషించారని, విజయ్‌కు అత్యంత నమ్మకస్తురాలిగా పేరు తెచ్చుకున్నారని సమాచారం. అందుకే, విజయ్ వారసురాలిగా ఉప ఎన్నిక బరిలో త్రిషను దించడం ద్వారా మహిళా ఓటర్లను, యువతను శాశ్వతంగా పార్టీ వైపు తిప్పుకోవాలని దళపతి ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు, విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో తలపండిన ఆయన, అసెంబ్లీలో విజయ్‌కు అండగా ఉంటారని కొందరు భావిస్తున్నారు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ‘గ్లామర్ ప్లస్ పవర్’ కలగలిసిన త్రిష వైపే విజయ్ మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. గతంలో ఎంజీఆర్ పక్కన జయలలిత ఎలాగైతే ఒక శక్తిగా ఎదిగారో.. ఇప్పుడు విజయ్ పక్కన త్రిషను అలాగే ప్రెజెంట్ చేయడం ద్వారా ఒక కొత్త పొలిటికల్ బ్రాండ్‌ను సృష్టించాలని టీవీకే భావిస్తోంది.
అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాసింది. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే.. త్రిషకు తన మంత్రివర్గంలో అత్యంత కీలకమైన హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. విద్యావంతురాలు, క్రమశిక్షణ గల వ్యక్తిగా పేరున్న త్రిష.. జయలలిత గారి ‘అమ్మ’ ఇమేజ్ను అందిపుచ్చుకోగలరని అభిమానులు ఆశిస్తున్నారు. దళపతి గెలుపు ఒక సంచలనం అయితే.. త్రిష రాజకీయ అరంగేట్రం మరో సంచలనం కాబోతోంది. మరి విజయ్ త్రిషకు పట్టాభిషేకం చేస్తారా..? లేక తన తండ్రికి అవకాశం ఇస్తారా..? అనేది చూడాలి.