భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు… సూపర్-8కు టీమిండియా…!

కొలంబోలో శివరాత్రి రోజు టీమిండియానే పైచేయి సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది.

Post Published By: dialnews
Updated : 16 February 2026, 8:15 PM IST

కొలంబోలో శివరాత్రి రోజు టీమిండియానే పైచేయి సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో ఊహించినట్టుగానే భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ జట్టులోకి తిరిగి రాగా.. అర్షదీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కింది. కొలంబో స్లో పిచ్ కావడంతో స్పిన్ వ్యూహంతోనే ఇరు జట్లు బరిలోకి దిగాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. అయితే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టారు. రెండో వికెట్ కు 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

స్పిన్ తో అతన్ని కట్టడి చేద్దామనుకున్న పాక్ ఆశలు నెరవేరలేదు. విధ్వంసకర బ్యాటింగ్ ఆడిన ఇషాన్ కిషన్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరింత వేగంగా ఆడే ప్రయత్నంలో ఇషాన్ కి,న్ (77) పరుగులకు ఔటయ్యాడు.అతవి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ మూడో వికెట్ కు 38 పరుగులు జోడించారు. తిలక్ వర్మ ఔటయ్యాక.. శివమ్ దూబేతో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 38 పరుగులు జోడించారు. అయితే చివర్లో పాక్ బౌలర్లు పుంజుకోవడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా డకౌటయ్యాడు. చివరికి భారత్ 20 ఓవర్లలో 17 వికెట్లకు 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో సయీమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు.తర్వాత ఛేజింగ్ లో పాకిస్థాన్ ఆరంభం నుంచే చేతులెత్తేసింది. తొలి ఓవర్లోనే హార్థిక్ పాండ్యా ఫర్హాన్ ను డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. విశేషమేమిటంటే తొలి నలుగురు బ్యాటర్లు కూడా సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. ముఖ్యంగా బుమ్రా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడంతో పాక్ మళ్లీ కోలుకోలేకపోయింది.

సయీమ్ అయూబ్ సల్మాన్ అఘా, బాబర్ అజామ్ నిరాశపరిచారు. తర్వాత ఉస్మాన్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. బాబర్ అజామ్ తో కలిసి 21, షాదాబ్ ఖాన్ తో కలిసి 39 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే భారత బౌలర్లు పాక్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే ఉన్నారు. దీంతో సగం ఓవర్లకే పాక్ ఓటమి ఖాయమైపోయింది. టెయిలెండర్లు కాసేపు క్రీజులో నిలవడంతో భారత్ విజయం ఆలస్యమైంది. ఈ టోర్నీలో మూడో విజయం అందుకున్న టీమిండియా సూపర్-8 బెర్త్ ఖాయం చేసుకుంది. తర్వాతి మ్యాచ్ లో భారత్ బుధవారం నెదర్లాండ్స్ తో తలపడుతుంది.

Published : 
  • 16 February 2026, 8:15 PM IST