అతనో బిగ్ మ్యాచ్ విన్నర్, తెలుగోడిపై రోహిత్ శర్మ ప్రశంసలు…!

టీ20 వరల్డ్ కప్ కు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2026 | 09:31 PMLast Updated on: Jan 28, 2026 | 9:31 PM

Rohit Sharma Praises The Telugu Man

టీ20 వరల్డ్ కప్ కు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ నెలకొంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నీ ఇండియాలోనే జరుగుతుండడంతో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టైటిల్ నిలబెట్టుకుంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు జట్టు సూర్య కెప్టెన్సీలోని టీమిండియా సూపర్ ఫామ్ లో ఉండడంతో అంచనాలు పెరిగిపోయాయి. జట్టు అత్యంత పటిష్టంగా ఉండడంతో పాటు గత రెండేళ్లలో తిరుగులేని విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తుంది.

ఇండియాలో మ్యాచ్ విన్నర్లకు కొదువ లేదు. ఎవరికీ వారే తమదైన రోజున మ్యాచ్ ను టర్న్ చేయగలరు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ భారీ ఇన్నింగ్స్ లు ఆడగలరు. సూర్య ఎలాంటి ఆటగాడో ఇప్పటికే నిరూపించుకున్నాడు. స్వదేశంలో తిప్పేయడానికి స్పిన్నర్లు సై అంటున్నారు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే నిలకడగా రాణిస్తున్నారు. భారత జట్టులో ఎంతమంది మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ వరల్డ్ కప్ ముందు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ ను సూచించాడు.

తిలక్ ను బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా పేర్కొన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఆదుకున్నాడనీ, మొదటసారి తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ సెటప్ లో అడుగుపెట్టినప్పుడు అతనిలో ఏదో ఉందని తాను గుర్తించాననీ చెప్పుకొచ్చాడు. తనతో మాట్లాడినప్పుడల్లా తిలక్ తనకు ఛాన్స్ ఇవ్వమని.. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపితే తాను నిరూపించుకుంటానని చెప్పేవాడనీ గుర్తు చేసుకున్నాడు. ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒత్తిడి తట్టుకొని రాణించాడనీ తిలక్ పై రోహిత్ ప్రశంసలు కురిపించాడు.
ఇదిలా ఉంటే తిలక్ వర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సాధించలేదు. ఇప్పటికే న్యూజిలాండ్ తో తొలి మూడు టీ20 మ్యాచ్ లకు దూరమైన తిలక్ వర్మ చివరి రెండు టీ20లకు అందుబాటులో ఉండడం లేదు.