TELANGANA CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా తాజాగా విడుదలైంది. శుక్రవారం సాయంత్రం ఈ జాబితాను తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసింది. రెండో జాబితాలో కొన్ని పేర్లు సంచలనంగా నిలిచాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్‌ను దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఆశించాడు. అయితే, అనూహ్యంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు టిక్కెట్ కేటాయించింది అధిష్టానం.
గెలుపు గుర్రాలకే టికెట్లు అనే లక్ష్యంతో అడుగులు వేసిన కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికలోనూ అదే నియమాన్ని గట్టిగా పాటించినట్లు అర్థం అవుతోంది. అలాగే ప్రజా గాయకుడు గద్దర్ కూతురుకు టిక్కెట్ దక్కింది. గద్దర్ కూతురు వెన్నెల మొదటిసారిగా కంటోన్మెంట్ నుంచి పోటీ చేయబోతుంది. అలాగే ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా టిక్కెట్ కేటాయించింది. మునుగోడు స్థానాన్ని కోమటిరెడ్డికి కేటాయించింది. ఎల్బీనగర్ నుంచి మధుయాష్కీ గౌడ్‌కు టిక్కెట్ దక్కింది. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆమెకు స్థానం దక్కలేదు. అక్కడ వెడ్మ బొజ్జుకు టిక్కెట్ దక్కింది. అయితే, ఆమె భర్త అజ్మీరా శ్యామ్ నాయక్‌కు ఆసిఫాబాద్ టిక్కెట్ ఇచ్చింది.
తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇది. సిర్పూర్ కాగజ్‌నగర్ - రావి శ్రీనివాస్, ఆసిఫాబాద్- అజ్మీరా శ్యామ్, ఖానాపూర్ - వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి, బోధ్ - అశోక్, ముధోల్ - నారాయణరావు పాటిల్, ఎల్లారెడ్డి - మదన్ మోహన్ రావు, నిజామాబాద్ రూరల్ - భూపతి రెడ్డి, కోరుట్ల - జువ్వాడి నర్సింగ రావు, చొప్పదండి - మేడిపల్లి సత్యం, హుజురాబాద్ - వొడితల ప్రణవ్, హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్, సిద్ధిపేట - పూజల హరికృష్ణ, నర్సాపూర్ - ఆవుల రాజిరెడ్డి, దుబ్బాక - చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కూకట్పల్లి - బండి రమేష్, ఇబ్రహీంపట్నం - మల్రెడ్డి రంగారెడ్డి, ఎల్బీనగర్ - మధు యాష్కీ గౌడ్, మహేశ్వరం - కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రాజేంద్రనగర్ - కస్తూరి నరేందర్, శేరిలింగంపల్లి - జగదీష్ గౌడ్, తాండూరు - బీ. మనోహర్ రెడ్డి, అంబర్పేట్ - రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ - విజయారెడ్డి, జూబ్లీహిల్స్ - అజారుద్దీన్, కంటోన్మెంట్ (ఎస్సీ) - డా.జి.వి.వెన్నెల (గద్దర్ కూతురు), నారాయణపేట్ - పర్ణిక చిట్టెం రెడ్డి, మహబూబ్‌నగర్ - యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల - అనిరుధ్ రెడ్డి, దేవరకద్ర - మధుసూధన్ రెడ్డి, మక్తల్ - వాకిటి శ్రీహరి, వనపర్తి - చిన్నా రెడ్డి, దేవరకొండ - బాలూ నాయక్, మునుగోడు - రాజగోపాల్ రెడ్డి, భువనగిరి - కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జనగాం - కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పాలకుర్తి - యశస్వినీ మామిడిల్లా, మహబూబాబాద్ - మురళీ నాయక్, పరకాల - రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ వెస్ట్ - నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ, వర్ధన్నపేట - కేఆర్ నాగరాజు, పినపాక - పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.