తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇద్దరే మోస్ట్ డిమాండ్ డ్ పొలిటీషియన్స్. ఒకరు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. రెండో వ్యక్తి బి ఆర్ ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.2029లో తెలంగాణ రాజకీయాల్ని, తెలంగాణ సీఎం పొజిషన్ ని నిర్ణయించేది ఈ ఇద్దరు నేతలే. వీళ్లు ఇద్దరిలో ఒకరు కచ్చితంగా సీఎం కావడం ఖాయం. ఈ సమీకరణాలు ఏంటో చాలామందికి అర్థం కాకపోవచ్చు.కానీ బిజెపి వేస్తున్న ఎత్తుగడలు, అధికారం కోసం ఆ పార్టీ హై కమాండ్ సిద్ధం చేస్తున్న భయంకరమైన ప్లాన్ ......,వర్కౌట్ అయితే రేవంత్ రెండోసారి సీఎం అవుతారు లేదా హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారు.తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లు బిఆర్ఎస్ పాలించింది. అవినీతి, అహంకారం ఆ పార్టీని ఓడించాయి.2023 నుంచి ఐదేళ్లపాటు కాంగ్రెస్ కి అధికారం దక్కింది. కానీ అవినీతి అంతర్గత కు మ్ములాటలతో ఆ పార్టీ కూడా వచ్చే ఎలక్షన్లో ఓటమి చవిచూడడం ఖాయమని జనమే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డికి ఇమేజ్ సరిపోవటం లేదు. నేతలు ఎవరు ఆయనకి కలిసి రావటం లేదు. దీంతోపాటు మీడియా సపోర్ట్ కూడా పెద్దగా లేకపోవడంతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం కష్టమేనని తెలంగాణలో అందరు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బిజెపికి ఓటు వేయాలని జనం అనుకున్న.... ఆ పార్టీకి క్యాడర్ లేదు, లీడర్ లేడు. ఉన్నదల్లా మోడీ బొమ్మ ఒకటి మాత్రమే. ఆ మోడీ బొమ్మకి కూడా క్రమంగా ఆదరణ తగ్గిపోతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వీళ్ళందరూ తెలంగాణ బిజెపిని పరుగులెట్టించే పరిస్థితిలో లేరు .అంత శక్తిమంతులు కూడా కాదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో కానీ, అపోజిషన్ లో ఉన్న టిఆర్ఎస్ తో కానీ, యుద్ధం చేసే నాయకుడు తెలంగాణ బిజెపిలో ఒక్కడు లేడు.2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కేవలం మోడీ బొమ్మ చూపించి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచింది బిజెపి. అందుకే స్థానిక నేతలను నమ్ముకోవడం అనవసరం, ఉన్న రెండేళ్ల కాలంలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధం చేసేటంత సీన్ తెలంగాణ బిజెపి నాయకులకు లేదు అని బిజెపి హైకమాండ్ ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసింది.2029 లో తెలంగాణ నీ కైవసం చేసుకునే కసరత్తు లో రకరకాల వ్యూహాలు అమలు చేస్తుంది.
ఏపీలో వర్కౌట్ అయిన ఎన్డీఏ కూటమి ఫార్ములాని తెలంగాణలో వాడదాం అనుకుంది. శాంపిల్ గా పవన్ కళ్యాణ్ నీ పంపించింది. తెలంగాణ వాదుల్లో, జనంలో వచ్చిన వ్యతిరేకత చూసి తక్షణమే ఆ ప్రయత్నం విరమించుకుంది. అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో ఒంటరిగానే వెళ్తామని ప్రకటించేశారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి 30 నుంచి 35 అసెంబ్లీ సీట్లు గెలవగలిగితే.... కాంగ్రెస్‌నీ చీల్చి సీఎం రేవంత్ రెడ్డిని ఒక వర్గంగా బయటికి తీసుకొచ్చి ఆయనని ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వం స్థాపించాలనేది ఒక వ్యూహం. అది వర్కౌట్ కాకపోతే బి ఆర్ ఎస్ ను చీల్చి హరీష్ రావు నాయకత్వంలో ఒక వర్గాన్ని బయటకు తీసుకొచ్చి ఆ వర్గాన్ని కలుపుకొని హరీష్ రావు ముఖ్యమంత్రిగా బిజెపి ప్రభుత్వాన్ని స్థాపించడం మరో వ్యూహం. అప్పటి పరిస్థితులను బట్టి ఈ రెండు వ్యూహాల్లో ఏదో ఒకటి అమలు చేస్తుంది బిజెపి హై కమాండ్. బిజెపిఇతర, ఆర్ఎస్ఎస్ఏతర..... నాయకులకు బిజెపిలో ఆశ్రయం కల్పించడమే కాదు వాళ్లని ముఖ్యమంత్రులుగా కూడా చేస్తున్నారు.
ఈ కోటాలో అస్సాం కి హేమంత్ విశ్వాస్, పశ్చిమ బెంగాల్ కి సువెందు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. స్థానిక నేతలను నమ్ముకుని తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యమని బిజెపి హైకమాండ్ పూర్తి క్లారిటీతో ఉంది. ఇప్పటికిప్పుడు పార్టీ నేతలను ఎంత పరుగులు పెట్టించిన బిజెపి ఇమేజ్ పెరగదు అనేది పార్టీ అగ్ర నాయకుల ఆలోచన. అందుకే కింద మీద పడి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో 35 నుంచి 40 సీట్లు సాధించగలిగితే..... కాంగ్రెస్ నీ గాని, బిఆర్ఎస్ నీ కానీ చీల్చి ఆ చీలిక వర్గంతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది బిజెపి పక్కా వ్యూహం. అధికారం కోసం దేనికైనా... ఎంతకైనా తెగించాలనే ఫార్ములా ఇప్పటికే చాలాసార్లు ప్రయోగించి సక్సెస్ అయింది బిజెపి. నిన్న కాక మొన్న తృణమూల్ నుంచి 20 మంది ఎంపీలను చీల్చి, ఊరు పేరు లేని పార్టీలో విలీనం చేసి .... తమ కంట్రోల్లో పెట్టుకుంది బిజెపి హై కమాండ్. ఇలాంటి అడ్డగోలు ఫార్ములాలే 2029 లోను తెలంగాణలో ప్రయోగించబోతోంది.
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని నాతో కలవచ్చు కదా... అం సే హాత్ జూడో అని తెలివిగా సిగ్నల్ ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డికి 2029లో బిజెపి తలుపులు తెరిచి ఉంచుతుందని చెప్పకనే చెప్పారు. పార్టీకి పనికిరాని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ కంటే.... దూకుడుగా దూసుకెళ్లే రేవంత్ లాంటి నాయకుడు బిజెపికి అవసరమని మోడీకి క్లారిటీ ఉంది. అందుకే ఓ కర్చీఫ్ వేసి పెట్టి ఉంచారు. లోపాయికారిగా రేవంత్ మోడీతో టచ్ లో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో గాసిప్స్ నడుస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ లో పుట్టి.... వరుసగా పార్టీలు మార్చుకుంటూ కాంగ్రెస్ తీరం చేరిన రేవంత్ రేపు 2029లో అనూహ్యంగా బిజెపి వైపు వెళ్లిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ లో పుట్టి, కాంగ్రెస్‌లో పెరిగినట్లు పెద్ద పెద్ద మాటలు చెబుతున్న రేవంత్.... అవసరం వస్తే ఎలాంటి సంచల నిర్ణయాలైన తీసుకోగలుగుతారు.29లో బిజెపికి ఓ పాతికమంది ఎమ్మెల్యేల సహకారం కావాలంటే రేవంత్ మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళని కాంగ్రెస్ నుంచి తీసుకొని రాగలుగుతారు. బహుశా అందుకేనేమో రేవంత్ 2034 వరకు నేనే సీఎం గా ఉంటాను అని పదే పదే చెబుతూ ఉంటారు.
ఇక బి ఆర్ ఎస్ అగ్రనేత హరీష్ రావు బిజెపితో ఎప్పటినుంచో టచ్ లో ఉన్నారు. కెసిఆర్ బతికి ఉండగా, కేటీఆర్ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండగా హరీష్ రావు అనే వ్యక్తి బి ఆర్ఎస్ తరఫున ఎప్పటికీ తెలంగాణకి సీఎం కాలేడు. నిజానికి ప్రజలతో, నేతలతో నిత్యం సంబంధ బాంధవ్యాలు మైంటైన్ చేసే హరీష్ రావు కి సబ్జెక్టు పై కూడా పట్టు ఎక్కువ. పార్టీలో లో ఎవరు, ఎంత, ఎన్ని రకాలుగా అవమానించిన.... తన పని మాత్రం ఆపరాయిన. నిత్యం ఏదో ఒక విషయంపై మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. అంతేకాదు ఆర్థికంగా కూడా చాలా బలమైన స్థితిలో ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ పారిశ్రామికవేత్తలు అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. మీడియాలో కూడా ఒక వర్గం మద్దతు హరీష్ రావుకి బలంగా ఉంది. ముఖ్యమంత్రిగా కేటీఆర్ కంటే హరీష్ రావు ని ఎక్కువమంది ఆమోదిస్తారు కూడా. అందుకే హరీష్ రావు ఏదో ఒక రోజు తనకు చేయి ఇవ్వచ్చు అనే అనుమానం కెసిఆర్ లో ఎప్పటినుంచో ఉంది.
2029లో తెలంగాణలో హంగ ఏర్పడితే హరీష్ రావు సారధ్యంలో పాతిక 30 మంది బి ఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక బిజెపితో చేయి కలిపితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. అందుకే హరీష్ ని కూడా బిజెపి తన ట్రంప్ కార్డుగా పక్కన పెట్టుకుంది.2029 లో తెలంగాణను ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి కైవసం చేసుకోవడం సాధ్యం కాదు కనుక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి హరీష్ లేదా కాంగ్రెస్ నుంచి రేవంత్ లో ఒకరిని ట్రంప్ కార్డుగా వాడి అధికారాన్ని కైవసం చేసుకోవడమే వ్యూహంగా పెట్టుకుంది బిజెపి. అందుకే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది. కింద మీద పడి 30 నుంచి 35 సీట్లు వరకు గెలవగలుగుతుంది. ఆ తర్వాత ఆట మొదలుపెట్టి బి ఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ను చీల్చి తిరుగుబాటు వర్గంతో కలిసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది అంచనాలకు మించిన వ్యూహమే కావచ్చు. కానీ బిజెపి హై కమాండ్ స్టెప్స్ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ల ప్లాన్ ఇదేనని అర్థమవుతుంది. బహుశా అందుకేనేమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కంటే హరీష్ రావు ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు.2029 లో తన సీఎం పదవికి హరీష్ రావే అడ్డంకి అని రేవంత్ భావిస్తున్నట్లు ఉన్నది.