సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద చిన్న స్టేట్ మెంట్ రాంగ్ గా ఎవరు ఇచ్చినా, వాళ్లకి సూపర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా ఇచ్చిపడేస్తారు. గతంలో ఓ తమిళ స్టాండప్ కమేడియన్ ఇలానే ఓవరాక్షన్ చేస్తే, సోషల్ మీడియాలో చుక్కలు చూపించారు మహేశ్ బాబు ఫ్యాన్స్.. ఇలా చాలా మందికి అయ్యింది.. కాబట్టే సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో ఎవరూ పెట్టుకోరు. అలాంటిది ఏకంగా వారణాసి మీదే పంచులేసి పెద్ద తేనె తుట్టనే కదిపాడో దర్శకుడు.. తనే కాదు, తన మొత్తం సినిమా టీం భారీ వివాదానికి వెల్ కమ్ చెప్పింది. కోరి కొరివితో తలగోక్కునే పిచ్చి ప్రయత్నం చేసింది. గ్లింప్స్ తప్ప ఇంకా టీజర్ కూడా రాని, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీద అప్పుడే కామెంట్లు, ట్రోలింగ్స్ అది కూడా సినిమాలో చేశారా? అసందర్భంగా అకారణంగా వారణాసి మూవీని ఎవరు టార్గెట్ చేశారు? ఎందుకు టార్గెట్ చేశారు? ఫ్యాన్స్ వార్ పరిస్థితేంటి?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో రాజమౌలి తీస్తున్న మూవీ వారణాసి. కేవలం ఈ మూవీ ఎలా ఉంటుందనటానికి ఫిల్మ్ టీం వదిలిన కాన్సెప్ట్ గ్లింప్స్ మాత్రంమే అందరికి తెలుసు. అది తప్ప టీజర్ కాని, ట్రైలర్ కాని రాలేదు. ఆ కాన్సెప్ట్ వీడియోలో కూడా క్రిస్తు పూర్వం, త్రేతా యుగం, టైం ట్రావెల్, రామాయణ ఘట్టం లాంటివి ఉన్నట్టు కనిపించింది..అంతేకాని, అసలు కథేంటి, హీరో ఏం చేస్తాడు ఇవేవి తెలిసేందుకు ట్రైలర్ రాలేదు. కాబట్టి పుస్తకం చదవకముందే అది బాలేదన్నట్టు, వారణాసి మీద కామెంట్స్ చేసే సాహసం ఎవరూ చేయరు.. విచిత్రం ఏంటంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎవరూ అంత ఈజీగా కెలికిన సందర్భాలు తక్కువే.. అలా చేస్తే వాళ్ల ట్రోలింగ్ దాడి ఎలా ఉంటుందో, తమిళ స్టాండప్ కమేడియన్లకు బాగా తెలుసు.అలాంటిది ఏకంగా విశ్వక్ సేన్ సినిమా ఇప్పుడు వారణాసిని టార్గెట్ చేసినట్టు, ట్రోల్ చేసి కించపరుస్తున్నట్టు ప్రాచరం జరుగతోంది. కారణం ఫంకీ మూవీలో ఉన్న సీన్... విచిత్రం ఏంటంటే ఫంకీ మూవీకి పబ్లిక్ టాక్ వీకౌైంది. రివ్యూలు కూడా నెగెటివ్ గానే వస్తున్నాయి.. మ్యాటర్ లేని మూవీలో కొన్ని కామెడీ పంచ్ డైలాగ్స్ తప్ప, ఇంకేం లేదని రివ్యూల్లానే, పబ్లిక్ టాక్ షాక్ ఇస్తోంది.కాబట్టి రివ్యూల కంటే, సినిమాలో కంటెంట్ కంటే, ఇప్పుడు వారణాసిని తక్కువ చేసేలా పెట్టిన సీన్ వల్లే వివాదం పెరుగుతోంది.
ఆ వివాదమే ఫంకీ సౌండ్ కి, వరల్డ్ వైడ్ గా రీసౌండ్ వచ్చేలా చేస్తోంది. లేదంటే కథ ఉందా లేదా అన్నట్టున్న సినిమాలో, కామెడీ సీన్లతో నింపేస్తే, అన్నీ జాతిరత్నాలు కావనే రివ్యూలు షాక్ ఇస్తున్నాయి.. డైరెక్టర్ అవ్వాలనుకునే హీరో, ప్రొడ్యూసర్ కూతురితో ప్రేమల పడతాడు..ఇంతకి సినిమా తీస్తాడా? రిలీజ్ అవుతుందా అనేకంటే, హీరో పాత్రలో డైరెక్టర్ గా ఏం కథ రాసుకున్నాడో కాని, అనుధీప్ మాత్రం పంచ్ డైలాగ్స్ తో చుట్టేసిన చుట్టలాంటి సినిమా రెడీ చేశాడనే అంటున్నారు. పాటల్లో రామ్ మిరియాల సాంగ్ తప్ప మరేది పేలలేదు. ఆర్ ఆర్ లో దమ్ములేదు... హీరో పాత్రలో క్లారిటీ లేదు.. హీరోయిన్ ఒక పాటలో చేసిన డాన్స్ కి విలువ లేదు..అన్నీంటికి మించి ఘోరం అనలేం కాని, జాతి రత్నాలు వర్కవుట్ అయ్యిందని, అన్నీ అలాంటి వీక్ కథలతో కామెడీ చేస్తే ట్రాజడీనే మిగులుతుంది. మొత్తానికి కామెడీ కిక్ ఇచ్చే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఏదేమైనా, హిట్ టాక్ తో జనాల్లోకెళ్లాల్సిన ఫంకీ, వివాదంతో సోసల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది.
ఇంతకి వివాదం ఏంటంటే,ఫంకీ మూవీలో కథ ఎలా ఉండాలనే విషయంలో దిల్ రాజు చెప్పే డైలాగ్ ....కథకి సంబంధం ఉన్నా లేకున్నా మైతాలజీని యాడ్ చేసి కథని వండాలి... త్రేతా యుగాలు , ద్వాపర యుగాలు, ఇలా క్రీస్తు పూర్తం, క్రీస్తు శకం లాంటివి యాడ్ చేసి, స్క్రిప్ట్ రెడీ చేసి ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేయాలి... ఇలాంటి మీనింగ్ వచ్చే దిల్ రాజు డైలాగ్ వివాదంగా మారింది. ఇది వారణాసి సినిమా మీదే వేస్తున్న సెటైర్ అనంటున్నారు. ఇప్పుడు రాబోయే సినిమాలు, వస్తున్న సినిమాల్లో ఈ డైలాగ్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేది వారణాసినే.. అలాంటి పాన్ వరల్డ్ మూవీ మీద, ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ మీద లూజ్ టాక్ చేస్తారా అనంటున్నారు ఫ్యాన్స్.. ఈవిషయంలో సూపర్ స్టార్ తో విశ్వక్ సేన్ పెట్టుకున్నాడనంటున్నారు.. తనకి డైరెక్ట్ గా సంబంధం ఉందా లేదా అటుంచితే, ఫంకీ పబ్లిక్ టాక్ తో కంటే, వివాదంతో వైరలౌతోందనే టాకే షాకిస్తోంది.