500 కోట్ల స్టార్స్… ముగ్గురు మొనగాళ్లే…!

100 కోట్ల వసూళ్లే ఒకప్పుడు గొప్ప.. అలాంటిది వందకోట్లు తీసుకునే స్టార్స్ అంటే అంతా ఖాన్లు, కపూర్లని ఆశ్చర్యంగా చూసేవాళ్లు.. సూపర్ స్టార్ రజినీకాంత్ 150 కోట్లు తీసుకుంటున్నాడంటే, అప్పుడదో హిస్టరీ.. కట చేస్తే రెబల్ స్టార్ 500 కోట్లుతో హాలీవుడ్ స్టార్స్ రేంజ్ కి ఎదిగాడు

Post Published By: dialnews
Updated : 26 March 2026, 9:00 PM IST

100 కోట్ల వసూళ్లే ఒకప్పుడు గొప్ప.. అలాంటిది వందకోట్లు తీసుకునే స్టార్స్ అంటే అంతా ఖాన్లు, కపూర్లని ఆశ్చర్యంగా చూసేవాళ్లు.. సూపర్ స్టార్ రజినీకాంత్ 150 కోట్లు తీసుకుంటున్నాడంటే, అప్పుడదో హిస్టరీ.. కట చేస్తే రెబల్ స్టార్ 500 కోట్లుతో హాలీవుడ్ స్టార్స్ రేంజ్ కి ఎదిగాడు.. తన తోపోలిస్తే, చాలా వేగంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 500 కోట్లని డ్రాగన్ తో టచ్ చేస్తున్నాడు. ఇంత హెవీ రెమ్యూనరేషన్ ని అందుకున్న తొలి భారతీయులే కాదు, తొలి దక్షణాది స్టార్లు.. తొలి తెలుగు వీరులు ఈ ఇద్దరు.. కట్ చేస్తే ఇప్పుడీ లిస్ట్ లోకి బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ వచ్చాడు. ఏకంగా 500 కోట్ల స్టార్ గా తనని ధురందర్ మార్చేసింది. రెండు సినిమాలతో తనకి 500 కోట్లకి పైనే గిట్టుబాటు అవుతోంది... ఇంతకి హాలీవుడ్ హీరోలకు మాత్రమే దక్కే, 500 కోట్లు, వెయ్యికోట్లు లాంటి రెమ్యునరేషన్స్ ప్రభాస్, ఎన్టీఆర్, రణ్ వీర్ సింగ్ కి ఎలా దక్కుతున్నాయి..? బన్నీ, యష్, మహేశ్ బాబు ఏ స్థానంలో ఉన్నారు?

ఖాన్లు కపూర్లు ఒకప్పుడు 120 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్లు.. తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసియాలోనే అథ్యదికంగా 150 కోట్ల పారితోషికంతో అప్పట్లో వార్తల్లో కెక్కాడు. కట్ చేస్తే బాహుబలి తర్వాత ప్రభాస్ 100 కోట్ల పారితోషికం రేంజ్ కి ఎదిగాడు. సాహోతో 150 కోట్లు, తర్వాత కల్కీ, సలార్ తో ఏకంగా 300 కోట్ల స్టార్ గా మారాడు. అదే షాకింగ్ న్యూస్ అనుకుంటే, స్పిరిట్ కి రెమ్యూనరేషన్ కమ్ ప్రాఫిట్ లో షేరింగ్ ప్రకారం తనకి, 500 కోట్ల నుంచి 550 కోట్లు దక్కేలా ఉంది.అందుకే హాలీవుడ్ స్టార్స్ లా ఏకంగా 500 కోట్లకు మించేలా పారితోషికం అందుకుంటూ, ప్రభాస్ పేరు కూడా వరల్డ్ స్టార్స్ లిస్ట్ లో చేరింది. కట్ చేస్తే ఇంచుమించు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ది ఇలాంటి స్టోరీనే. త్రిబుల్ ఆర్ తో 75 కోట్లు తీసుకునే స్టార్ గా మారి, దేవర తో ఏకంగా 150 కోట్లకు ఎగబాకాడు.. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన స్టార్ గా మారటంతో లెక్కే మారింది.

హిందీ వార్ 2 రిజల్ట్ ఎలా ఉన్నా ఆ మూవీకోసం 40 రోజులే పనిచేసినా 80 కోట్లు తీసుకున్నాడు. అంటే రోజుకి 2 కోట్లు దక్కినట్టే.. తర్వాత డ్రాగన్ కోసం ఏకంగా 350 కోట్లు అందుకుంటున్నాడన్నారు. ఇదులో 200 కోట్లు తన రెమ్యునరేషన్, 150 కోట్లు తనకు ప్రాఫిట్ లో దక్కే షేర్.. కట్ చేస్తే త్రివిక్రమ్ సినిమా, దేవర 2 రెండీంటికి భారీ మొత్తంలో ఎన్టీఆర్ కి దక్కేలా ఉన్నాయి.300 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు ప్రాఫిట్స్ లో షేర్ పరంగా మరో 200కోట్లు అదనం. అంటే గాడ్ ఆఫ్ వార్, దేవర 2 రెండీంటికి 500 కోట్ల చొప్పున వెయ్యికోట్లు వెనకేసుకునేలా ఉన్నాడు తారక్. ఇండియాలో ఇలాంటి ఫీట్ సాధ్యమైంది, అవుతోంది ఇద్దరికే.. ఒకరు పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రెండు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.

కట్ చేస్తే బాలీవుడ్ లో మంచి నటుడే కాని, మాస్ హిట్లు లేని స్టార్ గా మిగిలిన రణ్ వీర్ సింగ్ కి కూడా 500 కోట్ల కలొచ్చింది. ధురందర్ 1200 కోట్లు రాబడితే, అందులో తనకి 450 కోట్లు దక్కాయి.. ఇప్పుడు ధురందర్ 2 వారంలోనే వెయ్యికోట్లు రాబట్టింది. సీన్ చూస్తే 2 వేల కోట్లు మించేలా లాంగ్ రన్ ఉండేలా ఉంది. ఐతే ఈ సినిమా తీసిన దర్శక నిర్మాత ఆదిత్య ధర్ తో పాటు, రణ్ వీర్ సింగ్ కి ఈ మూవీ ప్రాఫిట్ లో షేర్ ఉంది. అలా చూస్తే ఈ ఇద్దరు చెరో 500 కోట్లు ఎకౌంట్ లో వేసుకునేలా ఉన్నారు.. అలాచూస్తే 500 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నా, కుంటున్న స్టార్స్ లిస్ట్ లో చూస్తే ప్రభాస్, ఎన్టీఆర్, రణ్ వీర్ సింగ్ పేర్లే కనిపిస్తున్నాయి. పుష్పరాజ్ గా రెండు సార్లు బాక్సాఫీస్ బెండు తీసిన బన్నీ కూడా 500 కోట్ల రెమ్యూనరేషన్ కి టచ్ చేయలేదు.. యష్ కి అంత సీన్ రాలేదు. వారణాసి వరల్డ్ వైడ్ గా దుమ్ముదులిపితే తప్ప మహేశ్ భవిష్యత్తు తెలియదు. ఏదేమైనా హాలీవుడ్ రేంజ్ లో మాత్రం మన దగ్గర ముగ్గురు మొనగాళ్లు 500 కోట్ల నెంబర్ ని టచ్ చేశారు.

Published : 
  • 26 March 2026, 9:00 PM IST