ఎవరీ మహేష్? హాలీవుడ్ హడావిడి…!

ఒక ఇండియన్ సినిమా అనౌన్స్‌మెంట్ వస్తే.. హాలీవుడ్ స్టూడియోలు ఎందుకు ఉలిక్కిపడుతున్నాయి? కాలిఫోర్నియాలోని టాప్ టెక్నీషియన్లు గూగుల్‌లో 'మహేష్ బాబు' అని ఎందుకు సెర్చ్ చేస్తున్నారు? దానికి కారణం ఒక్కటే.. దర్శకుడు రాజమౌళి.

Post Published By: dialnews
Updated : 1 May 2026, 10:15 PM IST

ఒక ఇండియన్ సినిమా అనౌన్స్‌మెంట్ వస్తే.. హాలీవుడ్ స్టూడియోలు ఎందుకు ఉలిక్కిపడుతున్నాయి? కాలిఫోర్నియాలోని టాప్ టెక్నీషియన్లు గూగుల్‌లో 'మహేష్ బాబు' అని ఎందుకు సెర్చ్ చేస్తున్నారు? దానికి కారణం ఒక్కటే.. దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా 'వారణాసి'. ఇది కేవలం తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా సత్తాను గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రుచి చూపించబోయే ఒక సునామీ! గతంలో 'RRR' సృష్టించిన ప్రభంజనం మనం చూశాం. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడం, జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి దిగ్గజాలు రాజమౌళిని ప్రశంసించడం హాలీవుడ్‌ను ఆలోచనలో పడేసింది. అమెరికన్ ఆడియన్స్ ఇప్పుడు రొటీన్ సూపర్ హీరో సినిమాల కంటే, రాజమౌళి మార్క్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడుతున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ కంటే మెరుగైన ఎమోషన్ మన సినిమాల్లో ఉండటంతో, వారి బిజినెస్ దెబ్బతింటుందని అక్కడి ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా కోసం హాలీవుడ్ టాప్ ఏజెన్సీ 'CAA' క్రియేటీవ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోవడం, హాలీవుడ్ స్టూడియోలకు ఒక హెచ్చరికగా మారింది. మహేష్ బాబును గతంలో 'మిల్క్ బాయ్' అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆయన రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు చేస్తున్న మేకోవర్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. గూగుల్ ట్రెండ్స్‌లో మహేష్ బాబు బ్యాక్ గ్రౌండ్ కోసం వెస్ట్రన్ కంట్రీస్ నుండి సెర్చ్ వాల్యూమ్ పెరిగింది. మహేష్ బాబు గ్రేస్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి "Who is this Indian Prince?" అని హాలీవుడ్ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి గత ఇంటర్వ్యూలలో మహేష్ బాబును 'ఇంటెన్స్ యాక్టర్' అని వర్ణించడంతో, ఆయన పాత సినిమాలను వెతికి మరీ చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా "గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా". ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంతో సాగుతుందని టాక్.

హాలీవుడ్ క్లాసిక్ 'ఇండియానా జోన్స్' తరహాలో ఉంటూనే, మన భారతీయ పురాణాల స్ఫూర్తి ఇందులో ఉంటాయని తెలుస్తోంది. సినిమా కథ వారణాసి పుణ్యక్షేత్రంతో మొదలై ప్రపంచాన్ని చుట్టి వచ్చే అడ్వెంచర్‌గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి ఏకంగా హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నారు. అవతార్', 'మార్వెల్' సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ ప్రాజెక్ట్ కోసం క్యూ కడుతున్నాయి. ఈ మాస్టర్ పీస్ కోసంఎం.ఎం. కీరవాణి మళ్ళీ ఒక అంతర్జాతీయ స్థాయి ఆల్బమ్‌ను సిద్ధం చేస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది.
రాజమౌళి విజన్, మహేష్ బాబు క్రేజ్ కలిస్తే అది బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే. 'వారణాసి' సినిమా కేవలం కలెక్షన్ల కోసమే కాదు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటడానికి వస్తోంది. అందుకే హాలీవుడ్ కంగారుపడటంలో తప్పు లేదు. ఎందుకంటే, ఒక తెలుగు 'సింహం' ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్ మీద వేటకు సిద్ధమైంది! ఏది ఏమైనా ఎవ్వడు కొడితే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవుతాయో అనేది హాలీవుడ్ కు తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఓపికగా ఉండడం తప్పదు మరి.

Published : 
  • 1 May 2026, 10:15 PM IST