సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారణాసి మీద ఎంతగా అంచనాల భారం ఉందో... అంతగానే అనుమానాలు భారం కూడా ఉంది.. పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి, డెఫినెట్ గా పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేస్తాడనే అందరూ ఆశపడుతున్నారు. కానిగ్లోబల్ ఛాలెంజెస్ ని వారణాసి టీం బ్రేక్ చేస్తేనే, పదివేల కోట్ల కల నెరవేరుతుంది. ఇంతకి ఏంటా ఛాలెంజెస్.. ఇక పాజిటివ్ సైడ్ చూస్తే ఛాలెంజెస్ ని బ్రేక్ చేసే అంశాలు కూడా వారణాసిలో లెక్కలేనన్ని ఉన్నాయి.. అంతేకాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ సినిమా వారాణాసి, ఎంతసేపు మైథలాజికల్ డ్రామా అన్న పాయింటే ఎక్స్ పోజ్ అవుతోంది, తప్ప అసలిది గ్లోబల్ అడ్వెంచరస్ మూవీ అన్న పాయింటే ఎక్కడ ఎలివేట్ కావట్లేదు. మామూలు సినిమాలోనే రాజమౌలి చూపించే అడ్వెంచర్స్ ఓరేంజ్ లో ఉంటాయి.. ఇక అడ్వెంచరస్ జోనర్ లో మూవీ అయితే, తను ఇంకెలా తీస్తాడో ఊహకందదు.. సో ఇంతకాలం మన సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యాయి.. కానిఫస్ట్ టైం వరల్డ్ ఆడియన్స్ ని ఒక ఇండియన్ మూవీ టార్గెట్ చేస్తోంది.. అదే వారణాసి... మరి పాన్ వరల్డ్ యుగం మొదలౌతుందా? రాజమౌళి ఈ ట్రెండ్ ని కూడా సెట్ చేసి చరిత్రలో నిలిచిపోతాడా?
రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేశాడు.. త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా రీచ్ పెంచుకున్నాడు.. ఇప్పుడు ఇండియన్ సినిమాలంటే, ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవటం కాదు, వరల్డ్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేవి అని ప్రూవ్ చేసే ప్రయత్నం లో ఉన్నాడు. ఆవిషయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుని తను హీరోగా ఎంచుకోవటమే ఫస్ట్ రైట్ డిసీజన్ వరల్డ్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఓ సినిమా తీస్తే, అందులో హీరోకి వరల్డ్ వైడ్ గా రీచ్ పెరిగేంత లుక్ ఉండాలి.. అలాంటి లుక్, స్క్రిన్ ప్రెజెన్స్, ఇంటర్నేషనల్ అప్పీల్ మహేశ్ బాబు సొంతం. అంటే ఎప్పుడు హీరోలకి రాజమౌళి ప్లస్ అవటమే కాదు, ఫస్ట్ టైం ఈ దర్శక ధీరుడికి కూడా హీరో ప్లస్ అవటం జరుగుతోంది. ఎలాగూ త్రిబుల్ ఆర్ తో వరల్డ్ మార్కెట్ ఎలా ఉందో కొంత వరకు అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాడు కాబట్టి, వారణాసి విషయంలో వరల్డ్ మార్కెట్ మీద తెలివిగానే రాజమౌళి ఎటాక్ చేస్తాడు. అలాంటి స్ట్రాటజీతోనే వస్తున్నాడు.
ఎంత సేపు వారణాసి అంటే రామాయనం, కాశీ నగరం, ఇండియన్ మైథాలజీ అన్న కోణంలోనే మనోళ్లు ప్రచారం చేస్తున్నారు. కాని ఇదో గ్లోబల్ అడ్వెంచర్... ఏడు ఖండాలు, ఏడు వింతలు, టైం ట్రావెల్, ఇలా ఒక విశ్వానికి సంబందించిన వస్తువు కోసం హీరో చేసే సాహాసాల యాత్రే వారనాసి... అన్నీంటికి మించి ట్రెజర్ హంట్ జోనర్ కి ఎప్పుడూ వరల్డ్ ఆడియన్స్ ఫిదా అవుతూ ఉంటారు.దానికి ఇండియన్ మైథాలజీ తోడైతే, వరల్డ్ ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ వచ్చినట్టౌతుంది. ప్రియాంక చోప్రాతో పోలిస్తే, హాలీవుడ్, యూరప్ లో రాజమౌళి, మహేశ్ బాబుకి అంతగా రీచ్ లేదు. ఇలాంటి ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా, కథ, అలానే హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్స్ ఈ మూవీని ఈజీగా వరల్డ్ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లే ఛాన్స్ఉంది. ఇక జంగిల్ అడ్వెంచర్స్, భారీ గ్రాఫిక్స్, హాలీవుడ్ నుంచి వచ్చి యాక్షన్ కొరియో గ్రపి చేస్తున్న టీం, ఫారెన్ టెక్నీషియన్స్, ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న సినిమా అవంట,.. ఇవన్నీ వరల్డ్ మీడియా అటెన్షన్ ని లాక్కునేవే.
ఇక నాటు నాటు పాట టైంలో, త్రిబుల్ ఆర్ ఇంటర్వెల్ సీన్ లో వరల్డ్ ఆడియన్స్, హాలీవుడ్ ఏం ఇష్టపడిందో చూసిన రాజమౌళి, వారణాసిలో ఆ మసాలా యాడ్ చేయకుండా ఉంటాడా? దీనికి తోడు అంటార్కిటికాలో తెరకెక్కుతున్న ఐదో ప్రపంచ సినిమాగా వారణాసికి గుర్తింపు రావటం, కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వార్తగా మారేలా చేస్తోంది. ఏదేమైనా వారణసి కనక అమెరికన్స్,యూరోపియన్స్, ఆఫ్రికన్స్, అలానే సౌత్ ఆమెరికన్స్ అయినా బ్రేజీలియన్స్ ఇలా ఎక్కడ కొంత పేరు, వసూల్లొచ్చినా, పాన్ వరల్డ్ గేట్లు తెరుచుకున్నట్టే... వారనాసి కొత్త ట్రెండ్ సెట్ చేసినట్టే... దానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి... ఈ సినిమాతో ఇండియన్ సినిమా అంటే పాటలు, రొమాన్స్ కాదు, ఈప్రపంచానికి తెలియని ఇంకో కోణం ఉందనే బ్రాండ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి.