డ్రాగన్ గా మారిన టైగర్… షేకింగ్ లుక్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మళ్లీ బొద్దుగా మారాడు. అది కూడా సూపర్ స్టైలిష్ లుక్ తో ఇండియానే షేక్ చేసేలా ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఎన్టీఆర్ ఇమేజ్, ఫ్యాన్స్ నే కాదు ఇండస్ట్రీనే షేక్ చేసేలా ఉంది.

Post Published By: dialnews
Updated : 9 May 2026, 6:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మళ్లీ బొద్దుగా మారాడు. అది కూడా సూపర్ స్టైలిష్ లుక్ తో ఇండియానే షేక్ చేసేలా ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఎన్టీఆర్ ఇమేజ్, ఫ్యాన్స్ నే కాదు ఇండస్ట్రీనే షేక్ చేసేలా ఉంది. మొన్నటి వరకు చిక్కిపోయిన లుక్ తో షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ ఎంతలో ఎంతగా మారిపోయాడు..? అదికూడా నమ్మలేనంతగా, ఎవరూ ఊహించలేనంతగా ఛేంజ్ అయ్యాడు. ఆల్రెడీ యంగ్ టైగర్ ని ప్రశాంత్ నీల్ డ్రాగన్ గా ఎలా మారుస్తున్నాడో అన్న టెన్షన్ ఫ్యాన్స్ లో ఉంది. దీనికి తోడు టీజర్లు, గ్లింప్స్ లు లేక, అసలేం జరుగుతోందన్న కంగారు కూడా వాల్లలో కనిపిస్తూనే ఉంది. ఇక డ్రాగన్ కథ మారిందని, షూట్ చేసిన సీన్లకు రిపేర్లని, చాలా వరకు పుకార్లు కూడా పెరిగాయి. ఇలాంటి టైంలో మైండ్ బ్లాంక్ అయ్యే లుక్ తో కిక్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఎడారిలో వర్షం పడటమే వింతనుకుంటే, అక్కడ తుఫాన్ మొదలైతే ఎలా ఉంటుంది..? అదే జరుగుతోంది. నిజంగా, టైగర్ ని డ్రాగన్ గా మార్చి ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడా..? ఒక్క ఫోటోనే ఇంత భీభత్సం స్రుస్టిస్తే, మే 20న వచ్చే టీజర్ తో ఇంకెంత సినీ సునామీ రావొచ్చు..?

టెంపర్ లో ఎన్టీఆర్ లుక్ ఎంత కిక్ ఇచ్చిందో.. అందులో తనేసిన పాత్ర అంతకంటే షాక్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే ఆ పాత్ర వల్లే పెర్ఫామెన్స్ లో పీక్స్ చూపించగలిగాడు ఎన్టీఆర్. కట్ చేస్తే మళ్లీ తన కెరీర్ లో ఎవరూ ఊహించనంత స్టైలిష్ గా ఇప్పుడే కనిపిస్తున్నాడు. ఎంత మాస్ స్టార్ అయినా, కొన్ని సార్లు స్టైల్ మార్చుకోకతప్పదు.నాన్నకు ప్రేమతో లో పిల్లిగడ్డం తో ఇంప్రెస్ చేసిన ఎన్టీఆర్, వార్ 2, డ్రాగన్ లుక్స్ విషయంలో మొన్నటి వరకు కంగారు పెట్టాడు. 14 కిలోల వేయిట్ తగ్గి, ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. కట్ చేస్తే కంప్లీట్ లుక్కే మారిపోయింది. వెరీ స్టైలిష్ గా హేయిర్, అంతకంటే స్టైలిష్ గా తన గెడ్డం లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఊహించని కిక్ ఇచ్చాడు.

తన ఇన్ స్టా ఎకౌంట్ లో ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఊఫిరి తీసుకోవటం కాదు, పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే డ్రాగన్ లో పాత్రకోసం బక్క చిక్కిన ఎన్టీఆర్, హెల్త్ తోనే కాదు తన, లుక్ తో కూడా రిస్క్ చేస్తున్నాడని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. అలాంటిది వన్ మంథ్ గ్యాప్ లో ఎన్టీఆర్ ఎంతగా మారిపోయాడు. డ్రాగన్ కొత్త పోస్టర్ లో కంటే కూడా, ఇప్పడు ఇంకా కాస్త బొద్దుగా స్టైలిష్ గా మారాడు.ఇక డ్రాగన్ కి ఈ లుక్ బాగా నప్పుతుందనే సంత్రుప్తి ఫ్యాన్స్ లో బలంగా పెరిగిపోతోంది. ఇక తేలాల్సింది డ్రాగన్ కంటెంట్ ఎలా ఉండబోతోందో.. ఎన్టీఆర్ బర్త్ డేకి ముందు ఇలా తన లుక్ తో తమన్ కిక్ ఇస్తే, గ్లింప్స్ తో ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడో అన్న అంచనాలున్నాయి.. ఇంతవరకు అంతా ఎన్టీఆర్ అంటే యంగ్ టైగర్ నే చూశఆరు.. కాని తనని డ్రాగన్ గా ప్రశాంత్ నీల్ మార్చేస్తున్నాడు.అది మెల్లిగా తెలుస్తూ వస్తోంది. కేజీయఫ్ లో హీరోని మాన్ స్టార్ గా చూపించిన ప్రశాంత్ నీల్, సలార్ లో ప్రభాస్ ని డైనోసార్ గా మార్చాడు.

ఇప్పుడు ఈ రెండు కలిస్తేనే డ్రాగన్ అన్నట్టు మాస్ డిస్ట్రక్షన్ చూపించబోతున్నాడు. బేసిగ్గా చైనా, జపాన్, యూరప్ లో డ్రాగన్ అంటే, ఏదో నిప్పుల వర్షం కురిపించే జీవి మాత్రమే కాదు... పవర్ కి సింబల్... కింగ్ డమ్ కి వేహికిల్...ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు రాజ్యాలనే క్రియేట్ చేసి వాటినేలుతారు... సో డ్రాగన్ గా ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఆసియా రాజ్యాని ఏలబోతున్నాడా? సాధారణంగా ప్రశాంత్ నీల్ హీరోలు యాంగర్ డ్రివెన్ ఆల్ఫా మేల్స్... అంటే రా బీస్ట్ మోడ్ లో ఉంటారంతా3... తన సినిమాలో హీరోయిజం అంటే ఎలివేషన్ కాదు, కంట్రోల్డ్ డిస్ట్రక్షన్ అంటారు.. అదే గ్లింప్స్ వస్తే తేలుతుంది. అంతుకుముందే తన కొత్తలుక్ తో చాలా మందికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఎలా చూసినా హీరో యష్ లోని యాటిట్యూడ్, ప్రభాస్ కున్న ఔరా ఈ రెండీంటిని మించేలా కంట్రోల్ చేయలేని అగ్నిపర్వతంలాంటి ఎనర్జీ ఎన్టీఆర్ సొంతం... కాబట్టే, మరో వారం రోజుల్లో డ్రాగన్ ఫైర్ అంటున్న టైంలో, ఇలా కొత్త లుక్ సోషల్ మీడియాని షేక్ చేయటం శుభ సూచికం.

Published : 
  • 9 May 2026, 6:15 PM IST