బ్రేకింగ్: పవన్ తో సయోధ్య, అమరావతికి అల్లు అరవింద్…?

మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని త్వరగా ముగించాలని టాలీవుడ్ పెద్దలు కోరుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో అల్లు, మెగా కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Post Published By: Vencateshg
Updated : 1 September 2024, 1:19 PM IST

మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని త్వరగా ముగించాలని టాలీవుడ్ పెద్దలు కోరుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో అల్లు, మెగా కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే మాత్రం అనేక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉండవచ్చు. సినిమా పరిశ్రమ రెండుగా చీలినా ఆశ్చర్యం లేదు. అందుకే ఇప్పుడు అల్లు అరవింద్ భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమస్య తీవ్రత క్రమంగా పెరిగే సూచనలే ఎక్కువగా కనపడుతున్నాయి.

అందుకే ఇప్పుడు అల్లు అరవింద్... పవన్ కళ్యాణ్ తో భేటీ కావాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ పై జనసేన నేతలు విమర్శలు చేస్తున్న నేపధ్యంలో దానికి అడ్డుకట్ట వేయించాలని ఆయన భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయి సమస్యకు పరిష్కారం చూడాలని, అనవసరంగా పెద్దది చేయవద్దనే భావనలో ఆయన ఉన్నారట. వచ్చే వారం ఆయన అమరావతి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్తే అక్కడ అయినా కలవాలని ఆయన భావిస్తున్నారు.

అటు చిరంజీవి తో కూడా అల్లు అరవింద్ భేటీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వివాదం ఒక రాజకీయ పార్టీకి మేలు చేకూర్చే అవకాశం ఉన్న నేపధ్యంలో దీనికి వీలైనంత త్వరగా పరిష్కారం చూపకపోతే మాత్రం అనవసరమైన భయాలు సిని పరిశ్రమలో మొదలయ్యే అవకాశం ఉందని మెగా ఫ్యామిలీ కూడా ఆందోళన చెందుతుంది. అటు ఫ్యాన్స్ కూడా రెండుగా చీలితే సినిమా విడుదల సమస్యలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా అడుగులు వేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరు తగ్గుతారు అనేది చూడాలి. అటు అల్లు అర్జున్ తో కూడా అరవింద్ మాట్లాడారట. అందుకే జనసేన నేతల వ్యాఖ్యలపై అల్లు అర్జున్ సైలెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది.

Published : 
  • 1 September 2024, 1:19 PM IST