వారణాసి టీజర్ కి ముహుర్తం.. ట్రైలర్ కి జేమ్స్ కామెరున్…!

వారణాసి టీజర్ కి హాలీవుడ్ లివింగ్ లెజెండ్ జేమ్స్ కామెరున్ వస్తాడన్నారు. కాని అసలు టీజర్ లాంచ్ కాలేదు.. జేమ్స్ కామెరున్ రాలేదు. కాని వారణాసి మూవీ కాన్సెప్ట్ గ్లింప్స్ మాత్రం గ్రాండ్ గా రిలీజ్ చేసింది ఫిల్మ్ టీం.

Post Published By: dialnews
Updated : 20 February 2026, 5:15 PM IST

వారణాసి టీజర్ కి హాలీవుడ్ లివింగ్ లెజెండ్ జేమ్స్ కామెరున్ వస్తాడన్నారు. కాని అసలు టీజర్ లాంచ్ కాలేదు.. జేమ్స్ కామెరున్ రాలేదు. కాని వారణాసి మూవీ కాన్సెప్ట్ గ్లింప్స్ మాత్రం గ్రాండ్ గా రిలీజ్ చేసింది ఫిల్మ్ టీం. కేవలం జేమ్స్ కామెరున్ రాలేదనే, టీజర్ బదులు గ్లింప్స్ ని రాజమౌళి వదిలాడని ప్రచారం జరిగింది.. కాని ఇప్పడు మళ్లీ కొత్తగా టీజర్ ని లాంచ్ చేయాలనుకున్నా జేమ్స్ కామెరున్ ని పిలవట్లేదట. అలాని తను రావట్లేదని కాదు.. టైటానిక్, అవతార్ లాంటి క్లాసిక్స్ తీసిన తనకి, అవతార్ 3 వ మూవీ పంచ్ ఇచ్చింది. కాబట్టే లెక్కలు మారినట్టున్నాయి... ఐతే ఇప్పుడు మళ్లీ మనసు మారిందో, ప్రమోషన్ పద్దతి మార్చాల్సి వచ్చిందో, ఏకంగా ట్రైలర్ లాంచ్ కే జేమ్స్ కామెరున్ ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఈ సారి రంగంలోకి రాజమౌళితోపాటు నెం.1 ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా రంగంలోకి దిగింది. ఇంతకి టీజర్ ఎప్పుడు? ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ఇంకెప్పుడు?

వారణాసి టీజర్ విషయంలో సెన్సేషన్ ఏదో జరిగే టైం వచ్చిందా..? మొదటి నుంచి లోకల్ మీడియాను, నేషనల్ మీడయాను పూర్తిగా పక్కన పెట్టేశాడు రాజమౌళి. ఏం చేసినా, వరల్డ్ మీడియాలోనే ముందు రావాలి... అదేం లెక్క...? రాజమౌలి మనకు గొప్ప దర్శకుడు కావొచ్చు,... వరల్డ్ వైడ్ గా కూడా కొద్దో గొప్పో గుర్తింపు దక్కొచ్చు.. నాటు నాటు పాట, దానిక ఆస్కార్ రావటం... ఆస్కార్ సీజన్ లో జేమ్స్ కామేరున్ తో తన చర్చ వైరల్ అవటం.ఇవన్నీ తనకి వరల్డ్ వైడ్ గా కాస్త పేరుతేవచ్చు.. అంతమాత్రాన తనేదో పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడంటే వరల్డ్ మీడియా క్యూ కట్టేయదు.. కాబట్టే అమెరికన్ రిపోర్టర్లను పిలిపించుకుని ప్రమోషన్ చేస్తున్నాడు రాజమౌలి. ఇది లోకల్ మీడియా, నేషనల్ మీడియాకు కాస్త నచ్చట్లేదు. కారణం , వాళ్లకి అంత ప్రయారిటీ ఇచ్చి, ఇక్కడి వాల్లని లైట్ తీసుకోవటమే కారణం.

నిజానికి అదే కారణమో, లేదంటే ప్రమోషన్ లో భాగంగా ఇదో రకం స్ట్రాటజీనో కాని, ఇప్పడు అసలు సిసలు ట్విస్ట్ రాబోతోంది. అవతార్ 3 రిలీజ్ టైంలో ఇండియాకొచ్చే జేమ్స్ కామెరున్ చేతుల మీదుగా వారనాసి టీజర్ లాంచ్ చేయాలనుకున్న రాజమౌలి ఐడియా వర్కవుట్ కాలేదు. అవతార్ 3 ఆడలేదు. కామెరున్ రాలేదు.. అందుకే జస్ట్ కాన్సెప్ట్ గ్లింప్స్ ని మాత్రమే రిలీజ్ చేసిన రాజమౌళి, తెరవెనక పెద్ద ప్లానే వేశాడు.పట్టువదలని విక్రమార్కుడిగా, జేమ్స్ కామెరున్ చేతుల మీదుగా వారణాసి ప్రోమో లాంచ్ చేయటం కన్పామ్ చేశాడు.

ఈసారి టీజర్ కాదు.. ఏకంగా ట్రైలరే లాంచ్ చేయించే పనిలో ఉన్నాడు. మోస్ట్ లీ టీజర్ ని మాత్రం హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ చేతుల మీదుగా లాంచ్ చేయించేప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. ఇది ఉగాది కి లేదంటే ఏప్రిల్ ఎండ్ కి చేసేలా, అది విల్ స్మిత్ కంఫర్ట్ ని బట్టి ప్లాన్ చేయాలనుకుంటున్నాడట.ఇక ఆగస్ట్ 15 లేదంటే దసరా సీజన్ లో అది కూడా కాశీలో జేమ్స్ కామెరున్ చేతుల మీదుగా వారణాసి ట్రైలర్ లాంచ్ చేయాలనేది సరికొత్త ప్లాన్ అని తెలుస్తోంది. వన్స్ విల్మ్ స్మిత్ చేతుల మీదుగా టీజర్ వస్తే, వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కు కొంత బజ్ వస్తుంది... ఆతర్వాతే జేమ్స్ కామెరున్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయిస్తే, వరల్డ్ మార్కెట్ లో కావాల్సినంత అటెన్షన్ దక్కుతుంది.

Published : 
  • 20 February 2026, 5:15 PM IST