వారణాసి మూవీ విషయంలో నేషనల్ మీడియా, లోకల్ మీడియా కొంత డిసప్పాయింటెడ్ గా ఉందనేది వాస్తవం... మొదట్నుంచి రాజమౌళి వారణాసి ప్రమోషన్ విషయంలో యూఎస్ మీడియాకే హై ప్రయారిటీ ఇస్తున్నాడు. వాళ్లని పిలిపించుకుని మరీ ఇంటర్వూలు ఇస్తున్నాడు.. ఇప్పుడు మూడో ఇంటర్వూ ఏకంగా టెక్నికల్ టీంతో కలిసి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా అమెరికన్ యూ ట్యూబర్స్ కే ఆఫర్లు వెల్లినట్టు తెలుస్తున్నాయి.ఇక్కడ లాంచ్ నుంచి కాన్సెప్ట్ గ్లింప్స్ ఈవెంట్ వరకు ప్రతీ విషయంలో, లోకల్ , నేషనల్ మీడియాను లైట్ తీసుకున్నాడు జక్కన్న.. ఇప్పుడు అదే చేస్తున్నాడా అన్నడౌట్లు పెరిగిన టైంలో, రాజమౌళి ప్రపంచ ముదురు ప్లానింగ్ మెల్లిగా అందరికీ అర్ధమౌతున్నట్టుంది.. త్రిబుల్ ఆర్ డైలాగ్ నే ఇక్కడ జక్కన్న ఫాలో అవుతన్నట్టున్నాడు.. నక్కి నక్కి కాదు తొక్కుకుంటూ పోవాలే.. అదే చేస్తున్నాడా? 30 నిమిషాల ఎపిసోడ్ అంటూ రెండు ఎపిసోడ్ల మీదే ఎందుకు అమెరికన్ యూ ట్యూబర్స్ కి ఇంటర్వూ ఇస్తున్నాడు. అంత చిన్న యూ ట్యూబర్స్ తో హాలీవుడ్ లో ఈ సినిమ రీచ్ ఎలా పెరుగుతుంది? అక్కడే ట్విస్ట్ ఉంది.. ఈ మొత్తం తతంగం వెనక ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఉన్నట్టు తెలుస్తోంది... ఇంతకి ఇందులో ఉన్న మార్కెటింగ్ ట్విస్ట్ ఏంటి?
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న మైథలాజికల్, ఫాంటసీ యాక్సన్ డ్రామా వారణాసి. 1400 కోట్ల ఈ హై బడ్జెట్ మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్ తో ఫైట్ కి సిద్దమౌతున్నాడు రాజమౌలి. అంతా బానే ఉంది కాని, లోకల్ మీడియాని పక్కకు పెట్టి, నేషలన్ మీడియాని వెనక్కి నెట్టి, కేవలం అమెరికన్ మీడియా వెంటబడటమే చాలా మంది కి నచ్చట్లేదు.అది కూడా అమెరికాలో దిక్కూ మొక్కు లేని చిన్నా చితకా యూ ట్యూబర్స్ ని పలిచి ఎందుకు ఇంటర్వూలు ఇస్తాున్నాడని, ఆమధ్య కామెంట్లు పేలాయి.. అయినా అదే పద్దతితో ఇప్పడు తన టెక్నికల్ టీంతో కలిసి మరో ఇంటర్వూని అమెరికన్ యూ ట్యూబర్ కే ఇస్తున్నాడట. ఏంటిది? ఇక్కడ వెంటబడి రిక్వెస్ట్ చేసినా తెలుగుమీడియాను పట్టించుకోవట్లేదు.
అసలు వారణాసి లాంచ్ ని కూడా సీక్రెట్ గా నే కానిచ్చారు. సడన్ గా పాటలు వదిలారు. గ్లింప్స్ ఈవెంట్ విషయంలో కూడా లోకల్ మీడియానే కాదు, నేషనల్ మీడియాను పక్కన పెట్టాడు.ఇప్పడు కూడా అదే చేసేలా ఉన్నాడు. ఇదే లోకల్, నేషనల్ మీడియాలో వారణాసి మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందేమో అని అంతా అనుకున్నారు.కాని ఓటీటీ సంస్త నెట్ ఫ్లిక్సే ఇలా వారణాసిని ప్రమోట్ చేస్తోందట. రాజమౌలి కూడా నెట్ ఫ్లిక్స్ తో పాటు హాలీవుడ్ ఏజెన్సీ గైడెన్స్ ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఎవరెంతగా గైడ్ చేసినా, అమెరికన్స్, యూరోపియన్స్ కి బాగా రీచ్ అయ్యేలా పెద్ద చానల్స్, పెద్ద షోలలో వారణాసిని ప్రమోట్ చేస్తే ఉపయోగం.. కాని ఎందుకు ఇలా తెల్లోల్ల చిన్న యూ ట్యూబ్ చానల్ కి ఇంటర్వూలనే డౌట్లు రావటం కామన్.
ఐతే, నెట్ ఫ్లిక్స్ తో పాటు గూగుల్ వరకు చాలా సంస్థలను రంగంలోకి దింపుతున్న హాలీవుడ్ ఏజెన్సీ... ఇలా కనీసం 100యూ ట్యూబ్ ఛానల్స్ లో వారాణాసి కంటెంట్ ఉంటే, ఇది రిలీజ్ అయ్యే టైంకి హాలీవుడ్ మార్కెట్ లో ఈజీ రీచ్ పెరగొచ్చనే అప్రోచ్ ని ఫాలో అవుతోందంట.. అదెలాగంటే, వారణాసి రిలీజ్ కి కనీంస 2 నెలల ముందు, యూ ట్యూబ్ లో కనిపించే ప్రతీ చిన్న ఛానల్ నుంచి పెద్ద చానల్ వరకు వారణాసి కంటెంట్ ఉంటే, అప్పుడు దానికి గ్లోబల్ సినిమాగా గుర్తింపు దక్కుతుందట.ప్రియాంక చోప్రా తప్ప ఈ మూవీ లో వరల్డ్ మార్కెట్ ని ఆకట్టుకునే కటౌట్లు లేకపోవటం వల్లే, చిన్నా చితకా అని కాకుండా, అమెరికా, యూరప్ కి చెందిన యూ ట్యూబర్స్ కి ఇంటర్వూలు ఇవ్వటం వెనక ఇంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఓరకంగా చిన్న మొత్తాల పొదుపు, ఒక టైం వచ్చాక పెద్ద మొత్తంగా మారినట్టు, ఇదో రకం మార్కెటింగ్ స్ట్రాటజీ... నార్త్ వాళ్లు మనల్ని పట్టించుకోని టైంలో బాహుబలి రిలీజ్ చేస్తూ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యాడో, అచ్చంగా అదేస్ట్రాటజీని, పాన్ వరల్డ్ మార్కెట్ లో ఫాలో అవుతున్నాడట జక్కన్న.